వన్‌ప్లస్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్లు.. 6.82 అంగుళాల డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా సహా కీలక ఫీచర్లు..!
వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్‌పై (Oneplus 12 launch date) ఇటీవల ఎక్కువగా చర్చ జరిగింది. ఈ స్మార్ట్‌ఫోన్ జనవరి 23న భారత్‌లో విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్ కీలక ఫీచర్లకు సంబంధించిన టీజర్‌లు ఇప్పటికే విడుదల అయ్యాయి. ఫలితంగా ఈ వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన అనేక వివరాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.
వన్‌ప్లస్ 12 స్పెసిఫికేషన్లు : భారత్‌లో వన్‌ప్లస్ 12 హ్యాండ్‌సెట్ 6.82 అంగుళాల QHD+ 3D కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ 120Hz రిప్రెష్ రేట్ సహా 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వచ్చే అవకాశం ఉంది. కార్నింగ్ గొరెల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణతో వస్తుంది.

కొత్త వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ శక్తివంతమైన స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ మరియు అడెన్నో 750 GPU పై పనిచేసే అవకాశం ఉంది. ఈ ఫోన్ గరిష్ఠంగా 24GB ర్యామ్, 512GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటే అవకాశం ఉంది. వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యా్న్ని కలిగి ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత OSను కలిగి ఉంటుంది.
దీంతోపాటు మెరుగైన కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఫోన్ వెనుకవైపు 50MP ప్రధాన కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 64MP టెలీఫోటో కెమెరా, 48MP అల్ట్రావైడ్ కెమెరాలను కలిగి ఉంటుంది. అదే 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.

భారత్ మార్కెట్‌లో వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ ధర రూ.60,000 నుంచి రూ.70,000 మధ్య ఉండే అవకాశం ఉంది. అయితే ఈ ధరపై సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, గ్రీన్, తెలుపు రంగుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీని ఇప్పటికే సంస్థ అధికారికంగా ధ్రువీకరించింది. ఈ హ్యాండ్‌సెట్‌తోపాటు వన్‌ప్లస్ 12R, వన్‌ప్లస్ బడ్స్ 3 కూడా లాంచ్ అవుతున్నాయి.
వన్‌ప్లస్ 12R స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు !: లీక్‌ల ఆధారంగా వన్‌ప్లస్ 12R హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్ ఆధారిత ఆక్సిజన్OS 14 పైన పనిచేస్తుంది. 6.78 అంగుళాల LTPO 4.0 ProXDR స్క్రీన్‌తో వస్తుంది. 120Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. మరియు గొరెల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రాటెక్షన్‌తో వస్తుంది.
వెనుకవైపు ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంటుంది. 50MP IMX890 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 2MP మ్యాక్రో సెన్సార్‌తో వస్తుంది. మరియు ముందువైపు సెల్పీ, వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 100W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5500mAh బ్యాటరీతో వస్తుంది.
వన్‌ప్లస్ 12R స్మార్ట్‌ఫోన్ బ్లాక్, బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ కూడా గరిష్ఠంగా 16GB ర్యామ్, 512GB స్టోరేజీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు ఈ ఫోన్ ధర రూ.40,000 నుంచి రూ.42,000 గా ఉందని తెలుస్తోంది. ఈ ఫీచర్లపై వన్‌ప్లస్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








