OnePlus 12 ఇండియా ధర, అమెజాన్ లో లీక్ అయింది! ధర ఎంతంటే...?
OnePlus 12 సిరీస్ ఫోన్లు జనవరి 23న భారతదేశంలో OnePlus 12R తో పాటుగా లాంచ్ కాబోతున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఈ అధికారిక లాంచ్ ముందు, అమెజాన్ ఇండియా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ధరను అనుకోకుండా లీక్ చేసింది. అయితే, వెంటనే ఇ-కామర్స్ దిగ్గజం ఆ ధరలను తొలగించింది.
అయితే, ఒక టిప్‌స్టర్ ఈ లిస్టింగ్ యొక్క స్క్రీన్‌షాట్‌ను పట్టుకోగలిగాడు. OnePlus 12 మొదట చైనాలో లాంచ్ అయినా విషయం ఇదివరకే తెలిసిందే. ఇది స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 SoC ప్రాసెసర్ పై పనిచేస్తుంది మరియు 100W వైర్డు సూపర్ ఉక్కు ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,400mAh బ్యాటరీని కలిగి ఉంది.

ప్రముఖ టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ (@ishanagarwal24) అమెజాన్‌లో వన్ ప్లస్ 12 ధర జాబితాను గుర్తించారు. టిప్‌స్టర్ పోస్ట్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం, 12GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ కోసం ధర రూ.69,999 నుండి ప్రారంభమవుతుంది. అయితే, ఈ కథనాన్ని వ్రాసే సమయంలో ఈ హ్యాండ్‌సెట్ ధర వివరాలు అమెజాన్ జాబితాలో తీసివేయబడ్డాయి.
OnePlus 12 ఫోన్లు జనవరి 23న వన్ ప్లస్ యొక్క 'స్మూత్ బియాండ్ బిలీఫ్' ఈవెంట్‌లో భారతదేశంతో సహా గ్లోబల్ మార్కెట్‌లలో ప్రకటించబడుతుంది. వన్ ప్లస్ 12R కూడా దానితో పాటు ప్రారంభమవుతుంది.
వన్ ప్లస్ 12 గత ఏడాది డిసెంబర్‌లో చైనాలో లాంచ్ అయినప్పుడు, దాని ప్రారంభ ధర CNY 4,299 (దాదాపు రూ. 50,700) బేస్ 12GB RAM + 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ కోసం నిర్ణయించబడింది. ఇది చైనాలో లేత ఆకుపచ్చ, రాక్ నలుపు మరియు తెలుపు రంగులలో అందుబాటులో ఉంది.
వన్ ప్లస్ 12 యొక్క భారతీయ వేరియంట్ చైనాలో ప్రారంభించబడిన మోడల్‌కు సమానమైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది Android 14 ఆధారిత ColorOS 14పై నడుస్తుంది మరియు 6.82 అంగుళాల క్వాడ్-HD+ (1,440 x 3,168 పిక్సెల్‌లు) LTPO OLED స్క్రీన్‌తో గరిష్టంగా 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 4,500 nits గరిష్ట ప్రకాశం కలిగి ఉంది. ఇది 24GB వరకు LPDDR5X RAM తో 4nm స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 SoC ద్వారా శక్తిని పొందుతుంది.
వన్ ప్లస్ 12 లో హస్సెల్ బ్లెడ్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ మరియు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇది 1TB వరకు UFS 4 అంతర్నిర్మిత స్టోరేజీ ని కలిగి ఉంది మరియు 100W సూపర్ ఊక్ ఛార్జింగ్ 50W వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,400mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఇదే,రోజున లాంచ్ కాబోతున్న OnePlus 12R స్పెసిఫికేషన్‌ల వివరాలు కూడా లీక్ అయ్యాయి. ప్రస్తుతం, OnePlus Ace 3 చైనాలో లాంచ్ అయింది, OnePlus 12R దాని చైనీస్ మోడళ్ల మాదిరిగానే అదే స్పెసిఫికేషన్‌లతో వస్తుందని మనము ఆశించవచ్చు. ఈ వన్ ప్లస్ 12R స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌తో వస్తుందని అంచనా వేయబడింది. గరిష్టంగా 16GB వరకు LPDDR5x RAMతో జత చేయబడింది.
ఈ హ్యాండ్‌సెట్ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల LTPO AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది మరియు గరిష్ట ప్రకాశాన్ని 4,500 నిట్‌ల వరకు కలిగి ఉంటుంది.ఈ డిస్‌ప్లే HDR కి మద్దతును అందిస్తుంది మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణను కలిగి ఉంది.వన్ ప్లస్ 12R స్మార్ట్ ఫోన్ USB టైప్-సి పోర్ట్ ద్వారా 100W సూపర్ ఊక్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,500mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








