Home
News

12GB ర్యామ్‌, 5400mAh బ్యాటరీ, 6.82 అంగుళాల భారీ డిస్‌ప్లే OnePlus స్మార్ట్‌ఫోన్‌ పై భారీ డిస్కౌంట్‌..!

భారత్‌లో వన్‌ప్లస్‌ 13 సిరీస్‌ ఇటీవల లాంచ్‌ అయింది. ఈ సిరీస్‌లో భాగంగా వన్‌ప్లస్‌ 13, 13R హ్యాండ్‌సెట్‌లు అందుబాటులోకి వచ్చాయి. మరియు సేల్‌ కూడా ప్రారంభం అయింది. అయితే ప్రస్తుతం వన్‌ప్లస్ 12 హ్యాండ్‌సెట్‌ను ఏకంగా రూ.10,000 కంటే ఎక్కువ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్ 12 ఫోన్ (OnePlus 12 Smartphone) ఫ్లాగ్‌షిప్‌ మోడల్స్‌లో ఒకటిగా ఉంది. ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌ లో (Flipkart) ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.

సుమారు రూ.10000 తగ్గింపు! :
వన్‌ప్లస్‌ 12 స్మా్ర్ట్‌ఫోన్‌ గత సంవత్సరం జనవరిలో భారత్‌ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. విడుదల సమయంలో ఈ హ్యాండ్‌సెట్‌ ధర రూ.64,999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.55,500 గా ఉంది. ఈ ఫోన్‌ గ్లేసియల్‌ వైట్‌ వేరియంట్‌ ఈ ధరకు అందుబాటులో ఉంది.

Oneplus 12 Smartphone price drop

అయితే HDFC బ్యాంకు కార్డుల ద్వారా అదనపు డిస్కౌంట్‌ను పొందవచ్చు. HDFC క్రెడిట్‌ కార్డు ట్రాన్సాక్షన్‌లతో రూ.1000 తగ్గింపును పొందవచ్చు. అదే EMI ట్రాన్సాక్షన్‌ ద్వారా రూ.1500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్‌ బ్యాంకు కార్డులతో 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది.

వన్‌ప్లస్‌ 12 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
వన్‌ప్లస్‌ 12 స్మార్ట్‌ఫోన్‌ 6.82 అంగుళాల LTPO అమోలెడ్‌ 2k డిస్‌ప్లేతో ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్, 2160Hz PWM డిమ్మింగ్‌ను కలిగి ఉంది. కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ విక్టస్‌తో డిస్‌ప్లే రక్షణను కలిగి ఉంది.

Oneplus 12 Smartphone price drop

చిప్‌సెట్‌, OS వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OxygenOS 14 ను కలిగి ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఈ చిప్‌సెట్‌ Adreno 750 చిప్‌సెట్‌ మరియు 16GB LPDDR4X ర్యామ్‌, 512GB UFS 4.0 స్టోరేజీతో జతచేసి ఉంది. 12GB ర్యామ్‌ / 256GB స్టోరేజీ, 16GB ర్యామ్ /512GB స్టోరేజీ వేరియంట్స్‌లో ఉంది.

26 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్‌ :
ఈ హ్యాండ్‌సెట్‌ 4 ఆండ్రాయిడ్‌ OS, 5 సంవత్సరాలు సెక్యూరిటీ అప్‌డేట్‌లు పొందుతుందని వన్‌ప్లస్‌ తెలిపింది. ఈ హ్యాండ్‌సెట్‌ 5400mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఈ ఫోన్‌ 100W ఫాస్ట్‌ ఛార్జింగ్, 50W Supervooc వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంది. కేవలం 26 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేయవచ్చు. 220 గ్రాముల బరువును కలిగి ఉంది.

50MP + 64MP+ 48MP కెమెరాలు :
వన్‌ప్లస్‌ 12 స్మార్ట్‌ఫోన్‌ ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ LYT-808 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ ప్రైమరీ కెమెరా OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. 3X జూమ్‌తో 64MP OmniVision OV64B పెరిస్కోప్‌ లెన్స్‌, 48MP సోనీ IMX581 కెమెరాలును అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP కెమెరాతో అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Oneplus 12 Smartphone 12GB Ram variant gets huge price drop on flipkart 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X