OnePlus 12 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. ఎన్నో ప్రత్యేక ఫీచర్లు!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఇటీవల తన తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ OnePlus Openను లాంచ్ చేసింది. ఈ ఫోన్ సోనీ LYT-T808 ప్రధాన కెమెరాను కలిగి ఉంది. ఇదే కెమెరా సెన్సార్‌ను త్వరలో విడుదల కానున్న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ OnePlus 12లోనూ అమర్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ సోనీ పిక్సల్ స్టాకడ్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 64MP OV64B పెరిస్కోప్ లెన్స్‌ను కలిగి ఉంటుందని వన్‌ప్లస్ సంస్థ వెల్లడించింది. ఈ రెండు సెన్సార్‌లు ఫ్లాగ్‌షిప్ సెన్సార్‌ల రంగంలో మాస్టర్‌పీస్‌లుగా పేర్కొంది. ఈ రెండు ప్రపంచంలోనే మెరుగైన సెన్సార్‌లుగా ఉన్నాయని పేర్కొంది. ఈ రెండు మెరుగైన ఇమేజింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటాయని తెలిపింది.

వన్‌ప్లస్ ఒపెన్ ఫోల్టబుల్ స్మార్ట్‌ఫోన్ 48MP LYT-T808 సెన్సార్‌ను కలిగి ఉంది. అయితే వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ కోసం 50MP కెమెరాను ఉపయోగిస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మరియు హాసెల్‌బ్లాడ్ అల్గారిథమ్‌లకు కూడా మద్ధతు ఇస్తుంది. దీంతోపాటు ఈ కెమెరా f/1.6 అపేచర్‌తో వస్తుందని తెలుస్తోంది.
వన్‌ప్లస్ కొత్తగా లాంచ్ కానున్న ఫోన్ 1/2 అంగుళాల 64MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను కూడా కలిగి ఉండనుంది. ఈ సెన్సార్ 70mm, 3X ఆప్టికల్ జూమ్, f/2.6 అపేచర్ సహా OISకు సమానమైన ఫోకల్‌లెంత్‌కు సపోర్టు చేస్తుంది. వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ Oppo యొక్క ఫస్ట్ జెన్ అమేజ్ క్వాలిటీ ఇంజిన్ డిస్‌ప్లే P1 చిప్‌ను కలిగి ఉంటుంది.
ఈ వన్‌ప్లస్ తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ BOE నుంచి 2K X1 స్క్రీన్‌ను కలిగి ఉంటుందని తెలిపింది. 2600 నిట్స్ డిస్‌ప్లే బ్రేట్‌నెస్‌తో వస్తుంది. 24GB వరకు ర్యామ్, 1TB వరకు స్టోరేజీని పొడిగించే అవకాశం ఉందని తెలిపింది.
వన్‌ప్లస్ 12 స్మార్ట్ ఫోన్ 100W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ సహా 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టతో 5400mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఈ వన్‌ప్లస్ 12 మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో మరిన్ని వెలువడే అవకాశం ఉంది.
* OnePlus Open స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 7.82 అంగుళాల అమోలెడ్ లోపలి డిస్‌ప్లేను, 6.31 అంగుళాల అవుటర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 67W ఛార్జింగ్ సపోర్టుతో 4800mAh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఎమరాల్డ్ డస్క్, వాయేజర్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.
వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్ OS 13.2 అవుట్ ఆఫ్ ది బాక్స్ కింద పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 7.82 అంగుళాల (2,268*2440 పిక్సల్) 2k ఫ్లెక్సీ ఫ్యూయడ్ LTOP 3.0 అమోలెడ్ ఇన్నర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 1-120Hz డైనమిక్ రీఫ్రెష్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.
ఈ డిస్‌ప్లే అల్ట్రా థిన్ గ్లా్స్ ప్రొటెక్టివ్ మెటీరియల్‌ను కలిగి ఉంటుంది. ఇది 1440Hz పల్స్ విడ్త్ మాడ్యులేషన్ డిమ్మింగ్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్ 6.31 అంగుళాల 2k LTPO 3.0 సూపర్ ఫ్యూయిడ్ అమోలెడ్ అవుటర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 10-120Hz డైనమిక్ రీఫ్రెష్ రేట్, 240Hz టచ్ రెస్పాన్స్ రేట్, 2800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ స్క్రీన్ సిరామిక్ గార్డ్ ప్రొటెక్టివ్ మెటిరియల్‌ను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








