OnePlus నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. ట్రిపుల్ కెమెరా, 5400 mAh బ్యాటరీ సహా..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ OnePlus 12 త్వరలో విడుదల కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 5న చైనాలో విడుదల కానుంది. ఆ స్మార్ట్‌ఫోన్ ప్రపంచవ్యాప్తంగా జనవరి 24న విడుదల కానుందని తెలుస్తోంది. యూరప్ సపోర్ట్ పేజీ పొరపాటున గ్లోబల్ లాంచ్ వివరాలను వెల్లడించింది.
వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్ అమెరికా, యూకే, భారత్ వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌లో కనిపించింది. అయితే అధికారిక విడుదల తేదీని వెల్లడించలేదు. వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ టీజర్‌లో హ్యాండ్‌సెట్ గ్రీన్ కలర్‌లో కనిపించింది. దాంతోపాటు సపోర్టులో పేజీలో సబ్‌స్క్రైబ్ బటన్ కనిపిస్తోంది. ఫలితంగా వన్‌ప్లస్ 12 లేదా భవిష్యత్‌లో విడుదల అయ్యే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను ఉచితంగా పొందవచ్చు.

వన్‌ప్లస్ 12 లీక్ అయిన స్పెసిఫికేషన్లు : వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ 6.82 అంగుళాల 2k LTPO BOE OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 144Hz రీప్రెష్ రేట్‌తో వస్తుంది. మరియు స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ అలెర్ట్ స్లైడర్ సహా వన్‌ప్లస్ 11 డిజైన్‌ను పోలి ఉంది.
5400 mAh బ్యాటరీ : వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ సర్కులర్ కెమెరా బంప్‌ను కలిగి ఉంటుంది. కర్వడ్ బాడీ, పంచ్ హోల్ కటౌట్‌తో వస్తుందని తెలుస్తోంది. ఈ వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్ 120W సూపర్‌వోక్ ఛార్జింగ్ సపోర్టుతో 5400 mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని సమాచారం.
వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ అనేక ముఖ్యమైన ఫీచర్లను కలిగి ఉండనుంది. లెర్ట్ స్లైడర్. గేమింగ్ యాంటెనా సహా ముఖ్యమైన ఫీచర్లను ఈ ఫోన్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాల సెటప్‌ను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 50MP ఆల్ట్రా వైడ్ సెన్సార్, 3X జూమింగ్ సామర్థ్యం కలిగిన 64MP టెలీఫొటో లెన్స్‌ను కలిగి ఉంటుంది. ముందువైపు 32MP కెమెరా ఉంటుందని తెలుస్తోంది.
డిసెంబర్ 5న చైనాలో విడుదల కానుంది. అయితే చైనా, గ్లోబల్ వేరియంట్ ఫీచర్లు ఒకేలా ఉంటాయా లేదా ఏమైనా మార్పులుంటాయా అనేదానిపై స్పష్టత లేదు. మరియు గ్లోబల్ వేరియంట్ ర్యామ్, స్టోరేజీ వేరియంట్ సహా మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. దాంతోపాటు పైన తెలిపిన ఫీచర్లు, స్పెసిఫికేషన్లపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ ధర వివరాలు వెల్లడి కాలేదు. చైనాలో ఈ ఫోన్ విడుదల తర్వాత భారత్ సహా గ్లోబల్ వేరియంట్ ధర, ఇతర స్పెసిఫికేషన్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరియు గ్లోబల్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. వన్‌ఫ్లస్ 12 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌గా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








