OnePlus 12 స్మార్ట్‌ఫోన్ కీలక ఫీచర్లు లీక్.. వివరాలు
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ కొత్త ఫోన్‌పై ఓ వార్త లీక్ అయింది. అద్భుతమైన డిజైన్ సహా అనేక ఫీచర్లతో రానుందని వార్తలొస్తున్నాయి. ఈ సంవత్సరం జనవరిలో వన్‌ప్లస్ 11 లాంచ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులను ఆకట్టుకుంది. ప్రస్తుతం వన్‌ప్లస్ 12పై అందరి దృష్టి ఉంది.
OnePlus 12 ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ మెరుగైన డిజైన్‌తో వచ్చే అవకాశం ఉంది. మరియు క్కాల్‌కాం స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మల్టీటాస్క్ సహా వేగవంతమైన పనితీరు కనబరచనుందని తెలుస్తోంది. దీంతోపాటు 6.7 అంగుళాల QHD OLED డిస్‌ప్లే వినియోగదారులకు మరింత మెరుగైన అనుభూతిని ఇస్తుందని సమాచారం. మరియు 120Hz రీఫ్రెష్ రేట్‌తో రానుంది.

వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో రానుందని తెలుస్తోంది. మరియు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో లాంచ్ కానుందని సమాచారం. ఫలితంగా వేగంగా ఛార్జింగ్ చేసుకోవచ్చని తెలుస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. మూడు కెమెరాలతో వన్‌ప్లస్ 12 ఫోన్ రానుందని సమాచారం. 64MP పెరిస్కోపిక్ జూమ్ కెమెరా, 50MP సోనీ IMX890 కెమెరా, 50MP ఆల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ రానుందని సమాచారం. దూరం నుంచి కూడా స్పష్టంగా ఫోటోలను తీసే ఫీచర్ ఈ కెమెరాలకు ఉంటుందని తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ అభివృద్ధి దశలోనే ఉంది. కానీ వెలుగులోకి వచ్చిన కొన్ని ఫీచర్లు మాత్రం ఫోన్‌పై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ ఫోన్ ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి చైనాలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అనంతరం ప్రపంచ వ్యాప్తంగా అందరికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. చైనాలో లాంచ్ అయిన కొన్ని వారాలు లేదా కొన్ని నెలల తర్వాత గ్లోబల్‌గా లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది.
వన్‌ప్లస్ 11 స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రీఫ్రెష్ రేట్‌తో అందుబాటులోకి వచ్చింది. 5000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చింది. ఈ ఫోన్‌లో మూడు కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్ వెనుకవైపు 50MP ప్రైమరీ కెమెరా, 48MP సెకండరీ కెమెరా, 32MP మూడో కెమెరాను కలిగి ఉంది. ముందు వైపు 16MP కెమెరాను కలిగి ఉంది.
ఈ ఫోన్ 8GB ర్యామ్- 128 అంతర్గత స్టోరేజీ, 12GB ర్యామ్- 256GB స్టోరేజీ, 16GB ర్యామ్- 256GB, 16GB ర్యామ్-512GB కెమెరా వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.53,748 రూపాయలకు అందుబాటులో ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








