Home
News

16GB ర్యామ్, 5500mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్‌ప్లేతో OnePlus స్మార్ట్‌ఫోన్‌.. రేపటి నుంచే సేల్‌..!!

వన్‌ప్లస్‌ 12 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు ఇటీవల విడుదల అయ్యాయి. ఈ సిరీస్‌లో భాగంగా వన్‌ప్లస్‌ 12, వన్‌ప్లస్ 12R స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఇప్పటికే వన్‌ప్లస్ 12 ప్రారంభం అయింది. రేపటి నుంచి వన్‌ప్లస్‌ 12R హ్యాండ్‌సెట్‌ సేల్‌ ప్రారంభం కానుంది. ప్రారంభం ఆఫర్‌లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు.

వన్‌ప్లస్‌ 12R స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్‌ 12R స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల అమోలెడ్ LTPO డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1264*2780 పిక్సల్‌ రిజల్యూషన్‌తో వస్తుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 360Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది. కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 రక్షణను పొందుతుంది. అల్యూమినియం మెటల్‌ ఫ్రేమ్‌, వెనుక గ్లాస్‌ను కలిగి ఉంటుంది.

Oneplus 12R smartphone sale starts from 6 February 2024

అండర్‌ ది హుడ్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆక్టా కోర్‌ 4nm స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 2 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 12GB లేదా 16GB LPDDR5x ర్యామ్‌ మరియు అడెన్నో 740 GPUతో జతచేయబడుతుంది. UFS 4.0 టెక్నాలజీతో గరిష్ఠంగా 1TB స్టోరేజీని కలిగి ఉంటుంది. 100W సూపర్‌వూక్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5500mAh బ్యాటరీ, డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌), f/1.8 అపేచర్‌తో 50MP సోనీ IMX890 ప్రధాన కెమెరా, f/2.2 అపేచర్‌తో కూడిన 8MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, f/2.4 లెన్స్‌తో కూడిన 2MP మాక్రో లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ముందువైపు 16MP కెమెరాను కలిగి ఉంటుంది.

Oneplus 12R smartphone sale starts from 6 February 2024

వన్‌ప్లస్‌ 12R వేరియంట్లు, ధర :
వన్‌ప్లస్ 12R స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.39,999గా ఉంది. అదే 16GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.45,999 గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫిబ్రవరి 6 మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

ప్రారంభ ఆఫర్‌లో భాగంగా ICICI క్రెడిట్‌ కార్డు, వన్‌కార్డు ద్వారా కొనుగోలు వారు రూ.1000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు 6 నెలల పాటు గూగుల్‌ వన్‌ సబ్‌స్క్రిప్షన్‌ మరియు 3 నెలలపాటు యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. సేల్‌ ప్రారంభం అయిన 24 గంటల వ్యవధిలోగా వన్‌ప్లస్‌ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేస్తే రూ.4999 విలువైన బడ్స్‌ Z2 ఉచితంగా పొందవచ్చు.

Oneplus 12R smartphone sale starts from 6 February 2024

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Oneplus 12R smartphone sale starts from 6 February here are the offers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X