OnePlus యొక్క తర్వాతి ఫోన్ OnePlus 13 డిజైన్ లీక్! స్పెసిఫికేషన్లు
వన్‌ప్లస్ 12 స్మార్ట్ ఫోన్ చైనా లో లాంచ్ అయిన కొన్ని నెలల తర్వాత ఇటీవల జనవరిలో భారతదేశంలో లాంచ్ అయింది. ఇప్పుడు, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క తర్వాతి వెర్షన్ కోసం ఇంటర్నెట్‌లో లీక్ లు వచ్చాయి. గత సంవత్సరం మాదిరిగానే, కంపెనీ దీన్ని మొదట చైనాలో లాంచ్ చేసి, ఆపై ప్రపంచ మార్కెట్‌లో అందుబాటులో ఉంచాలని నిర్ణయించుకోవచ్చు.
లీక్ అయిన సమాచారం ప్రకారం, ఇప్పుడు, OnePlus 13 గురించిన రెండర్లు ఫోన్ యొక్క కెమెరా డిజైన్ ను చూపిస్తాయి. లీక్ అయిన డిజైన్ ప్రకారం కెమెరా లు నిలువుగా సమలేఖనం చేయబడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌ను సూచిస్తుంది. సాధారణంగా OnePlus 12 కెమెరా వృత్తాకార వెనుక డిజైన్‌ను కలిగి ఉంది.

ఒక చైనీస్ టిప్‌స్టర్ కెమెరా డిజైన్ లో మార్పుల గురించిన తాజా పుకార్లను కూడా ధృవీకరించారు మరియు OnePlus 13 యొక్క కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను సూచించారు. ఇది స్నాప్ డ్రాగన్ 8 జెన్ 4 SoC ప్రాసెసర్ తో పనిచేస్తుందని భావిస్తున్నారు.
OnePlus Club (@OnePlusClub) X ఖాతా లో OnePlus 13 యొక్క ఊహించిన రెండర్‌లను షేర్ చేసింది. ఈ రెండర్ లో ఫోన్ యొక్క వెనుక భాగంలో Hasselblad-బ్రాండెడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వైట్ షేడ్‌లో హ్యాండ్‌సెట్‌ను చూపుతుంది. కెమెరా సెన్సార్‌లు నిలువుగా అమర్చబడి ఉంటాయి, మధ్య సెన్సార్ అత్యంత ప్రముఖంగా ఉంటుంది.
చైనీస్ సోషల్ మీడియా Weibo లో ప్రత్యేకంగా చైనీస్ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ సమాచారం ప్రకారం, తర్వాత రాబోయే OnePlus ఫ్లాగ్‌షిప్ డిజైన్ మార్పును పొందుతుందని పేర్కొంది. ఇది 2K రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది అని టీజ్ చేయబడింది మరియు అల్ట్రావైడ్ లెన్స్ మరియు టెలిఫోటో సెన్సార్‌తో పాటు 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో కూడిన అప్‌డేట్ చేయబడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది.
OnePlus 13 ఫోన్ క్వాల్కమ్ యొక్క తదుపరి తరం స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 చిప్‌సెట్‌తో వస్తుందని అంచనా వేయబడింది. దీని డిస్‌ప్లేలో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ని పొందుపరిచినట్లు అంచనా ఉంది.
ఇక ధర వివరాలు అంచనా వేస్తె, ముఖ్యంగా, OnePlus 12 భారతదేశంలో ఈ సంవత్సరం జనవరిలో ప్రారంభించబడింది, దీని ప్రారంభ 12GB RAM మరియు 256GB స్టోరేజ్ కలిగిన బేస్ మోడల్‌కు ధర రూ. 64,999, 16GB+512GB మోడల్ ధర రూ. 69,999 గా లాంచ్ అయింది. తర్వాతి మోడల్ కూడా ఇదే ధరల విభాగంలో రావొచ్చని అంచనాలున్నాయి.
OnePlus 12 స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ల వివరాలు గమనిస్తే, 6.82-అంగుళాల క్వాడ్-HD+ (1,440 x 3,168 పిక్సెల్‌లు) LTPO 4.0 అమోలెడ్ స్క్రీన్‌ను కలిగి ఉంది మరియు క్వాల్కమ్ యొక్క ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 సొక్కు ప్రాసెసర్ పై పనిచేస్తుంది. ఇది సోనీ LYT-808 సెన్సార్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ద్వారా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో అమర్చబడింది. ఈ ఫోన్ 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది మరియు 100W సూపర్ ఊక్ ఛార్జింగ్‌తో 5,400mAh బ్యాటరీని కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








