వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్‌పై రూ.3000 డిస్కౌంట్.. శక్తివంతమైన ప్రాసెసర్ సహా..!
వన్‌ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ భారత్ మార్కెట్‌లో ఇటీవల విడుదల అయింది. సేల్ కూడా ప్రారంభం అయింది. స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ జెన్ 5 చిప్, ఆండ్రాయిడ్ 16 OS పైన పనిచేస్తుంది. 7300mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. అయితే త్వరలో వన్‌ప్లస్ 15R స్మార్ట్‌ఫోన్ కూడా లాంచ్ కానుంది. ఈ సంవత్సరంలో వన్‌ప్లస్ నుంచి కంపాక్ట్ మోడల్‌గా లాంచ్ అయిన వన్‌ప్లస్ 13s హ్యాండ్‌సెట్‌ను డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది.
భారత్ మార్కెట్‌లో వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్ (OnePlus 13s Smartphone) ఈ సంవత్సరం తొలిభాగం చివర్లో విడుదల అయింది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ చిప్‌సెట్ పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ ప్లస్ కీ ను కూడా కలిగి ఉంది. మెరుగైన కెమెరా ఫీచర్‌లను కూడా కలిగి ఉంది.

ధర వివరాలు :
ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఈ ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.54999, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.59999 గా ఉంది. అమెజాన్‌లో ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ను పొందవచ్చు.
కలర్ వేరియంట్స్ :
అమెజాన్‌లో HDFC, యాక్సెస్ బ్యాంకుల క్రెడిట్ కార్డులపై EMI లావాదేవీ రూపంలో కొనుగోలు చేస్తే.. రూ.3 వేల వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుందో వెల్లడి కాలేదు. ఈ ఫోన్ గ్రీన్ సిల్క్, బ్లాక్ వెల్‌వెట్, పింక్ శాటిన్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తోంది.
1.5k డిస్‌ప్లే :
వన్‌ప్లస్ 13s స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.32 అంగుళాల 1.5k LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. మరియు HDR10+, HDR Vivid, డాల్బీ విజన్ ను సపోర్టు చేస్తుంది. ఆ డిస్‌ప్లే ఆక్వా టచ్ 2.0, గ్లౌజ్ మోడ్‌ను కూడా సపోర్టు చేస్తుంది. తడి చేతులు. గ్లౌజ్‌తోనూ ఈ ఫోన్‌ను సౌకర్యవంతంగా వినియోగించుకోవచ్చు.
స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ :
ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌తో పనిచేస్తోంది. ఈ చిప్ 12GB LPDDR5X ర్యామ్, 512GB UFS 4.0 స్టోరేజీ సపోర్టును కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Oxygen OS 15 పైన పనిచేస్తోంది. ఆండ్రాయిడ్ 16 అప్‌డేట్‌ను పొందుతుంది. ఈ ఫోన్ మొత్తంగా 4 OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
50MP + 50MP + 32MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ మెరుగైన కెమెరాలను కలిగి ఉన్నాయి. OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP సోనీ LYT 700 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 2x ఆప్టికల్ జూమ్, EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP టెలిఫోటో కెమెరా ఉంది. 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
ప్లస్ కీ :
ఈ హ్యాండ్‌సెట్ 80W SUPERVOOC ఛార్జింగ్ సపోర్టుతో 5850mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఫోన్ Plus Key తో అందుబాటులో ఉంది. ఈ బటన్ తో AI మైండ్ స్పేస్ ఫీచర్‌ను లాంచ్ చేయవచ్చు. దీంతోపాటు మరిన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు.


Click it and Unblock the Notifications








