దీపావళి ఆఫర్లతో OnePlus 5
మార్కెట్లో దీపావళి సందడి మొదలైపోయింది. కొత్త కొనుగోళ్లతో షాపింగ్ జోన్‌లు కిటకిటలాడిపోతున్నాయి. సాధారణంగా దీపావళి సీజన్ అంటే స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు అధికంగా ఉంటాయి. ఈ పండుగను పురస్కరించుకుని కొత్త స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసే యూజర్లు చాలా మంది ఉంటారు. వారిలో మీరు కూడా ఉన్నట్లయితే ఓ బెస్ట్ స్మార్ట్‌ఫోన్ మీకోసం ఎదురుచూస్తోంది.

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రతి సంవత్సరం అనేక కొత్త స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అవుతూనే ఉన్నాయి. వీటిలో మోస్ట్ రికమెండెడ్ బ్రాండ్‌కు సంబంధించిన వివరాలను ప్రతి మూడు నెలలకు సైబర్ మీడియా రిసెర్చ్ రివీల్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో 2017, 2వ క్వార్టర్‌కు గాను భారతీయులు అత్యధికంగా విశ్వసించిన బ్రాండ్‌గా OnePlus గుర్తింపు తెచ్చుకున్నట్లు ఈ రిసెర్చ్ సంస్థ తెలిపింది. ఇటీవల ఈ బ్రాండ్ నుంచి లాంచ్ అయిన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ OnePlus 5 రూ.30,000 బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌గా అవతరించింది. Amazon.inలో OnePlus 5 కొనుగోలు పై ఆసక్తికర పండుగ డిస్కౌంట్లు..
దీపావళి పండుగను పురస్కరించని OnePlus 5 కొనుగోలు పై ఆసక్తికర డిస్కౌంట్‌లతో పాటు ఆఫర్లను Amazon.in అందిస్తోంది. ఈ కొత్త ఫోన్‌ను మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ఎక్స్‌ఛేంజ్ చేసుకోదలిచినట్లయితే సాధారణంగా కోట్ చేసే ఎక్స్‌ఛేంజ్ వాల్యూ కంటే రూ.3,000 ఎక్కువ ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్‌ను అమెజాన్ కల్పిస్తోంది. ఇదే సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను 12 నెలల 'No cost EMI' సౌకర్యంతో సొంతం చేసుకోవచ్చు. క్యాష్‌బ్యాక్ విషయానికి వచ్చేసరికి OnePlus 5 కొనుగోలు పై రూ.2000 వరకు
క్యాష్‌బ్యాక్‌ను అమెజాన్ ఇస్తోంది. ఈ ఫోన్ పై అందుబాటులో ఉన్న ఇతర ఆఫర్‌లను పరిశీలించినట్లయితే క్లియర్‌ట్రిప్ నుంచి రూ.25,000 వరకు ఖరీదు చేసే గిఫ్ట్ వోచర్‌లను OnePlus 5 యూజర్లు సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.

OnePlus 5 స్పెసిఫికేషన్స్..
5.5 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లే (1920 x 1080పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 సాక్, ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), 16 మెగా పిక్సల్ + 20 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3300mAh బ్యాటరీ వత్ డాష్ ఛార్జ్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్ వీ5.0, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్‌సీ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లు వన్‌ప్లస్ 5లో ఉన్నాయి.

OnePlus 3T పైనా ఆసక్తికర డిస్కౌంట్లు..
వన్‌ప్లస్ 5తో పాటుగా వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్ పైనా ఆసక్తికర డిస్కౌంట్లను అమెజాన్ ఆఫర్ చేస్తోంది.ఈ పండుగ సీజన్‌లో భాగంగా వన్‌ప్లస్ 3టీ స్మార్ట్‌ఫోన్ సాఫ్ట్ గోల్డ్ వేరియంట్‌ను ధర రూ.24,999 ధర ట్యాగ్‌తో, గన్ మెటల్ వేరియంట్‌ను రూ.25,999 ధర ట్యాగ్‌తో వన్‌ప్లస్ విక్రయిస్తోంది.
ఈ రెండు వేరియంట్‌లను 12 నెలల ‘No cost EMI' సౌకర్యంతో సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ల పై అందుబాటులో ఉన్న మరిన్ని ఆఫర్ల వివరాలను తెలుసుకునేందుకు oneplusstore.inలోకి వెళ్లండి.

వన్‌ప్లస్ 3టీ స్పెసికేషన్స్..
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లే (స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 1920 x1080 పిక్సల్స్) విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 2.35 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్, అడ్రినో 530 గ్రాఫిక్స్, 6జీబీ ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), 16 మెగాపిక్సల్ రియర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ విత్ డ్యాష్ చార్జ్ సపోర్ట్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4జీ వోల్ట్ సపోర్ట్, వైఫై, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సి పోర్ట్.


Click it and Unblock the Notifications








