టికెట్లన్నీ కొనేసారు, రేపే వన్‌ప్లస్ ‘5టీ’ లాంచ్

Posted By: BOMMU SIVANJANEYULU

వన్‌ప్లస్ 5టీ లాంచ్ ఈవెంట్‌కు సమయం సమీపిస్తోంది. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను నవంబర్ 16న న్యూయార్క్‌లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా వన్‌ప్లస్ కంపెనీ లాంచ్ చేయబోతోంది. విలియన్ నగరంలోని బ్రోక్‌లిన్ క్యాంపస్‌లో జరిగే ఈ కార్యక్రమం అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2 రెండు గంటలకు ముగుస్తుంది. భారత కాలమానం ప్రకారంలో రాత్రి 9.30 నిమిషాలకు ఈవెంట్ ప్రారంభమవుతుంది.

టికెట్లన్నీ కొనేసారు, రేపే వన్‌ప్లస్ ‘5టీ’ లాంచ్

అమెరికాలో వన్‌ప్లస్ 5టీ లాంచ్ ఈవెంట్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే వారు ముందుగా 40 డాలర్లు (మన కరెన్సీలో రూ.2600) పెట్టి ఎంట్రీ పాస్‌ను కొనుగోలు చేయవల్సి ఉంది. ఈవెంట్ కోసం అందుబాటులో ఉంచిన టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడై పోయినట్లు వన్‌ప్లస్ తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఇప్పటికే అనౌన్స్ చేసింది.

తమ లాంచ్ ఈవెంట్‌లకు హాజరయ్యేవారి దగ్గర నుంచి డబ్బుల వసూలు చేయటం వెనుక ఓ మంచి కారణమే ఉందని వన్‌ప్లస్ చెబుతోంది. ఎంట్రీ పాస్‌లను పెట్టడం ద్వారా కార్యక్రమానికి ఎంత మంది హాజరయ్యేరనేది స్పష్టంగా తెలియటంతో పాటు వారికి చేయవల్సిన ఏర్పాట్ల పై కూడాదని ఓ అవగాహన ఉంటుందని కంపెనీ భావిస్తోంది. టికెట్ల ద్వారా సేకరించిన మొత్తాన్ని అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ టెక్ ఇన్నోవేషన్‌కు నిధుల క్రింద ఇవ్వనున్నట్లు వన్‌ప్లస్ తెలియజేసింది.

Redmi Y1 Lite, Redmi Y1 సేల్ ఈ రోజే, మొన్న 3 నిమిషాల్లో అవుట్ ఆఫ్ స్టాక్..

ఈ కార్యక్రమానికి హాజరయ్యయే వారికి ట్రావెల్ బ్యాక్‌ప్యాక్, హుడీ, బేస్‌బాల్ క్యాప్ ఇంకా ఇతర ఎక్స్‌క్లూజివ్ వస్తువులతో ఉన్న స్వాగ్‌బ్యాగ్‌ను వన్‌ప్లస్ అందిస్తుంది. అంతేకాకుండా వారి కోసం ప్రత్యేకమైన రిజర్వుడ్

ప్లేస్‌ను కేటాయించబడుతుంది. వీరికి సీటింగ్ దగ్గర నుంచి స్నాక్స్, డ్రింక్స్ వరకు అన్ని సౌకర్యంగా అందుతాయి. కార్యక్రమానికి హాజరైన వారు వన్‌ప్లస్ 5టీని కూడా ఎక్స్‌పీరియన్స్ చేసే వీలుంటుంది.

English summary
The funds generated by ticket sales of the OnePlus 5T launch event will go "toward the advancement of tech innovation."
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot