జనవరి 26న వస్తోన్న...వన్ ప్లస్ 5T లావా రెడ్ వేరియంట్ !

Posted By: Madhavi Lagishetty

గతేడాది నవంబర్ లో మిడ్ నైట్ బ్లాక్ వేరియంట్లో వన్ ప్లస్ 5T రిలీజ్ అయ్యింది. మిడ్ నైట్ బ్లాక్ కలర్ ఇండియాలో అందుబాటులో ఉంది. ఈ వేరియంట్ను ప్రారంభించిన కొద్ది వారాల తర్వాత, సంస్థ మరో కలర్ తో ముందుకు వచ్చింది. లావా రెడ్ కలర్ వేరియంట్లో ఇప్పుడు ఇండియాలోకి వచ్చేలా కనిపిస్తోంది.

జనవరి 26న వస్తోన్న...వన్ ప్లస్ 5T లావా రెడ్ వేరియంట్ !

బీబామ్ ఈమధ్యే రిలీజ్ చేసిన ఒక రిపోర్టు ప్రకారం, జనవరి 26న ఇండియలో వన్ ప్లస్ 5T లావా రెడ్ కలర్ వేరియంట్ రిలీజ్ కానున్నట్లు తెలిపింది. చైనాలో వన్ ప్లస్ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ఒక ప్రధాన స్మార్ట్ ఫోన్ను లావా రెడ్ కలర్ వేరియంట్ రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ప్రకటన సమయంలో ఇది చైనా మార్కెట్ కు ప్రత్యేకమైన డివైస్ అని పేర్కొంది.

లావా రెండ్ వేరియంట్ తర్వాత, కొన్ని మార్పులతో స్మార్ట్ ఫోన్ యొక్క స్టార్ వార్స్ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ తో వన్ ప్లస్ కూడా ముందుకు వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో మొదట్లో ప్రారంభించారు. తర్వాత ప్రపంచవ్యాప్తంగా పరిచయమైంది.

BSNL ధమాకా : అన్‌లిమిటెడ్ డేటా, అపరిమిత కాల్స్, రూ. 187కే..

వన్ ప్లస్ 5T లావా రెడ్ వేరియంట్ తోపాటు, ఈ డివైసు ఒక సాండ్ స్టోన్ వేరియంట్ లా ఉంటుంది. సంస్థ కొన్ని వీడియోలను యూట్యూబ్ లో ఒక మిస్టరీ బాక్స్ లో ప్రొడక్ట్ ను టీజింగ్ చేస్తూ పోస్టు చేసింది. ఈమధ్యే పోస్టర్ ఈ ప్రొడక్టును జనవరి 5న ప్రారంభించబడుతుందని సూచించింది.

వన్ ప్లస్ 5T యొక్క లావారెడ్ ఎడిషన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజి స్పేస్ తోపాటు హై ఎండ్ మోడల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇతర స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే, కేవలం రంగులో మార్పు ఉంటుంది. 6 అంగుళాల ఆల్మోడ్ ఫుల్ హెచ్డి+ 2160,1080 పిక్సెల్ డిస్ప్లే 18:9 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది. దాని హుడ్ కింద క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 835 సాక్ మరియు డాష్ ఛార్జ్ తో 3300ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంటుంది.

ఈ మధ్యే ఆండ్రాయిడ్ ఓరెయో ఓపెన్ బీటా అప్ డేట్ చేసింది. అంతేకాదు డివైసుకు ఎన్నో మెరుగులను అద్దడంతో పాటు అనేక ఫీచర్లను అందిస్తుంది. కెమెరా విభాగంలో 16మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, ఒక f/2.7 ఎపర్చరుతోపాటు 20మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ మౌంట్ డ్యుయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా f/2.0 ఎపర్చరుతో 16మెగాపిక్సెల్స్ సెన్సర్ ఉంటుంది.

ఇక వన్ ప్లస్ 5T లావా రెడ్ వేరియంట్ మిడ్ నైట్ బ్లాక్ వేరియంట్ 37,999రూపాయలకు ఇండియా, అమెజాన్ ఇండియాలో ఎక్స్ క్లూజివ్ గా అందుబాటులో ఉంటుంది.

English summary
OnePlus 5T Lava Red color variant was launched in China initially. Now, it looks like this variant of the OnePlus 5T could be launched in India on January 26. The device is said to be available only in the high-end variant with 8GB RAM and 128GB storage space and carry the same price tag of Rs. 37,999.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot