భారీ అంచనాలతో వన్‌ప్లస్ ‘5టీ’

|

OnePlus బ్రాండ్ నుంచి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రాబోతోంది. OnePlus 5కు సక్సెసర్ వర్షన్‌గా భావిస్తోన్న ఈ ఫోన్‌ను OnePlus 5Tగా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ అంచనాలను నిజం చేస్తూ కంపెనీ ఓ టీజర్ ఇమేజ్‌ను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసింది. "Oh, look! It's five cups of..." అనే క్యాప్షన్‌తో కనిపిస్తోన్న ఈ టీజర్ వన్‌ప్లస్ 5టీని అఫీషియల్‌గా కన్‌ఫర్మ్ చేసినట్లయ్యింది.

 
భారీ అంచనాలతో వన్‌ప్లస్ ‘5టీ’

తన అప్‌కమ్మింగ్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి రకరకాల టీజర్స్‌ను పోస్ట్ చేస్తూ ఇప్పటికే భారీ హైప్‌ను క్రియేట్ చేసుకున్న వన్‌ప్లస్ మరిన్ని టీజర్స్‌ను త్వరలో లాంచ్ చేయబోతోంది. అన్‌అఫీషియల్‌గా తెలుస్తోన్న సమచారం ప్రకారం OnePlus 5T స్మార్ట్‌ఫోన్ నవంబర్ 16న న్యూయార్క్‌లో లాంచ్ కాబోతోంది.

రూమర్ మిల్స్ చెబుతోన్న దాని ప్రకారం, గతంలో లాంచ్ అయిన వన్‌ప్లస్ ఫోన్‌లతో పోలిస్తే OnePlus 5T భిన్నమైన డిజైన్‌తో రాబోతోందట. పలుచటి బీజిల్స్‌తో పాటు 18:9 ఎడ్జ్-టు-ఎడ్జ్ స్ర్కీన్‌ను కలిగి ఉండే ఈ ఫోన్ ఏకంగా 6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందట.

iPhone Xకు పోటీ ఇచ్చే 10 ఫోన్‌లు ఇవే!iPhone Xకు పోటీ ఇచ్చే 10 ఫోన్‌లు ఇవే!

వన్‌ప్లన్ కంపెనీ ఇటీవల తన ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసిన మరో ఇమేజ్ ప్రకరం OnePlus 5T 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్‌తో రాబోతోంది. అయితే ఈ ఫోన్ లో యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉండదన్నమాట.

OnePlus 5T స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉండొచ్చు...

- 6-ఇంచ్ క్వాడ్ హైడెఫినిషన్ స్ర్కీన్, 18:9 యాస్పెక్ట్ రేట్ డిస్‌ప్లే విత్ 2160 x 1080 పిక్సల్స్ రిసల్యూషన్,

- ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం,

- క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 క్వాడ్-కోర్ ప్రాసెసర్, క్లాక్‌ స్పీడ్ అప్‌ టూ 2.45GHz,

- ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి),

- స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి),

- 20 మెగా పిక్సల్ + 20 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా, F2.6/F1.6 అపెర్చుర్.

తాజాగా లీకైన వివరాలను బట్టి చూస్తుంటే OnePlus 5T స్మార్ట్‌ఫోన్‌‌ను నవంబర్ 16న న్యూయార్క్‌లో నిర్వహించే ఈవెంట్‌లో భాగంగా వన్‌ప్లస్ లాంచ్ చేయబోతోంది. ఇదే రోజన ఇండియాలోనూ ఓ లాంచ్ ఈవెంట్ ఉంటుందని సమాచారం. అమెజాన్ ఇండియా ద్వారా ఈ ఫోన్‌లను విక్రయించనున్నట్లు సమాచారం.

Best Mobiles in India

Read more about:
English summary
OnePlus 5T, the name of the upcoming smartphone gets confirmed by an official teaser posted by the company on Twitter.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X