బెస్ట్ ఫీచర్లతో వన్ ప్లస్ 5టి !

By Madhavi Lagishetty
|

చైనీస్ మొబైల్స్ తయారీదారు సంస్థ వన్ ప్లస్...తన కొత్త స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్5టిని విడుదల చేసింది. అత్యాధునిక ఫీచర్లతో సరికొత్త వన్ ప్లస్5T న్యూయర్క్ లో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఇండియాలోని ఐదు PVR స్క్రీన్లపై ఒకేసారి ప్రసారం చేశారు. గతంలో వచ్చిన డివైస్ తో పోలిస్తే...ఈ డివైస్ చాలా తక్కువ ఇంప్రూవ్ మెంట్స్ తో వస్తుంది.

OnePlus 5T will get stable Android 8.0 Oreo update early next year

ఇక ఈ ఫోన్లో ఉండే ఫీచర్ల విషయానికొస్తే...మెరుగైన కెమెరా, వన్ ప్లస్ 5 ధర, 18:9 డిస్ల్పే స్మార్ట్ ఫోన్ బ్లాక్ కలర్లో న్యూకిడ్ వలే ఆకట్టుకుంటుంది. ఆండ్రాయిడ్ 7.1.1 బాక్స్ నుంచి బయటకు వచ్చే నౌగాట్ మేజర్ డిస్సాపాయింట్ అని చెప్పవచ్చు. వన్ ప్లస్ దే పరిష్కారం అని తెలుస్తోంది. వన్ ప్లస్ 5టి కొద్ది నెలల్లోనే ఆండ్రాయిడ్ 8.0 ఓరియో అప్ డేట్ వస్తుందని కంపెనీ ప్రకటించింది.

ఈనెల తర్వాత, వన్ ప్లస్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో బీటా రిలీజ్ చేస్తుంది. వన్ ప్లస్5 ఈ ఏడాది జూన్ లో మార్కెట్లోకి విడుదల అయ్యింది. అలాగే ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఓపెన్ బీటాను వన్ ప్లస్ 5T అందుబాటులోకి తీసుకురానుంది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ 8.0 ఓరియో యొక్క ఓపెన్ బీటా నిర్మాణాన్ని వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లలో మ్యానువల్ గా ఫ్లాష్డ్ చేయాలి.

రెడ్‌మి నోట్ 4కు సెలవిచ్చేయండి, 5 వస్తోందిరెడ్‌మి నోట్ 4కు సెలవిచ్చేయండి, 5 వస్తోంది

ఆండ్రాయిడ్ ఓరియో చివరి OTA అప్ డేట్ గురించి తాజా ష్లాగ్షిప్ స్మార్ట్ ఫోనుకు రిలీజ్ చేస్తున్నప్పుడు కంపెనీ ప్రత్యేకంగా ప్రకటించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ ఆండ్రాయిడ్ ఓరియో 8.0 అప్ డేట్ 2018 ప్రారంభంలో రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఆండ్రాయిడ్ 8.0ఓరియో అప్ డేట్ తోపాటు, సంస్ధ వచ్చే ఏడాది ప్రారంభంలోనే కొత్త ఆక్సిజన్ ఓఎస్ అప్ డేట్ను రిలీజ్ చేయనుంది.

ఆండ్రాయిడ్ ఓరియో 8.0 బిల్ట్ వేగవంతమైన బూట్ టైమ్స్, ఆటో ఫిల్ , నోటిఫికేషన్ డాట్స్, సెట్టింగ్స్, రీడిజైన్డ్, స్మార్ట్ టెక్ట్స్ సెలక్షన్, పునరుద్దరించబడిన గూగుల్ నౌ, గూగుల్ ప్లే మ్యూజిక్ నోటిఫికేషన్లు మరియు పిక్చర్ మోడ్లో పిక్చర్ను తెస్తుంది.

ఈమధ్యే వన్ ప్లస్3, వన్ ప్లస్ 3T ఆండ్రాయిడ్ ఓరియో యొక్క బీటాను పొందింది. ఈ స్మార్ట్ ఫోన్లు ఈ ఏడాది చివరినాటికి స్థిరమైన అప్ డేట్ను పొందుతాయని ఇప్పటికే ప్రకటించినప్పటికీ...ఈ ప్లాన్ను తాత్కాళికంగా మార్చివేశారు.

వన్ ప్లస్5T, 6జిబి, 8జిబి ర్యామ్ మరియు 64జిబి, 128జిబి ఇంటర్నల్ స్టోరేజి స్పేస్ వంటి రెండు రకాల్లో రూ. 32,999, రూ. 37,999లకు అమెజాన్ ఇండియా ద్వారా నవంబర్ 21 నుంచి అమ్మకాలు జరగనున్నాయి.

Best Mobiles in India

English summary
OnePlus 5T that has launched yesterday is all set to get the stable Android 8.0 Oreo update in early 2018.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X