Home
News

OnePlus 5T వచ్చేస్తోంది, నవంబర్ 15న మార్కెట్లోకి!

By Bommu Sivanjaneyulu

ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ వన్‌ప్లస్ మరో హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లోకి తీసుకురాబోతోంది. OnePlus 5T పేరుతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. గతకొద్ది కాలంగా ఈ ఫోన్‌కు సంబంధించి అనేక రూమర్స్ ఇంటర్నెట్‌లో స్పెకులేట్ అవుతున్నాయి. తాజాగా లీకైన వివరాలను బట్టి చూస్తుంటే ఈ ఫోన్‌ను నవంబర్ 16న ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసే అవకావముందని తెలుస్తోంది.

OnePlus 5T to be Amazon Exclusive and it could be launched on November 16

ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రీ-ఆర్డర్ పేజీని SlashLeaks అనే టెక్నాలజీ డిస్కషన్ ప్లాట్‌ఫామ్ కొద్ది రోజుల క్రితం లీక్ చేసింది. ఈ ఇమేజ్‌లో సూచించబడుతోన్న సమాచారం ప్రకారం OnePlus 5T నవంబర్ 16న మార్కెట్లో లాంచ్ కాబోతోంది. Amazon ఇండియాలో మాత్రమే ఈ ఫోన్ ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యంకానుందట. సేల్ కూడా నవంబర్‌లోనే ప్రారంభమవుతుందని ఈ పేజ్ సజెస్ట్ చేస్తోంది.

వన్‌ప్లస్ కంపెనీ సహ-వ్యవస్థాపకులైన కార్ల్ పీ, పీట్ లావ్‌లు ఇప్పటికే వన్‌ప్లస్ 5టీకి సంబంధించిన కెమెరా శాంపిల్స్‌ను తమ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా టీజ్ చేస్తున్నారు. మరోవైపు, ప్రముఖ బెంచ్ మార్కింగ్ యాప్ AnTuTu, వన్‌ప్లస్ 5టీకి సంబంధించిన లిస్టింగ్స్‌ను ఇప్పటికే రివీల్ చేయటం జరిగింది. ఈ యాప్ వెల్లడించిన వివరాల ప్రకారం వన్‌ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్ 20 మెగా పిక్సల్ + 20 మెగా పిక్సల్ కెమెరాతో పాటు సరికొత్త 18:9 స్ర్కీన్‌తో రాబోతోంది.

ఆండ్రాయిడ్ 8.0 Oreo సాఫ్ట్‌వేర్ పై రన్ అయ్యే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8జీబి ర్యామ్‌తో పాటు 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యం ఉంటుందని AnTuTu లిస్టింగ్ పేర్కొంది. ఇదిలా ఉండగా, చైనా చెందిన ప్రముఖ ఈ-కామర్స్ సైట్ oppomart వన్‌ప్లస్ 5టీకి సంబంధించిన ప్రీ-ఆర్డర్స్‌ను ఇప్పటికే స్వీకరిస్తోంది. 64జీబి స్టోరేజ్ వేరియంట్ ధర $549 (ఇండియన్ కరెన్సీలో ఈ విలువ రూ.35,775), 128జీబి స్టోరేజ్ వేరియంట్ ధర $649 (ఇండియన్ కరెన్సీలో ఈ విలువ రూ.42,292)

oppomart ప్రీ-ఆర్డర్ పేజీలో కనిపిస్తోన్న OnePlus 5T స్పెసిఫికేషన్స్..

- 6-ఇంచ్ క్వాడ్ హైడెఫినిషన్ స్ర్కీన్, 18:9 యాస్పెక్ట్ రేట్ డిస్‌ప్లే విత్ 2160 x 1080 పిక్సల్స్ రిసల్యూషన్,

- ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం,

- క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 క్వాడ్-కోర్ ప్రాసెసర్, క్లాక్‌ స్పీడ్ అప్‌ టూ 2.45GHz,

- ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి),

- స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి),

- 20 మెగా పిక్సల్ + 16 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా, F2.6/F1.6 అపెర్చుర్.

More from GizBot

Best Mobiles in India

English summary
A new leak suggests that the upcoming flagship OnePlus 5T will be Amazon Exclusive and it could be launched on November 16.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X