జూన్‌లో వన్‌ప్లస్ 6, స్నాప్‌డ్రాగన్ 845తోనే..

Posted By: BOMMU SIVANJANEYULU

ఈ ఏడాది లాంచ్ కాబోతోన్న అత్యుంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లలో వన్‌ప్లస్ 6 ఒకటి. జూన్‌లో విడుదల కావొచ్చని భావిస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 సాక్ పై రన్ అవుతుంది. CNETకు ఇచ్చిన ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో భాగంగా వన్‌ప్లస్ సీఈఓ Pete Lau ఈ వివరాలను కన్ఫర్మ్ చేసారు.

జూన్‌లో వన్‌ప్లస్ 6, స్నాప్‌డ్రాగన్ 845తోనే..

వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌కు తరువాత వర్షన్ వన్‌ప్లస్ 6టీ ఇదే ఏడాది మార్కెట్లో లాంచ్ అవుతుందా, లేదా అన్నదాని పై ఆయన స్పష్టతనివ్వలేదు. యూఎస్ మార్కెట్లో లోకల్ క్యారియర్ల ద్వారా వన్‌ప్లస్ 6ను లాంచ్ చేయబోతున్నట్లు వన్‌ప్లస్ బ్రాండ్ సహవ్యవస్థాపకుల్లో ఒకరైన Pete Lau తెలిపారు.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రత్యేకతలు :

స్నాప్‌డ్రాగన్ 845 చిప్‌సెట్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఎక్స్20 ఎల్‌టీఈ మోడెమ్ మొబైల్ ఫోన్లలో గరిష్టంగా 1.2 జీబీపీఎస్ వరకు ఇంటర్నెట్ స్పీడ్‌ను ఇస్తుంది. ఈ చిప్‌సెట్ ఉన్న స్మార్ట్‌ఫోన్లలో డ్యుయల్ సిమ్, డ్యుయల్ వీవోఎల్‌టీఈ పనిచేస్తుంది.

అంటే వీవోఎల్‌టీఈ కెపాసిటీ ఉన్న రెండు సిమ్ కార్డులను ఒకేసారి స్టాండ్ బైలో ఉంచవచ్చు. ఇప్పటి ఫోన్లలో మాదిరిగా 4జీ వీవోఎల్‌టీఈ కావాలంటే సిమ్‌ను స్విచ్ చేయాల్సిన పనిలేదు. ఇక ఈ చిప్‌సెట్‌లో ఏర్పాటు చేసిన అడ్రినో 630 జీపీయూ గతంలో వచ్చిన చిప్‌సెట్స్ కన్నా వేగవంతమైన గ్రాఫిక్స్‌ను ఆఫర్ చేస్తుంది.

దుమ్మురేపిన ఆ ఫోన్లు మళ్లీ రంగం ప్రవేశం, తక్కువ ధరకే అంటున్న నోకియా !

English summary
In an interview with CNET, OnePlus CEO Pete Lau has said that it has no option but to launch the OnePlus 6 with Snapdragon 845 processor.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot