Home
News

వన్‌ప్లస్ 7 ప్రొ ధర, ఫీచర్లు, ఆఫర్లు తెలిస్తే ఆశ్చర్యపోతారు

దిగ్గజ చైనా స్మార్ట్ ఫోన్ల కంపెనీ.. వన్ ప్లస్ 7, 7 ప్రొ లనుఒకే సారి విడుదల చేసింది. బెంగళూరు, లండన్, న్యూయార్క్ లలో జరిగిన ఈవెంట్లో ఒకేసారి కంపెనీ ఈ రెండు ఉత్పత్తులను లాంచ్ చేసింది.

దిగ్గజ చైనా స్మార్ట్ ఫోన్ల కంపెనీ.. వన్ ప్లస్ 7, 7 ప్రొ లనుఒకే సారి విడుదల చేసింది. బెంగళూరు, లండన్, న్యూయార్క్ లలో జరిగిన ఈవెంట్లో ఒకేసారి కంపెనీ ఈ రెండు ఉత్పత్తులను లాంచ్ చేసింది. వన్ ప్లస్ ఈ ఫోన్ల‌తోపాటు వ‌న్‌ప్ల‌స్ 7 ప్రొ 5జీ వేరియెంట్‌ను కూడా వ‌న్‌ప్ల‌స్ కంపెనీ లాంచ్ చేసింది. అయితే ఈ వేరియెంట్ కేవ‌లం యూకే, ఫిన్‌లాండ్‌లోని ఎలిసాల‌ వంటి దేశాలలో మాత్ర‌మే ల‌భ్యం కానుంది. ఇక ఈ ఫోన్లో వ‌న్‌ప్ల‌స్ 7 లోని ఫీచ‌ర్ల‌నే ఏర్పాటు చేశారు.

 వన్‌ప్లస్ 7 ప్రొ ధర, ఫీచర్లు, ఆఫర్లు తెలిస్తే ఆశ్చర్యపోతారు

కాక‌పోతే 5జీ కోసం ప్ర‌త్యేకంగా క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ ఎక్స్‌50 5జీ మోడెమ్‌ను ఏర్పాటు చేశారు. కాగా వ‌న్‌ప్ల‌స్ 7 ప్రొ 5జీ ఫోన్ త్వ‌ర‌లో యూకేలోని ప‌లు ప్రాంతాల‌కు చెందిన యూజ‌ర్ల‌కు ల‌భ్యం కానుంది. ఇక దీన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లో విడుద‌ల చేసే ఆలోచ‌న‌పై వ‌న్‌ప్ల‌స్ ఎలాంటి స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు..!

వన్‌ప్ల‌స్ 7 ప్రొ ఫీచ‌ర్లు

వన్‌ప్ల‌స్ 7 ప్రొ ఫీచ‌ర్లు

6.67 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ ఫ్లుయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే,3120 x 1440 pixel screen resolution,గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌,ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్,6/8/12 GB RAM,128/256 GB STORAGE,Android 9.0 పై,dial sim,48+ 8 + 16 MP ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు,16 MP selfie camera,ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌,

USB type c,Dolby Atmos,Dual 4G Volte,Dual band wifi ,bluetooth 5.0,4000 MAH బ్యాట‌రీ + ఫాస్ట్ చార్జింగ్‌.

ధర మరియు ఆఫర్లు

ధర మరియు ఆఫర్లు

వన్‌ప్లస్ 7 ప్రొ ధర రూ.48,999 నుంచి ప్రారంభకానుంది. 6 జీబీ ర్యామ్/128 జీబీ మెమరీ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది. ఇక 8 జీబీ ర్యామ్/256 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.52,999గా, 12 జీబీ ర్యామ్/256 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.57,999గా ఉంది.

ఆఫర్లు,
వన్‌ప్లస్ 7 ఫోన్లపై అదిరిపోయే లాంచ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎస్‌బీఐ బ్యాంక్ కార్డు యూజర్లు రూ.2,000 వరకు తగ్గింపు పొందొచ్చు. అలాగే ఆరు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. అలాగే రిలయన్స్ జియో రూ.9,300 విలువైన ప్రయోజనాలు అందిస్తోంది. సర్వీఫై నుంచి 70 శాతం బైబ్యాక్ వ్యాల్యూ పొందొచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్‌ కూడా ఉంది.

 

జియో భారీ ఆఫర్‌

జియో భారీ ఆఫర్‌

రిలయన్స్‌ జియో భారీ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్ల కొనుగోలుపై రూ.9,300 విలువైన ప్రయోజనాలను వినియోగదారులకు అందించనుంది. వన్‌ప్లస్‌ 7, వన్‌ప్లస్‌7ప్రో స్మార్ట్‌ఫోన్‌లలో జియో నెట్‌వర్క్‌ వినియోగించే వారు రూ.299తో తొలి రీఛార్జ్‌ చేసుకుంటే, వోచర్ల రూపంలో రూ.5,400 ఇన్‌స్టాంట్‌ క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. రూ.150 విలువైన 36 వోచర్లు మై జియో యాప్‌లోకి వచ్చి చేరతాయి. దీంతో ఆ తర్వాతి నెల నుంచి రూ.149కే ఈ ఫ్లాన్‌ ద్వారా అందే ప్రయోజనాలను వినియోగదారులు పొందవచ్చు. రూ.299 ప్లాన్‌తో రోజుకు 3జీబీ 4జీ డేటా, అపరిమిత కాల్స్‌, మెస్సేజ్‌లను 28రోజుల పాటు అందిస్తోంది. ఇక దీంతో పాటు, రూ.3,900 విలువైన జూమ్‌కార్‌ ప్రయోజనాలు, ఈజీ మై ట్రిప్‌లో విమాన టికెట్లు, హోటల్‌ బుకింగ్స్‌పై రూ.1,550 విలువైన ప్రయోజనాలు, బస్‌ బుకింగ్స్‌పై 15శాతం రాయితీ, చుంబక్‌లో వస్తువుల కొనుగోలుపై రూ.350 డిస్కౌంట్‌ లభించనుంది.

OnePlus7 ఫీచర్లు

OnePlus7 ఫీచర్లు

6.41 ఇంచుల ఆప్టిక్ అమోలెడ్ డిస్‌ప్లే,fingerprint sensor,ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 8GB RAM, Android 9.0, వెనుక భాగంలో 48 + 5 మెగాపిక్స‌ల్ కెమెరాలు, ముందు భాగంలో 16 మెగాపిక్స‌ల్ కెమెరా, Dolby Atmos,3700 MAH బ్యాట‌రీ + ఫాస్ట్ చార్జింగ్, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్

వన్‌ప్లస్ 7 ధర

వన్‌ప్లస్ 7 ధర

వన్‌ప్లస్ 7 ధర రూ.32,999 నుంచి ప్రారంభమౌతోంది. 6 జీబీ ర్యామ్/128 జీబీ మెమరీ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది. ఇక 8 జీబీ ర్యామ్/256 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.37,999గా ఉంది. రెండు ఫోన్లు మే 17 నుంచి అందుబాటులోకి వస్తాయి. అమెజాన్ ప్రైమ్ సభ్యులు మే 16 నుంచి ఈ ఫోన్లను కొనొచ్చు.

సేల్స్ ఎప్పుడు ?

సేల్స్ ఎప్పుడు ?

వన్‌ప్లస్‌ 7, వన్‌ప్లస్‌ 7 ప్రో మొబైల్స్‌ కి సంబంధించి ఈ నెల 17 నుంచి అమెజాన్‌లో అమ్మకాలు ప్రారంభమవుతాయి. అమెజాన్‌ ప్రైమ్‌ వినియోగదారులు 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయవచ్చు. ఎస్‌బిఐ క్రెడిట్‌/డెబిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 2000 ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది.

Best Mobiles in India

English summary
OnePlus 7 Pro now available at Reliance Digital and My Jio stores: Price, offers, specifications, features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X