Home
News

OnePlus 7T Pro స్మార్ట్‌ఫోన్‌ మీద రూ.4,000 వరకు భారీ ధర తగ్గింపు

ఇండియాలో 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ ఫీచర్లతో గేమింగ్ కోసం అద్భుతమైన ఫీచర్లతో విడుదలైన వన్‌ప్లస్ 7T ప్రో స్మార్ట్‌ఫోన్ యొక్క ధర మీద ఇప్పుడు దాదాపుగా రూ.4,000 వరకు తగ్గింపు అందుకుంది. ఈ తగ్గింపు ధరలు ఇప్పుడు అమెజాన్.ఇన్ మరియు వన్‌ప్లస్.ఇన్ సైట్‌లలో కనిపిస్తాయి. తగ్గింపు ధరను అందుకున్న తరువాత దీనిని ఇప్పుడు రూ.43,999 ధర వద్ద కొనుగోలు చెయవచ్చు. స్నాప్‌డ్రాగన్ 855+ SoC, పాప్-అప్ సెల్ఫీ కెమెరా సెటప్‌ మరియు 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్‌ ట్రిపుల్ కెమెరా సెటప్‌ వంటి ఫీచర్లను కలిగి ఉన్న వన్‌ప్లస్ 7T ప్రో గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వన్‌ప్లస్ 7T ప్రో స్మార్ట్‌ఫోన్‌ తగ్గింపు ధరల వివరాలు

వన్‌ప్లస్ 7T ప్రో స్మార్ట్‌ఫోన్‌ తగ్గింపు ధరల వివరాలు

వన్‌ప్లస్ 7T ప్రో స్మార్ట్‌ఫోన్‌ యొక్క 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ యొక్క సాధారణ ధర రూ.47,999. దీని యొక్క ధరలు సవరించిన తరువాత 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్‌ను ఇప్పుడు 43,999 రూపాయల ధర వద్ద కొనుగోలు చెయవచ్చు. అంటే ఈ ఫోన్ మీద దాదాపుగా రూ.4000 వరకు ధర తగ్గింపును అందుకున్నది. దీనిని అమెజాన్.ఇన్ మరియు వన్‌ప్లస్.ఇన్‌లలో హేజ్ బ్లూ కలర్ ఆప్షన్‌లో కొనుగోలు చెయవచ్చు. ప్రస్తుతం దీనిని కొనుగోలు చేసే ఐసిఐసిఐ బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు రూ.3,000 అదనంగా క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది.

వన్‌ప్లస్ 7T ప్రో స్నాప్‌డ్రాగన్ 855+ SoC

వన్‌ప్లస్ 7T ప్రో స్నాప్‌డ్రాగన్ 855+ SoC

వన్‌ప్లస్ 7T ప్రో స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ నానో స్లాట్ కలిగి ఉంటుంది. అలాగే ఇందులో 6.67-అంగుళాల క్యూహెచ్‌డి + ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లేను 1,440x3,120 పిక్సెల్ పరిమాణంలో, 90HZ రిఫ్రెష్ రేట్ మరియు 19.5: 9 కారక నిష్పత్తితో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ SoC తో రన్ అవుతూ 8GB LPDDR4X RAM తో జత చేయబడి వస్తుంది.

వన్‌ప్లస్ 7T ప్రో సోనీ IMX586 సెన్సార్ కెమెరా సెటప్

వన్‌ప్లస్ 7T ప్రో సోనీ IMX586 సెన్సార్ కెమెరా సెటప్

వన్‌ప్లస్ 7T ప్రో స్మార్ట్‌ఫోన్ యొక్క ఇమేజింగ్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం వన్‌ప్లస్ 7T ప్రో వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ సోనీ IMX586 ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ సెన్సార్ మరియు 16 మెగాపిక్సెల్ సెన్సార్లు వరుసగా ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సోనీ IMX471 సెన్సార్‌తో సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుంది.

వన్‌ప్లస్ 7T ప్రో 30T ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ

వన్‌ప్లస్ 7T ప్రో 30T ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ

వన్‌ప్లస్ 7T ప్రో ఫోన్‌ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, వై-ఫై 802.11ac, బ్లూటూత్ V5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి మరియు యుఎస్‌బి టైప్-సి వంటివి ఉన్నాయి. డిస్ప్లే యొక్క ప్యానెల్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంటుంది. అలాగే ఇది వార్ప్ ఛార్జ్ 30T ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మద్దతుతో 4,085mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Best Mobiles in India

English summary
OnePlus 7T Pro Price Slashed in India Up to Rs. 4,000
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X