ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వన్‌ప్లస్ 7T : ధర ఎంతో తెలుసా!!

|

స్మార్ట్‌ఫోన్ల రంగంలో గల పోటీని దృష్టిలో పెట్టుకొని అన్ని కంపెనీలు కొత్త ఆండ్రాయిడ్ 10 అప్డేట్ లతో తమ స్మార్ట్‌ఫోన్లను ఇండియా మార్కెట్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు అదే కోవలో వన్‌ప్లస్ సంస్థ కూడా ఎట్టకేలకు తన తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 7 T ని ఇండియా మార్కెట్లో విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో దీనితో పాటు సంస్థ తన మొదటి స్మార్ట్ టీవీ సిరీస్‌ను కూడా రిలీజ్ చేసింది.

 

వన్‌ప్లస్

వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అవ్వకమునుపు టీవీలు, ఫోన్ ధరలు మరియు ప్రత్యేకతల విషయంలో చాలా లీకులు వచ్చాయి. వాటన్నికి తెర దించుతు వన్‌ప్లస్ వీటి ధరలను మరియు వాటి లభ్యత వివరాలను వెళ్ళడించింది. వన్‌ప్లస్ టీవీ క్యూ 1 సిరీస్ బేస్‌లైన్ వన్‌ప్లస్ టీవీ క్యూ 1 మరియు క్యూ 1 ప్రో మోడళ్లతో రిలీజ్ చేసింది.

వన్‌ప్లస్ 7T ధరల వివరాలు

వన్‌ప్లస్ 7T ధరల వివరాలు

వన్‌ప్లస్ 7T స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లలో విడుదల చేసింది. ఇందులో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.37,999. అలాగే 8 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .39,999. ఇది ఫ్రాస్ట్డ్ సిల్వర్ మరియు గ్లాసియర్ బ్లూ వంటి రెండు కలర్ లలో లభిస్తుంది.

లభ్యత వివరాలు
 

లభ్యత వివరాలు

వన్‌ప్లస్ 7 T అమ్మకాలు దీపావళిని జరుపుకునేందుకు ఉంచిన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఉంచారు. వీటి అమ్మకాలు సెప్టెంబర్ 29 నుండి మొదలుకానున్నాయి. అమెజాన్ ప్రైమ్ వినియోగదారులు సెప్టెంబర్ 28, 2019 నుండి కొనుగోలు చేయవచ్చు. దీనితో పాటు వన్‌ప్లస్ ఇండియా ఆన్ లైన్ మరియు వన్‌ప్లస్ ఆఫ్ లైన్ స్టోర్లలో కూడా కొనుగోలు చేయవచ్చు.

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

వన్‌ప్లస్ 7 T ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ యొక్క ప్రత్యేకతల విషయానికి వస్తే ఇది 6.55-అంగుళాల ఫ్లూయిడ్ అమోలేడ్ డిస్‌ప్లేను ఎఫ్‌హెచ్‌డి + (2,400 x 1,080 పిక్సెల్స్) రిజల్యూషన్‌తో వస్తుంది. దీని డిస్ప్లే 402 పిపిఐ పిక్సెల్ డెన్సిటీ, 90Hz ఫాస్ట్ రిఫ్రెష్ రేట్, 20: 9 కారక నిష్పత్తితో వస్తుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్ మద్దతుతో కూడా వస్తుంది. డిజైన్ వారీగా డిస్ప్లే నాచ్‌తో వస్తుంది. అయితే నాచ్ ఇప్పుడు 31.46 శాతం చిన్నదని కంపెనీ పేర్కొంది.

కెమెరా

ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ SoC తో, ఆక్టా-కోర్ CPU తో 2.96GHz వరకు క్లాక్ చేయబడి ఉంటుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వున్న ఫోన్ వెనుక కెమెరాలో సోనీ IMX586 సెన్సార్‌తో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా f / 1.6 ఎపర్చర్‌తో వస్తుంది. సెన్సార్ ఫోటోల కోసం OIS మరియు వీడియో స్టెబిలైజషన్ కోసం EIS కి మద్దతు ఇస్తుంది. ఇతర సెన్సార్లలో టెలిఫోటో లెన్స్‌తో 12 మెగాపిక్సెల్ కెమెరా మరియు అల్ట్రా-వైడ్ లెన్స్‌తో 16 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి.

సోనీ IMX471 సెన్సార్‌

వెనుక కెమెరాలో PDAF మరియు CAF ఆటో ఫోకస్ సిస్టమ్‌లతో పాటు డ్యూయల్ ఎల్‌ఇడి ఫ్లాష్ కూడా ఉంది. అలాగే ముందు వైపు కూడా సోనీ IMX471 సెన్సార్‌తో గల 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. వెనుకవైపు ఉన్న కెమెరా 60fps వద్ద 4K వీడియోకు సపోర్ట్ చేస్తుంది. ముందువైపు కెమెరా 30fps వద్ద 1080p వరకు షూట్ చేయగలదు. ఇందులో యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, యాంబియంట్ లైట్, ఎలక్ట్రానిక్ దిక్సూచి సెన్సార్‌లతో పాటు డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా కలిగి ఉంది.

కనెక్టివిటీ

కనెక్టివిటీ విషయంలో ఇది USB 3.1 జెన్ 1 ప్రోటోకాల్‌ మద్దతుతో పాటు టైప్-సి పోర్ట్‌ను కూడా కలిగి ఉంది. ఇతర కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్ 4G నానో-సిమ్ స్లాట్లు, వై-ఫై, బ్లూటూత్ V 5.0, NFCమరియు GPS ఉన్నాయి. వన్‌ప్లస్ 7 ప్రోలో వున్న హాప్టిక్ వైబ్రేషన్ మోటారును కూడా వన్‌ప్లస్ జోడించింది. దీనికి ఎడమ వైపున వాల్యూమ్ రాకర్ మరియు పవర్ బటన్ ఉంటుంది. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మోస్‌ మద్దతుతో వస్తుంది. సాఫ్ట్‌వేర్-ఎండ్‌లో వన్‌ప్లస్ 7 టి ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్ 10తో రన్ అవుతుంది.

వర్క్-లైఫ్ బ్యాలెన్స్

వన్‌ప్లస్ కంపెనీ "వర్క్-లైఫ్ బ్యాలెన్స్" అనే కొత్త సాఫ్ట్‌వేర్ ఫీచర్‌ను కూడా జోడించింది. వన్‌ప్లస్ మెసేజెస్ యాప్‌లో కొత్త స్మార్ట్ ఎస్‌ఎంఎస్ ఫీచర్లను తీసుకురావడానికి ఇది గుప్‌షప్‌తో పార్ట్నర్ షిప్ కలిగి ఉంది. 2020 లో వన్‌ప్లస్ పేను ప్రారంభించబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇతర సాఫ్ట్‌వేర్ లక్షణాలలో షెల్ఫ్‌లో క్రికెట్ స్కోర్లు మరియు అంతర్జాతీయ రోమింగ్ ఉన్నాయి. చివరిగా ఇది వార్ప్ ఛార్జ్ 30 టి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మద్దతుతో 3,800 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. వినియోగదారులు తమ బ్యాటరీని కేవలం 30 నిమిషాల్లో 0 నుండి 70 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

Best Mobiles in India

English summary
OnePlus 7T with Android 10 launched in India: Price,Specifications and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X