OnePlus 8 Pro: బ్రహ్మాండమైన ఫీచర్స్ ఇవే... ఈ ధర విభాగంలో గట్టి పోటీ
ప్రతి సంవత్సరం క్యూ 2 లాంచ్ కోసం వన్‌ప్లస్ ఎల్లప్పుడూ వన్‌ప్లస్ సంస్థ ఎదో ఒక స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేస్తుంది. ఇండియా యొక్క స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సంస్థ వన్‌ప్లస్ ఇప్పుడు మరొక కొత్త సిరీస్ ను ఇండియాలో లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నది. వన్‌ప్లస్ 8 సిరీస్ యొక్క లాంచ్ మార్చి చివరిలో లేదా ఏప్రిల్ మొదటిలో జరగవచ్చు అని మార్కెట్ లో ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి.

అధికారిక లాంచ్ కు ముందుగానే వన్‌ప్లస్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ వివరాలు కొత్తగా ఆన్‌లైన్‌లో లీక్ అయినాయి. తాజా లీక్ రెండర్ వన్‌ప్లస్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్ యొక్క కొన్ని స్పెసిఫికేషన్లను కూడా వెల్లడించింది. ఇది 120HZ రిఫ్రెష్ రేట్‌తో పెద్ద డిస్‌ప్లేతో పాటుగా 50W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుందని చెబుతున్నారు.

వన్‌ప్లస్ లీక్
వన్‌ప్లస్ లీక్‌ల విషయానికి వస్తే గొప్ప ట్రాక్ రికార్డ్ ఉన్న ఇషాన్ అగర్వాల్ యొక్క ట్వీట్ ప్రకారం ఇప్పుడు వన్‌ప్లస్ 8 సిరీస్ ఉహించిన దానికంటే చాలా ముందుగానే వస్తోందని తెలిపాడు. అతని ట్వీట్‌లో టిప్‌స్టర్ వన్‌ప్లస్ 8 మరియు 8 ప్రో మార్చి చివరిలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో లాంచ్ అవుతుందని పేర్కొన్నారు. అలాగే వన్‌ప్లస్ 8 లైట్ కూడా అదే సమయంలో లాంచ్ అవ్వవచ్చు అని పేర్కొన్నాడు. టిప్‌స్టర్‌కు వన్‌ప్లస్ 8 లైట్ లాంచ్ గురించి ఖచ్చితంగా తెలియదు. వన్‌ప్లస్ 8 మరియు 8 ప్రో రెండు ఫోన్‌లను గ్రీన్ కలర్‌లో లాంచ్ చేయవచ్చని ఆయన తెలిపారు.

వన్‌ప్లస్ 8 సిరీస్
అంతకుముందు ఆన్‌లీక్స్‌కు చెందిన స్టీవ్ హెచ్‌ఎంసిఫ్లై వన్‌ప్లస్ 8 సిరీస్ ఫిబ్రవరి మరియు మార్చి మధ్య అధికారికంగా లాంచ్ అవుతుంది అని పేర్కొంది. ఇషాన్ ట్వీట్‌కు సమాధానమిస్తూ కరోనావైరస్ కారణంగా లాంచ్ వెనక్కి జరిగింది అని స్టీవ్ చెప్పారు. చైనాలో కరోనావైరస్ వ్యాప్తి కారణంగా సరఫరా పనితీరు మీద ప్రభావితమయింది అని తెలిపారు. ముఖ్యంగా షియోమి ఈ వారం చివర్లో M10 సిరీస్ కోసం ఆన్‌లైన్-ఓన్లీ లాంచ్ ఈవెంట్‌ను మాత్రమే నిర్వహిస్తోంది.

లీక్ అయిన స్పెసిఫికేషన్స్
లీక్ అయిన స్పెసిఫికేషన్స్ వివరాలలోకి వెళితే ఇది ట్రిపుల్ కెమెరా సెటప్ సెన్సార్లతో ఎడమ వైపున ఒక స్ట్రిప్లో ఉంచబడిన 3D టోఫ్ ను కలిగి ఉంటుందని రెండర్ వెల్లడించింది. ఇది స్పష్టమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 చిప్ తో రావచ్చు అని భావిస్తున్నారు. వన్‌ప్లస్ 8 ప్రో సరికొత్త ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌తో మార్కెట్ లోకి అడుగుపెడుతుంది అని భావిస్తున్నారు. అంతేకాకుండా ఇది 50W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్‌తో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి అందిస్తున్నట్లు పుకారు ఉంది.

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఉపయోగంలో లేనప్పుడు ముందు కెమెరాను దాచిపెట్టే టెక్నాలజీకి పేటెంట్ దాఖలు చేసినట్లు ఈ వారం ప్రారంభంలో ఒక నివేదిక తెలిపింది. పేటెంట్ ఇటీవల విడుదల చేసిన ‘కాన్సెప్ట్ వన్' స్మార్ట్‌ఫోన్‌ను వన్‌ప్లస్ అమలు చేసినట్లుగానే ఉంది. దీనిని కంపెనీ గత నెలలో CES 2020 లో ప్రదర్శించింది. నివేదిక ప్రకారం పేటెంట్ అప్లికేషన్‌లో చేర్చబడిన డివైస్ యొక్క ఫోటో ప్రకారం ముందు కెమెరా కోసం పాప్-అప్ కెమెరా మెకానిజం యొక్క పంచ్-హోల్స్ లేవని చూపిస్తుంది.


Click it and Unblock the Notifications







