OnePlus 8 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు ఆక్సిజన్ OS11 అప్‌డేట్!!కొత్త ఫీచర్స్ బ్రహ్మాండం...  

|

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ వన్‌ప్లస్ ఈ సంవత్సరంలో విడుదల చేసిన వన్‌ప్లస్ 8 మరియు వన్‌ప్లస్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు ఆక్సిజన్ OS11 యొక్క అప్‌డేట్‌ను స్వీకరించడం ప్రారంభించింది. ఈ అప్‌డేట్‌ ఓవర్ ది ఎయిర్ (OTA) ద్వారా విడుదల చేస్తోంది. దీని యొక్క ప్రారంభంలో భాగంగా బ్యాచ్‌లోని ఎంచుకున్న ఫోన్‌లు అందుకోనున్నాయి. బిల్డ్ స్థిరంగా ఉంది అని భావించిన తర్వాత వన్‌ప్లస్ దీనిని ప్రజల కోసం విడుదల చేస్తుంది. కొత్త అప్‌డేట్‌ అనేది ఈ ఫోన్‌లకు ఆండ్రాయిడ్ 11 ను అప్‌డేట్‌ చేసిన ఆక్సిజన్ ఓఎస్ UIతో పాటు తీసుకువస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వన్‌ప్లస్ 8 సిరీస్ ఫోన్‌లలో కొత్త OS అప్‌డేట్

వన్‌ప్లస్ 8 సిరీస్ ఫోన్‌లలో కొత్త OS అప్‌డేట్

ఆక్సిజన్ OS11 యొక్క కొత్త అప్‌డేట్ స్టోరేజ్ మొత్తం 2.8GB అని వన్‌ప్లస్ తన యొక్క బ్లాగులో తెలిపింది. అందువల్ల వినియోగదారులు దీన్ని Wi-Fi ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవడం ఉత్తమం అని ప్రత్యేకంగా సూచించింది. ఈ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి వినియోగదారులకు తమ యొక్క ఫోన్లలో కనీసం 3GB స్టోరేజ్ ఫ్రీ స్పేస్ ఉండవలసి ఉంటుంది. అదనంగా అప్‌డేట్‌ ఇన్స్టాలేషన్ సమయంలో బ్యాటరీ 30 శాతం కంటే ఎక్కువ ఛార్జ్ ఉండాలి. ఈ అప్‌డేట్‌ వన్‌ప్లస్ 8 సిరీస్ ఫోన్‌ల కోసం మాత్రమే అందుబాటులో లభిస్తుంది అని గమనించండి.

Also Read: Amazon Great Indian Festival Sale: OnePlus స్మార్ట్‌ఫోన్‌ల మీద రూ.5000 వరకు తగ్గింపు!మిస్ అవ్వకండి..Also Read: Amazon Great Indian Festival Sale: OnePlus స్మార్ట్‌ఫోన్‌ల మీద రూ.5000 వరకు తగ్గింపు!మిస్ అవ్వకండి..

Oxygen OS 11 అప్‌డేట్ ఇంటర్‌ఫేస్‌ మార్పులు
 

Oxygen OS 11 అప్‌డేట్ ఇంటర్‌ఫేస్‌ మార్పులు

ఆక్సిజన్ OS 11 అప్‌డేట్ అనేది వన్‌ప్లస్ ఇంటర్‌ఫేస్‌లో ప్రవేశపెట్టినప్పటి నుండి చాలా ముఖ్యమైన మార్పులను తీసుకువస్తున్నది. UI ఇప్పుడు డిస్ప్లే అంతటా ఏకరీతి లేఅవుట్‌తో వస్తుంది. అంతేకాకుండా వాడుకలో సౌలభ్యం మరియు పునర్వినియోగతపై ఎక్కువ దృష్టి పెడుతుంది. ఎల్లప్పుడూ ఆన్ డిస్ప్లే అనేది ఆక్సిజన్ OS లో క్రొత్త ఫీచర్ దీనిని ఎంచుకోవడానికి అనేక AOD శైలులను తీసుకువస్తున్నది. వన్‌ప్లస్ కొత్తరకం వాచ్ డిజైన్ మరియు విడ్జెట్‌లను కూడా జోడించింది.

Oxygen OS 11 అప్‌డేట్ గేమింగ్ మోడ్‌ ఫీచర్స్

Oxygen OS 11 అప్‌డేట్ గేమింగ్ మోడ్‌ ఫీచర్స్

ఆక్సిజన్ OS11 యొక్క కొత్త అప్‌డేట్‌లో గేమ్ స్పేస్ ఫీచర్ ప్రత్యేకంగా ఉంది. ఇది ఫెనాటిక్ మోడ్ యొక్క అనుకూలమైన స్విచ్‌ల కోసం కొత్తగా జోడించిన గేమింగ్ టూల్స్ బాక్స్ లో ఉంటుంది. దీని యొక్క నోటిఫికేషన్ల కోసం టెక్స్ట్-ఓన్లీ, హెడ్స్ అప్ మరియు బ్లాక్ వంటి మూడు మార్గాలను ఎంచుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ మరియు వాట్సాప్ కోసం చిన్న విండోలో క్విక్ రిప్లై ఫీచర్ కూడా ఉంది. గేమింగ్ మోడ్‌లో స్క్రీన్ ఎగువవైపున కుడి మరియు ఎడమవైపు మూలల నుండి క్రిందికి స్వైప్ చేయడం ద్వారా వినియోగదారులు దీన్ని ప్రారంభించవచ్చు.

Oxygen OS 11 అప్‌డేట్‌లో అదనపు ఫీచర్స్

Oxygen OS 11 అప్‌డేట్‌లో అదనపు ఫీచర్స్

ఆక్సిజన్ OS11 యొక్క కొత్త అప్‌డేట్‌లో అదనంగా గ్యాలరీ యాప్ వంటి కొన్ని కొత్త అప్‌డేట్‌లను కూడా పొందుతుంది. ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్ స్టోరీస్ మాదిరిగానే ఇప్పుడు స్టోరీ ఫంక్షన్ కూడా అందుబాటులోకి రానున్నది. ఇది స్వయంచాలకంగా ఫోన్ స్టోరేజీలో గల ఫోటోలు మరియు వీడియోలతో వీడియోలను రూపొందించడం ప్రారంభిస్తుంది. లోడింగ్ స్పీడ్ కూడా ఆప్టిమైజ్ చేయడం మరియు ఇమేజ్ ప్రివ్యూ స్పీడ్ పెంచడానికి అనుమతిని ఇస్తుంది.

Best Mobiles in India

Read more about:
English summary
OnePlus 8 Series Smartphones Starts Receiving Oxygen OS 11 Update With Android 11

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X