OnePlus 8T స్మార్ట్‌ఫోన్ ఎటువంటి ఫీచర్లతో లాంచ్ అవుతోందో తెలుసా??

|

ఈ సెప్టెంబర్ నెలలో చాలా కంపెనీలు డజన్ల కొద్ది స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేయనున్నారు. అందులో భాగంగా వన్‌ప్లస్ సంస్థ కూడా తన సరికొత్త వన్‌ప్లస్ 8T ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. గత సంవత్సరంలో విడుదల అయిన వన్‌ప్లస్ 8 ఫోన్ మీద భారీ అప్‌గ్రేడ్‌లతో వన్‌ప్లస్ 8T విడుదల కానున్నది. స్మార్ట్‌ఫోన్ విడుదలకు ముందే వాటి యొక్క స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్లను లీక్‌ల ద్వారా విడుదల చేసి హైప్ క్రీయేట్ చేయడం సాధారణం అయింది. లీక్‌ల ఆధారంగా వన్‌ప్లస్ 8T 3D డిజైన్ మరియు ఫీచర్లను అద్భుతంగా కలిగి ఉంది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వన్‌ప్లస్ 8T ఫీచర్స్ లీక్‌లు
 

వన్‌ప్లస్ 8T ఫీచర్స్ లీక్‌లు

ప్రైస్‌బాబా మరియు ఆన్‌లీక్స్ యొక్క తాజా రెండర్‌లలోని సమాచారం ప్రకారం వన్‌ప్లస్ 8T అద్భుతమైన 3D డిజైన్ ను అందించే సూచనలు ఉన్నాయి. ఈ ఫోన్ శామ్‌సంగ్ యొక్క తాజా S మరియు A సిరీస్ ఫోన్‌లను పోలి ఉంటుంది అని తెలుపుతున్నాయి. ఫోన్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌ను దీర్ఘచతురస్రాకార కెమెరా హంప్ నిర్మాణంలో కలిగి ఉంది. వెనుక అంచులు వన్‌ప్లస్ 8 మాదిరిగానే వక్రంగా ఉంటాయి. ఫ్రేమ్ ఒక USB-C పోర్ట్ మరియు సాధారణ బటన్ల సెట్‌ను కలిగి ఉంటుంది.

వన్‌ప్లస్ 8T 3D డిజైన్‌

వన్‌ప్లస్ 8T 3D డిజైన్‌

వన్‌ప్లస్ 8T యొక్క ముందు వైపు డిజైన్‌లో మాత్రం అద్భుతమైన మార్పులను కలిగి ఉన్నాయి. వన్‌ప్లస్ 8T కర్వ్ అంచు డిస్ప్లే ను కాకుండా ఫ్లాట్-ఎడ్జ్ డిస్ప్లేతో రాబోతున్నది. లీక్‌లు డిస్ప్లే చుట్టూ చాలా సన్నని నొక్కులు ఉన్నట్లు చూపుతున్నాయి. ముందువైపు గల సెల్ఫీ కెమెరా కూడా ఎడమవైపు మూలలో ఒక చిన్న పంచ్-హోల్ కటౌట్ నిర్మాణంలో ఉంటుంది. దీని యొక్క డిస్ప్లే ఫుల్ HD + రిజల్యూషన్‌తో 120Hz రిఫ్రెష్ రేటుతో 6.5-అంగుళాల పరిమాణంలో వస్తుంది.

Also Read:ధర.25,000 లలో బెస్ట్ ఫోన్లు ఇవే! ధరలు మరియు ఫీచర్ లు చూడండి.

వన్‌ప్లస్ 8T స్నాప్‌డ్రాగన్ 865 ప్లస్ చిప్‌సెట్

వన్‌ప్లస్ 8T స్నాప్‌డ్రాగన్ 865 ప్లస్ చిప్‌సెట్

ఆన్‌లీక్స్ జాబితా ప్రకారం వన్‌ప్లస్ 8T యొక్క కొన్ని స్పెసిఫికేషన్లను కూడా విడుదల చేసింది. ఇది వన్‌ప్లస్ స్నాప్‌డ్రాగన్ 865 చిప్‌ను ఉపయోగిస్తున్నది. వన్‌ప్లస్ సాధారణంగా ఏ సమయంలోనైనా లభించే వేగవంతమైన క్వాల్కమ్ చిప్‌ను ఉపయోగిస్తుండటం విచిత్రమైనది. స్నాప్‌డ్రాగన్ 865 ప్లస్ చిప్‌సెట్‌ను ఉపయోగిస్తున్నట్లు ఇతర లీక్‌లు తెలుపుతున్నాయి.

వన్‌ప్లస్ 8T అప్‌గ్రేడ్ ఫీచర్స్
 

వన్‌ప్లస్ 8T అప్‌గ్రేడ్ ఫీచర్స్

ఏదేమైనా వన్‌ప్లస్ 8T రెండు వేరియంట్లలో విడుదల కానున్నది. ఇందులో బేస్ వెర్షన్‌ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మరియు టాప్-ఎండ్ వేరియంట్‌లో 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ లభిస్తాయి. అలాగే బ్యాటరీ విషయంలో కూడా 4500mAh అప్‌గ్రేడ్ యూనిట్‌తో వస్తున్నది. మరీ ముఖ్యంగా ఇది ఒప్పో యొక్క 65W ఫాస్ట్ ఛార్జింగ్‌ టెక్నాలజీకి అప్‌గ్రేడ్ చేస్తుంది. అందువల్ల బ్యాటరీని కేవలం 30 నిమిషాల కన్నా తక్కువ వ్యవధిలో పూర్తిగా రీఛార్జ్ అవుతుందని మీరు ఆశించవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
OnePlus 8T Specifications Leaks : Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X