వన్‌ప్లస్ 9R మొదటి సేల్ నేడే ప్రారంభం!! ఆఫర్స్ మిస్ అవ్వకండి...

|

వన్‌ప్లస్ 9R ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి అమ్మకాలు ఏప్రిల్ 15 అంటే ఈ రోజు మధ్యాహ్నం 12PM నుంచి అమెజాన్ మరియు వన్‌ప్లస్ యొక్క వెబ్ సైట్ లో మొదలుకానున్నాయి. అమెజాన్ ప్రైమ్ మరియు రెడ్ కేబుల్ క్లబ్ సభ్యులు దీనిని కొనుగోలు చేయడం కోసం యాక్సిస్ లభించింది. వన్‌ప్లస్ ఫోన్ యొక్క ప్రారంభ లభ్యత ఇప్పుడు సాధారణ వినియోగదారుల కోసం అందుబాటులోకి రానున్నది.

వన్‌ప్లస్ 9R‌

వన్‌ప్లస్ 9R‌ను గత నెలలో వన్‌ప్లస్ 9 మరియు వన్‌ప్లస్ 9 ప్రోతో పాటు విడుదల చేశారు. ఇది అధిక ధర వద్ద లభించే వన్‌ప్లస్ 9 తో చాలా సారూప్యతలను కలిగి ఉంటుంది. వన్‌ప్లస్ 9R ఫోన్ ఇటీవల విడుదలైన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 870 SoC తో రన్ అవుతూ 5G కనెక్టివిటీ మరియు ఫ్లాగ్‌షిప్ ప్రాసెసింగ్‌ను కలిగి ఉంటుంది. వివో X60, ఐఫోన్ 11, మరియు శామ్‌సంగ్ గెలాక్సీ S20 FE వంటి వాటికి గట్టి పోటీని ఇచ్చే ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వన్‌ప్లస్ 9R ధరల వివరాలు

వన్‌ప్లస్ 9R ధరల వివరాలు

ఇండియాలో వన్‌ప్లస్ 9R ఫోన్ రెండు వేరియంట్‌లలో విడుదలైంది. ఇందులో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ.39,999 కాగా 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్‌ రూ.43,999 ధరను కలిగి ఉంది. ఇది కార్బన్ బ్లాక్ మరియు లేక్ బ్లూ కలర్ లలో లభిస్తుంది. దీనిని నేటి నుంచి అమెజాన్, వన్‌ప్లస్.ఇన్, వన్‌ప్లస్ ఎక్స్‌క్లూజివ్ ఆఫ్‌లైన్ స్టోర్స్ మరియు భాగస్వామి అవుట్‌లెట్ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

వన్‌ప్లస్ 9R సేల్స్ ఆఫర్స్

వన్‌ప్లస్ 9R సేల్స్ ఆఫర్స్

వన్‌ప్లస్ 9R ఫోన్ యొక్క సేల్ ఆఫర్‌ల విషయానికి వస్తే అమెజాన్, వన్‌ప్లస్.ఇన్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా SBI క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసిన వారికి రూ.2,000 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. అదనంగా వీరికి నో-కాస్ట్ EMI లావాదేవీలు కూడా లభిస్తాయి. ఇవే కాకుండా ఏదైనా క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు ఆరు నెలల వరకు నో-కాస్ట్ EMI ఎంపికలు ఉంటాయి. ఇంకా వినియోగదారులకు జియో యొక్క ఎంచుకున్న ప్రీపెయిడ్ ప్లాన్‌లతో 6,000 రూపాయల బోనస్ కూపున్స్ కూడా లభిస్తాయి.

వన్‌ప్లస్ 9R స్పెసిఫికేషన్స్

వన్‌ప్లస్ 9R స్పెసిఫికేషన్స్

వన్‌ప్లస్ 9R ఫోన్ ఆండ్రాయిడ్ 11 లో ఆక్సిజన్‌ఓఎస్ 11 తో రన్ అవుతుంది. అలాగే ఇది 120HZ రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డి + ఒఎల్‌ఇడి డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్స్ పరిమాణంలో కలిగి ఉంటుంది. ఇది ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 870 SoC తో శక్తిని పొందుతూ 12GB RAM తో జతచేయబడి వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో ఎఫ్ / 1.7 లెన్స్‌తో 48 మెగాపిక్సెల్ సోనీ IMX586 ప్రైమరీ సెన్సార్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా సెటప్‌లో 16 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ను ఎఫ్ / 2.2 అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ తో మరియు 5 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ షూటర్ కెమెరాలు ప్యాక్ చేయబడి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.4 లెన్స్‌తో 16 మెగాపిక్సెల్ సోనీ IMX471 సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.

వన్‌ప్లస్ 9R 4,500mAh బ్యాటరీ ఫీచర్స్

వన్‌ప్లస్ 9R 4,500mAh బ్యాటరీ ఫీచర్స్

వన్‌ప్లస్ 9R ఫోన్ యొక్క స్టోరేజ్ విభాగానికి వస్తే ఇది 256GB వరకు గల UFS 3.1 2-లేన్ స్టోరేజ్‌తో వస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, వై-ఫై 6, బ్లూటూత్ V5.1, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి మరియు యుఎస్‌బి టైప్-సి పోర్ట్ వంటివి ఉన్నాయి. బోర్డులోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, గైరోస్కోప్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. అలాగే ఇది వార్ప్ ఛార్జ్ 65 మద్దతుతో 4,500mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 160.7x74.1x8.4mm కొలతలతో 189 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
OnePlus 9R First Sale Starts in India Today at 12PM Via Amazon, OnePlus.in: Price, Specs, Sale Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X