వన్‌ప్లస్ 9R vs వన్‌ప్లస్ 9RT: ధరలు, ఫీచర్స్ మధ్య ఎలాంటి తేడాలు ఉన్నాయో తెలుసా??

|

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ ఇండియాలోని తన యొక్క స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోలో తాజాగా వన్‌ప్లస్ 9RTని చేర్చింది. నిన్న అంటే జనవరి 14న కంపెనీ వింటర్ ఎడిషన్ లాంచ్ ఈవెంట్‌లో వన్‌ప్లస్ 9RTని విడుదల చేసింది. 2021 మార్చిలో కంపెనీ వన్‌ప్లస్ 9R ని కూడా ప్రారంభించింది. ఇది ఇటీవల ప్రారంభించిన హ్యాండ్‌సెట్‌కు సమానమైన మోనికర్‌ను కలిగి ఉంది. OnePlus 9R అనేది మిడ్-ప్రీమియం సిరీస్ స్మార్ట్‌ఫోన్. ఇది ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్‌లతో గేమర్‌లను లక్ష్యంగా చేసుకునేలా రూపొందించబడింది. కొత్తగా ప్రారంభించిన OnePlus 9RT మునుపటి మాదిరిగానే అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది. వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ రెండు హ్యాండ్‌సెట్‌లలో వినియోగదారులు దేనిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? వీటి మధ్య గల పోలికల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వన్‌ప్లస్ 9R vs వన్‌ప్లస్ 9RT ధరల మధ్య తేడాలు

వన్‌ప్లస్ 9R vs వన్‌ప్లస్ 9RT ధరల మధ్య తేడాలు

భారతదేశంలో వన్‌ప్లస్ 9R స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ +128GB స్టోరేజ్ వేరియంట్ ను రూ.39,999 మరియు 12GB ర్యామ్ +256GB స్టోరేజ్ వేరియంట్ ను రూ.43,999 ధర వద్ద లాంచ్ చేసింది. అయితే తాజా వన్‌ప్లస్ 9RT స్మార్ట్‌ఫోన్ దీనికి విరుద్ధంగా 8GB ర్యామ్ +128GB స్టోరేజ్ వేరియంట్ ను రూ.42,999 ధర ట్యాగ్‌తో మరియు 12GB ర్యామ్ +256GB స్టోరేజ్ తో కూడిన సుపీరియర్ మెమరీ వేరియంట్ రూ.46,999 ధర వద్ద ప్రారంభించబడింది.

వన్‌ప్లస్ 9R మరియు వన్‌ప్లస్ 9RT స్పెసిఫికేషన్ల మధ్య తేడా

వన్‌ప్లస్ 9R మరియు వన్‌ప్లస్ 9RT స్పెసిఫికేషన్ల మధ్య తేడా

వన్‌ప్లస్ 9R మరియు వన్‌ప్లస్ 9RTల మధ్య తేడాల విషయానికి వస్తే డిస్ప్లే విభాగంలో వన్‌ప్లస్ 9R ఫోన్ 6.55-అంగుళాల ఫుల్ HD+ 120Hz ఫ్లూయిడ్ AMOLED డిస్‌ప్లేతో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో లభించగా అయితే వన్‌ప్లస్ 9RT ఫోన్ 6.62-అంగుళాల FHD+ డిస్‌ప్లేతో విడుదల చేయబడింది. ఇది 120Hz వరకు రిఫ్రెష్ రేటు, 600Hz టచ్ శాంప్లింగ్ రేట్ మరియు 1300నిట్స్ గరిష్ట ప్రకాశం మద్దతుతో లభిస్తుంది. OnePlus 9R స్మార్ట్‌ఫోన్ హుడ్ కింద Qualcomm Snapdragon 870 చిప్‌సెట్‌ ఆధారితంగా 8GB/12GB RAM మరియు 128GB/256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జత చేయబడి వస్తుంది. మరోవైపు కొత్తగా ప్రారంభించబడిన OnePlus 9RT స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 888 SoCతో పాటు 12GB వరకు LPDDR5 RAM మరియు 256GB UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ ఎంపికలతో లభిస్తుంది. రెండు పరికరాలు 5G కనెక్టివిటీని సపోర్ట్ చేస్తాయి.

స్పెక్‌

కెమెరా విభాగానికి వస్తే వన్‌ప్లస్ 9R స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో 48MP సోనీ IMX586 ప్రైమరీ సెన్సార్, 16MP అల్ట్రా-వైడ్-యాంగిల్ షూటర్, 5MP మాక్రో సెన్సార్ మరియు 2MP మోనోక్రోమ్ లెన్స్‌తో కూడిన క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. అలాగే ముందు భాగంలో సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం 16MP Sony IMX471 సెన్సార్‌ని కలిగి ఉంది. అయితే కొత్తగా ప్రారంభించబడిన OnePlus 9RT స్మార్ట్‌ఫోన్ 6MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ మరియు 2MP మాక్రో సెన్సార్‌తో పాటు 50MP సోనీ IMX766 ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉన్న ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 16MP సోనీ IMX471 సెన్సార్ కెమెరాను కలిగి ఉంటుంది. OnePlus 9R 4500mAh బ్యాటరీతో మద్దతు ఇస్తుంది మరియు 65W వార్ప్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది. కొత్తగా ప్రారంభించబడిన OnePlus 9RT కూడా ఇదే విధమైన ఛార్జింగ్ స్పెక్‌తో వస్తుంది. పరికరం 4500mAh బ్యాటరీతో కూడా మద్దతునిస్తుంది మరియు 65W ఫాస్ట్-ఛార్జ్ టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది. ఇది పరికరాన్ని కేవలం 29 నిమిషాల్లో ఛార్జ్ చేయగలదు.

Best Mobiles in India

English summary
OnePlus 9R vs OnePlus 9RT: Differences Between The Prices and Features?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X