Home
News

OnePlus కొత్త స్మార్ట్‌ఫోన్‌ కీలక స్పెసిఫికేషన్లు లీక్‌.. ఫీచర్లు, లాంచ్‌ వివరాలు..!

వన్‌ప్లస్‌ Ace 2 ప్రో స్మార్ట్‌ఫోన్ గత ఆగస్టులో చైనాలో లాంచ్‌ అయింది. ఈ ఫోన్‌ తర్వాత తరం హ్యాండ్‌సెట్‌గా వన్‌ప్లస్ Ace 3 ప్రో త్వరలో (OnePlus Ace 3 pro) లాంచ్‌ కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై వన్‌ప్లస్‌ ఎటువంటి ధ్రువీకరణ ప్రకటన ఇవ్వలేదు. అయితే చైనాకు చెందిన ఓ టిప్‌స్టర్ ఈ స్మార్ట్‌ఫోన్ వివరాలను లీక్‌ చేశారు.

వన్‌ప్లస్‌ Ace 3 ప్రో స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 SoC పైన పనిచేస్తుంది. మరియు గరిష్ఠంగా 24GB ర్యామ్, 1TG అంతర్గత స్టోరేజీని జతచేయబడి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ColorOS 14 పైన పనిచేస్తుందని తెలుస్తోంది.

OnePlus Ace 3 Pro smartphone specs and features leaked

ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల OLED కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 1.5 రిజల్యూషన్‌, 120Hz డిస్‌ప్లే రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. డిజిటల్‌ చాట్‌ స్టేషన్‌ ఆధారంగా వన్‌ప్లస్‌ Ace 3 ప్రో స్మార్ట్‌ఫోన్‌ మధ్యలో మెటల్ ఫ్రేమ్‌ను మరియు వెనుకవైపు గ్లాస్‌ ప్యానల్‌ను కలిగి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ ఫోన్‌ చైనాలో త్వరలో విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు లాంచ్‌ చేస్తారనే సమాచారం లేదు.

* వన్‌ప్లస్‌ ఇటీవల భారత్‌లో నిర్వహించిన "స్మూత్‌ బియాండ్‌ బిలీఫ్‌" ఈవెంట్‌లో OnePlus 12 మరియు 12R స్మార్ట్‌ఫోన్ల సహా వన్‌ప్లస్‌ బడ్స్‌ 3ను విడుదల చేసింది. వన్‌ప్లస్‌ 12R ప్రత్యేక ఎడిషన్‌ను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఫిబ్రవరి 28న ప్రపంచ వ్యాప్తంగా OnePlus 12R Genshin Impact ఎడిషన్‌ను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది.

వన్‌ప్లస్ 12R ప్రత్యేక ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ కొన్ని ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు ఎలక్ట్రో వైలెట్‌ రంగును కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకమైన డిజైన్‌, గేమింగ్ అనుభూతిని మెరుగుపరిచే సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మిగిలిన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు సాధారణ వన్‌ప్లస్ 12R మాదిరిగా ఉంటాయి.

వన్‌ప్లస్‌ 12R స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల 1.5k 10 bit అమోలెడ్‌ ProXDR డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. HDR10+, LTPO4 సపోర్టుతో వస్తుంది. LTPO 4వ టెక్నాలజీని కలిగి ఉన్న తొలి వన్‌ప్లస్‌ ఫోన్‌గా 12R నిలిచింది. డిస్‌ప్లే రక్షణకు కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ విక్టస్‌ రక్షణతో వస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ IMX89 ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2MP మాక్రో కెమెరాను కలిగి ఉంది. సెల్పీ, వీడియో కాల్స్‌ కోసం ముందువైపు 16MP కెమెరాను అమర్చారు. ఈ వన్‌ప్లస్‌ 12r స్మార్ట్‌ఫోన్‌ 100W సూపర్‌వోక్‌ ఛార్జింగ్‌ (వైరడ్‌) సపోర్టుతో 5500mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
OnePlus Ace 3 Pro smartphone specs and features leaked
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X