Home
News

OnePlus కొత్త స్మార్ట్‌ఫోన్‌ వివరాలు లీక్‌.. ట్రిపుల్‌ కెమెరా సహా కీలక ఫీచర్లు!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్‌ నుంచి త్వరలో కొత్తఫోన్‌ OnePlus Ace3 విడుదల కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ గురించి ఇటీవల కాలంలో అనేక వివరాలు లీక్‌ అయ్యాయి. చైనాకు చెందిన టిప్‌స్టర్‌ ఈ ఫోన్‌ గురించి అనేక విషయాలను వెల్లడించారు. ఈ ఫోన్‌ మెటల్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుందని తెలిపారు. దీంతోపాటు 1.5k క‌ర్వడ్‌ మెటల్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

చైనా మినహా : గీక్‌బెంచ్‌ లిస్టింగ్ ప్రకారం వన్‌ప్లస్‌ ఏస్‌ 3 స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 SoC ప్రాసెసర్‌ మరియు 16GB ర్యామ్‌ను కలిగి ఉంటుంది. చైనాలో ఈ స్మార్ట్‌ఫోన్‌ వన్‌ప్లస్‌ ఏస్‌ 3గా విడుదల కానుంది. చైనా మినహా ఇతర మార్కెట్‌లో వన్‌ప్లస్‌ 12Rగా లాంచ్‌ కానుందని తెలుస్తోంది.

OnePlus Ace 3 smartphone

1.5k రిజల్యూషన్‌ కర్వడ్‌ డిస్‌ప్లేను : టిప్‌స్టర్‌ డిజిటల్‌ చాట్‌ స్టేషన్‌ లీక్‌ చేసిన వివరాలు ఆధారంగా 1.5k రిజల్యూషన్‌ కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. గన్‌మెటల్‌ గ్రే గ్లాస్‌ బాడీ సహా మెటల్‌ ఫ్రేమ్‌తో వస్తుంది. గీక్‌బెంచ్‌ లిస్టింగ్‌లో PjD110 సింగిల్‌కోర్‌ స్కోర్‌ 1597 పాయింట్లు, మల్టీ కోర్ స్కోర్‌ 5304 పాయింట్లను సాధించింది. దీంతోపాటు ఆండ్రాయిడ్‌ 13పైన పనిచేస్తుంది.

గతంలో లీక్‌ అయిన వివరాల ప్రకారం వన్‌ప్లస్‌ 12R స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు 50MP ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ కెమెరా OIS- ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ సపోర్టుతో వస్తుంది. 8MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ సెన్సార్‌, 32MP టెలీఫోటో కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ ఫోన్‌ ముందువైపు 16MP కెమెరాతో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది.

వన్‌ప్లస్‌ 12R (చైనాలో వన్‌ప్లస్‌ ఏస్‌ 3) వన్‌ప్లస్‌ 11R తర్వాత వెర్షన్‌గా వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌ 6.74 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ ఫోన్‌ క్కాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌1 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. దీంతోపాటు ఈ ఫోన్‌ వెనుకవైపు 50MP ప్రైమరీ కెమెరా, 8MP, 2MP కెమెరాలను కలిగి ఉంది. ముందువైపు 16MP కెమెరాలను కలిగి ఉంటుంది.

వన్‌ప్లస్‌ ఏస్‌2 స్మార్ట్‌ఫోన్‌ 12GB ర్యా్మ్‌, 256GB స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. స్టోరేజీ పెంచుకొనే అవకా దీంతో పాటు 5000mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. సూపర్‌వోక్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో వస్తుంది. మరియు ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత కలర్‌ OS పైన పనిచేస్తుంది. 12GB ర్యామ్‌, 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.34190గా ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus Ace 3 smartphone features leaked ahead of launch
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X