OnePlus & OPPO బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు ఈ దేశంలో నిషేదించబడ్డాయి!! కారణం ఏమిటో తెలుసా?

|

గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ తయారీదారులు OPPO మరియు దాని అనుబంధ సంస్థ OnePlus జర్మనీలో తమ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లు మరియు స్మార్ట్‌వాచ్‌ల యొక్క అమ్మకాలను పూర్తిగా నిలిపివేశాయి. జర్మనీలో ఫిన్నిష్ టెలికాం ప్లేయర్ నోకియా యొక్క పేటెంట్ లైసెన్స్ ని ఉపయోగిస్తూ వారికి ఎటువంటి మొత్తం చెల్లించకుండా 4G మరియు 5G సిగ్నల్‌లను ప్రాసెస్ చేసే ఫోన్లను తయారు చేయడానికి కంపెనీలు తమ పేటెంట్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయని నోకియా ఆరోపించింది. నోకియా సంస్థ ఒప్పో సంస్థల అమ్మకాలను నిలిపివేయడానికి జర్మన్ కోర్టులో వేసిన కేసును గత వారం గెలుచుకుంది. OnePlus కంపెనీ జర్మనీలో విక్రయాలను నిలిపివేసిందని దీనికి ప్రధాన కారణం "నోకియా యొక్క అసమంజసమైన అధిక రుసుము డిమాండ్" దావా అని కంపెనీలు ది వెర్జ్‌ పత్రికకు తెలిపాయి.

OnePlus

"కొనసాగుతున్న చట్టపరమైన సమస్యను పరిష్కరించడానికి మేము సంబంధిత పార్టీలతో చురుకుగా పని చేస్తున్నాము" అని OnePlus ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. "OnePlus జర్మన్ మార్కెట్‌కు కట్టుబడి ఉంది మరియు మా కార్యకలాపాలను కొనసాగిస్తుంది. అదే సమయంలో జర్మనీలోని వన్‌ప్లస్ వినియోగదారులు మా ఉత్పత్తుల అమ్మకాల తర్వాత సాధారణ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు వంటి సంబంధిత సేవలను మునుపటిలాగే ఆస్వాదించడాన్ని కొనసాగించవచ్చు"అని వన్‌ప్లస్ ప్రతినిధి మీడియా సమావేశంలో చెప్పారు.

JUVE పేటెంట్‌

ఒప్పో సంస్థ యొక్క ప్రతినిధి యూరోపియన్ పేటెంట్ న్యూస్ సైట్ JUVE పేటెంట్‌తో మాట్లాడుతూ "అనేక 5G పేటెంట్‌ల యజమానిగా ఒప్పో సంస్థ ప్రత్యేకించి అధిక స్థాయికి ఆవిష్కరణలో మేధో సంపత్తి విలువను గౌరవిస్తుంది". "ఒప్పో మరియు నోకియా సంస్థల మధ్య 4G ఒప్పందం గడువు ముగిసిన మరుసటి రోజు నోకియా సంస్థ వెంటనే కోర్టుకు వెళ్లింది. వారు ఇంతకుముందు కాంట్రాక్ట్ పునరుద్ధరణ మరియు పొడగింపు కోసం అధిక మొత్తంలో రుసుమును డిమాండ్ చేశారు"అని కంపెనీ ప్రతినిధి తెలిపారు.

మీ WhatsApp మెసేజ్ లు ఎవరు Screenshot తీసుకోకుండా, కొత్త ఫీచర్ ! వివరాలు.మీ WhatsApp మెసేజ్ లు ఎవరు Screenshot తీసుకోకుండా, కొత్త ఫీచర్ ! వివరాలు.

యూరప్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్

ఈ ఏడాది క్యూ2లో యూరప్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 11 శాతం (ఆన్-ఇయర్) మరియు 13 శాతం (త్రైమాసికంలో) క్షీణించి క్యూ2 2020 తర్వాత కనిష్ట స్థాయి 40 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. చైనా లాక్‌డౌన్‌ల కారణంగా దెబ్బతిన్న షియోమి మరియు ఒప్పో సంస్థలు రెండు కూడా రెండంకెల నష్టాన్ని చవిచూశాయి. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం వారి సంబంధిత షిప్‌మెంట్‌లలో YoY క్షీణిస్తుంది. Q2లో రెండంకెల YoY షిప్‌మెంట్ వృద్ధితో realme తన యూరోపియన్ విస్తరణను కొనసాగించింది.

iPhone యూజ‌ర్లు అవాక్క‌య్యేలా iOS 16 బీటాలో స‌రికొత్త ఫీచ‌ర్‌!iPhone యూజ‌ర్లు అవాక్క‌య్యేలా iOS 16 బీటాలో స‌రికొత్త ఫీచ‌ర్‌!

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు

మైక్రోమ్యాక్స్, లావా, కార్బన్ వంటి ఇతర స్వదేశీ బ్రాండ్‌లకు చాలా అవసరమైన ప్రోత్సాహాన్ని అందించడానికి తక్కువ-స్థాయి స్మార్ట్‌ఫోన్‌లను (రూ.12,000 కంటే తక్కువ) విక్రయించకుండా చైనా ఆధారిత స్మార్ట్‌ఫోన్ ప్లేయర్‌లపై నియంత్రణలు విధించాలని భారత ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. సోమవారం వెలువడిన మూలాధారాలను వెల్లడించిన బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారులను రూ.12,000 ($150) కంటే తక్కువ ధరకు విక్రయించే అన్ని దేశీయ పరిశ్రమల ను ప్రారంభించేందుకు నియంత్రించాలని కోరుతోంది".

Best Mobiles in India

English summary
OnePlus and Oppo Brand Smartphone Sales Stopped in Germany

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X