గేమ్ ఆడండి, రూ.12 లక్షలు గెలవండి, మొబైల్ నుంచే..

|

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ గేమింగ్ ప్రియులకు అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. గేమ్ ఆడండి రూ. 12 లక్షల వరకు బహుమతులు అందుకోండి అంటూ ముందుకొసస్తోంది. వన్‌ప్లస్ అస్ఫాల్ట్‌ కప్ పేరిట నిర్వ‌హించ‌నున్న‌ ఆన్‌లైన్ రేసింగ్ చాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న వారికి రూ.9 లక్షల బంపర్ ప్రైజ్‌ను ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. మరి ఇందులో ఎలా పార్టిసిపేట్ చేయాలనే దానికిపై కొన్ని రకాల సూచనలను అందించింది. ఈ గేమ్‌లో పార్టిసిపేట్ చేయాలంటే యూజర్లు ఆండ్రాయిడ్ ఫోన్ కలిగి ఉండాలి. దాని నుంచే గేమ్ ఆడాల్సి ఉంటుంది.

 

షియోమి,థామ్సన్‌,టీసీఎల్‌లకు ట్రూవిజన్ షాక్,తక్కువ ధరకే 32 ఇంచ్ టీవీషియోమి,థామ్సన్‌,టీసీఎల్‌లకు ట్రూవిజన్ షాక్,తక్కువ ధరకే 32 ఇంచ్ టీవీ

స్టెప్ 1

స్టెప్ 1

తమ ఫోన్ (ఆండ్రాయిడ్, ఐఫోన్, విండోస్ మొబైల్)లో యాప్ స్టోర్‌లోకి వెళ్లి 'అస్ఫాల్ట్ 8: ఎయిర్‌బోర్న్' గేమ్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

స్టెప్ 2

స్టెప్ 2

అనంతరం గేమ్‌ను ఓపెన్ చేసి అందులో ఈవెంట్స్ ట్యాబ్‌లో ఉండే 'వన్‌ప్లస్ అస్ఫాల్ట్‌ కప్' ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేయాలి. ఆ ఈవెంట్‌లో ఆన్‌లైన్‌లో ఉండే ఇతర యూజర్లతో గేమ్‌లో పోటీ పడి గెలవాలి. ఈ క్రమంలో గేమ్‌లో గెలుపొందిన యూజర్లకు ప్రైజులను ఇస్తారు.

స్టెప్ 3

స్టెప్ 3

వన్ ప్లస్ నిర్వహించనున్న ఈ వన్‌ప్లస్ అస్ఫాల్ట్ కప్ ఈవెంట్ ఈ నెల 13వ తేదీ నుంచి జూలై 8వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ ఈవెంట్‌లో యూజర్లు ఎన్ని సార్లయినా పాల్గొనవచ్చు. అందుకు పరిమితి ఏమీ లేదు.

స్టెప్ 4
 

స్టెప్ 4

ఈవెంట్ చివర్లో లీడర్ బోర్డ్‌లో టాప్ ప్లేస్‌లో ఉండే ముగ్గురు విన్నర్లకు కలిపి మొత్తం రూ.9 లక్షల నగదు బహుమతి, వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్లు, హెడ్‌సెట్లను బహుమతులుగా అందజేస్తారు.

స్టెప్ 5

స్టెప్ 5

ఛాంపియ‌న్ షిప్‌లో మొద‌టి స్థానంలో నిలిచిన వారికి రూ.5 ల‌క్ష‌లు, ద్వితీయ‌, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి వ‌రుస‌గా రూ.3 ల‌క్ష‌లు, రూ.1ల‌క్ష అంద‌జేస్తారు.

స్టెప్ 6

స్టెప్ 6

అలాగే వారాంతాల్లో టాప్ 5 స్థానాల్లో నిలిచిన విన్నర్లకు వన్ ప్లస్ బుల్లెట్స్ వైర్‌లెస్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్‌ను, టాప్ 25 విన్నర్లకు ఇతర గిఫ్ట్‌లను అందిస్తారు. ఇక ఈ ఈవెంట్‌లో పాల్గొనేవారికి ప్రతివారం రూ.2 కోట్ల విలువైన ఇన్ గేమ్ రివార్డులను అందజేస్తారు.

వన్‌ప్లస్ నిర్వహిస్తున్న ఈ ఈవెంట్‌లో పాల్గొనేందుకు కనీస వయస్సు 13 సంవత్సరాలు ఉండాలి. asphaltcup.in వెబ్‌సైట్‌ను సందర్శించి ఈవెంట్‌లో పాల్గొనేందుకు ముందుగా ప్రీరిజిస్టర్ కూడా చేసుకోవచ్చు.

స్టెప్ 8

స్టెప్ 8

గేమ్‌లో ఎన్ని సార్లయినా పాల్గొని లీడర్ బోర్డులో టాప్ స్థానంలో నిలిచే అవకాశం కల్పించారు. అందువల్ల లీడర్ బోర్డులో టాప్ ప్లేస్ వ‌చ్చే వరకు గేమింగ్ ప్రియులు ఈ గేమ్‌ను లెక్క లేనన్ని సార్లు ఆడవచ్చు. ప్రైజ్‌లను గెలుచుకోవచ్చు.

Best Mobiles in India

English summary
OnePlus Asphalt Cup announced: Prize pool of over Rs. 12 lakh, OnePlus 6 and more News At Telugu Gizbot

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X