దుమ్మురేపిన వన్‌ప్లస్‌,ఇండియాలో టాప్ పొజిషన్ దానిదే

By Gizbot Bureau
|

ఇండియా మొబైల్‌ విపణిలో చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తుల సంస్థ వన్‌ప్లస్‌ అదరగొట్టింది. ప్రీమియం సెగ్మెంట్‌ మోడళ్లలో ఆపిల్‌, శాంసంగ్‌ను దాటేసి అత్యధిక షిప్‌మెంట్‌ (దిగుమతులు) షేర్‌ ఉన్న కంపెనీగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో దేశంలోకి దిగుమతి అయిన మొత్తం ప్రీమియం ఫోన్లలో 43 శాతం వన్‌ప్లస్‌వే అని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ తాజాగా వెల్లడించింది.

OnePlus Beats Apple, Samsung in Premium Smartphone Segment in India

ప్రీమియం సెగ్మెంట్ మోడళ్లలో ఆపిల్, శాంసంగ్‌‌కు ఉన్న షేర్లను పక్కన పెట్టి వన్‌ప్లస్ షేర్లు పైపైకి పోతున్నాయి. లాభాల బాటలో పయనిస్తున్నాయి.

 రెండో స్థానానికి శాంసంగ్‌

రెండో స్థానానికి శాంసంగ్‌

ఈ జాబితాలో 22శాతం షేర్‌తో దక్షిణకొరియా దిగ్గజ మొబైల్‌ సంస్థ శాంసంగ్‌ రెండో స్థానానికి పడిపోయింది. 18 శాతం షేర్‌తో ఆపిల్‌ మూడో స్థానంలో నిలిచింది. ఇక వన్‌ప్లస్‌ నుంచి వచ్చిన ఆల్ట్రా ప్రీమియం ఫోన్‌ వన్‌ప్లస్‌ 7 ప్రోకు భారత మార్కెట్లో విశేషాదరణ లభిస్తోంది. దిగుమతి అయిన మొత్తం వన్‌ప్లస్‌ ఫోన్లలో 26 శాతం 7ప్రో మోడల్‌ ఫోన్లే అని కౌంటర్‌పాయింట్‌ పేర్కొంది. ఇక శాంసంగ్‌లో ఎక్కువగా ఎస్‌10 ప్లస్‌ ఫోన్లు దిగుమతి అయినట్లు తెలిపింది. ఈసారి షియోమీ, ఒప్పొ, వివో, హువాయి కూడా ప్రీమియం సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టడంతో పోటీ విపరీతంగా ఉందని ఈ అధ్యయనం తెలిపింది.

హైదరాబాద్‌లో అతిపెద్ద​ఔట్‌లెట్‌

హైదరాబాద్‌లో అతిపెద్ద​ఔట్‌లెట్‌

ఇదిలా ఉంటే వన్‌ప్లస్‌ కంపెనీ అతిపెద్ద​ఔట్‌లెట్‌ను హైదరాబాద్‌లో నిర్మిస్తోంది. 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో హిమాయత్‌నగర్‌లో ఇది ఏర్పాటవుతోంది. కంపెనీకి ప్రపంచంలో ఇదే అతిపెద్ద, సొంత స్టోర్‌. ఈ ఏడాది చివరినాటికి నిర్మాణం పూర్తి కావొచ్చని సంస్థ భావిస్తోంది. వన్‌ప్లస్‌ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తారు. ఆరు అంతస్తుల్లో సిద్ధమవుతున్న ఈ కేంద్రంలో రెస్టారెంట్‌, ప్లే ఏరియా వంటివి అందుబాటులోకి వస్తాయని కంపెనీ జీఎం వికాస్‌ అగర్వాల్‌ వెల్లడించారు.

బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌తో భాగస్వామ్యం

బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌తో భాగస్వామ్యం

వన్‌ప్లస్‌ ఉత్పత్తుల విక్రయం కోసం ఎలక్ట్రానిక్స్‌ రిటైల్‌ చైన్‌ బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.‘ఇప్పటికే హైదరాబాద్‌ గచ్చిబౌలిలో వన్‌ప్లస్‌ ఆర్‌అండ్‌డీ సెంటర్‌ ఉంది. ప్రస్తుతం 150 మంది ఇక్కడ పనిచేస్తున్నారు. కొన్నేళ్లలో ఈ సంఖ్య వేలకు చేరుకుంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఆర్‌అండ్‌డీ పరంగా సంస్థకు ఇదే అతిపెద్ద కేంద్రంగా నిలుస్తుంది. దీంతో పాటు వన్‌ప్లస్‌ టీవీ అభివృద్ధి దశలో ఉంది. కొద్ది రోజుల్లో విడుదల అయ్యే అవకాశం ఉంది.

వ‌న్‌ప్ల‌స్ 7 ప్రొ 5జీ వేరియెంట్‌

వ‌న్‌ప్ల‌స్ 7 ప్రొ 5జీ వేరియెంట్‌

కాగా వ‌న్‌ప్ల‌స్ త‌న నూత‌న వ‌న్‌ప్ల‌స్ ఫోన్లు.. వ‌న్ ప్ల‌స్ 7, 7ప్రొల‌ను ఈ మధ్య విడుద‌ల చేసిన విష‌యం విదితమే. కాగా ఈ ఫోన్ల‌తోపాటు వ‌న్‌ప్ల‌స్ 7 ప్రొ 5జీ వేరియెంట్‌ను కూడా వ‌న్‌ప్ల‌స్ లాంచ్ చేసింది. అయితే ఈ వేరియెంట్ కేవ‌లం యూకే, ఫిన్‌లాండ్‌లోని ఎలిసాల‌లో మాత్ర‌మే ల‌భ్యం కానుంది. ఇక ఈ ఫోన్లో వ‌న్‌ప్ల‌స్ 7 లోని ఫీచ‌ర్ల‌నే ఏర్పాటు చేశారు. కాక‌పోతే 5జీ కోసం ప్ర‌త్యేకంగా క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ ఎక్స్‌50 5జీ మోడెమ్‌ను ఏర్పాటు చేశారు. దీన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లో విడుద‌ల చేసే ఆలోచ‌న‌పై వ‌న్‌ప్ల‌స్ ఎలాంటి స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు..!

 వ‌న్‌ప్ల‌స్ 7 ఫీచర్లు

వ‌న్‌ప్ల‌స్ 7 ఫీచర్లు

వ‌న్‌ప్ల‌స్ 7 సిరీస్ ఫోన్ల‌లో 6.7 ఇంచ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 6/8/12 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్‌, 48, 8 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, వార్ప్ చార్జ్ తదిత‌ర ఫీచ‌ర్ల‌ను ఏర్పాటు చేసింది.

Best Mobiles in India

English summary
OnePlus Beats Apple, Samsung in Premium Smartphone Segment in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X