OnePlus ఇండియాలో తన కొత్త లాంచ్ ఈవెంట్ లో ఏమి ప్రకటించనున్నది!!
వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో మార్చి 31, 2022న వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసింది. అయితే వన్‌ప్లస్ తన యొక్క కొత్త లాంచ్ తర్వాత చాలా తక్కువ వ్యవధిలోనే మరొక లాంచ్ కోసం సిద్ధమవుతున్నది. వన్‌ప్లస్ కంపెనీ ఏప్రిల్ 28, 2022న తన కొత్త లాంచ్ ఈవెంట్‌ను ప్రకటించింది. ఇప్పటికే సంస్థ టీజర్‌ను కూడా విడుదల చేసింది. వన్‌ప్లస్ సంస్థ విడుదల చేసిన పోస్టర్ ను పరిశీలిస్తే కనుక ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ (TWS) మరియు కొత్త స్మార్ట్‌ఫోన్ యొక్క బ్యాక్ ప్యానల్ నిర్మాణం కనిపిస్తుంది. అంటే దీని యొక్క అర్థం వన్‌ప్లస్ సంస్థ మరోక సరసమైన నార్డ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను ఏప్రిల్ 28, 2022న లాంచ్ చేయబోతున్నట్లు ఉంది. కాకపోతే దీని గురించి సరైన సమాచారం విడుదల కావలసి ఉంది. కానీ టీజర్ ఇమేజ్‌లోని TWS ఇయర్‌ఫోన్‌లు ఇండియాలో మార్కెట్ లోకి వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి ఆడియో గాడ్జెట్ విభాగంలో విడుదల కానున్నట్లు గట్టిగా భావించవచ్చు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

OnePlus సరికొత్త లాంచ్ ఈవెంట్
వన్‌ప్లస్ బ్రాండ్ ఇండియాలో ఏప్రిల్ 28న నిర్వహిస్తున్న ఈవెంట్ లో 120W లేదా 150W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టివ్ స్మార్ట్‌ఫోన్‌ని మనం చూడవచ్చా? రాబోయే ఈవెంట్‌లో వన్‌ప్లస్ 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో దేనినైనా ఆవిష్కరించవచ్చు అని కొన్ని నివేదికలు బలంగా నమ్ముతున్నాయి. భారతదేశంలో వన్‌ప్లస్ సంస్థ కొత్తగా వన్‌ప్లస్ Ace స్మార్ట్‌ఫోన్‌ను ప్రారంభించాలని యోచిస్తోందని పుకార్లు కూడా ఉన్నాయి. ఇది OnePlus 10R రీబ్రాండెడ్ కావచ్చు.

వన్‌ప్లస్ సంస్థ 2022 సంవత్సరంలో బహుళ ఉత్పత్తులను లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు. ఈ క్యాలెండర్ సంవత్సరం భారతీయ మరియు ప్రపంచ మార్కెట్‌లలో అధికంగా ఉత్పత్తులను ప్రారంభించిన సంస్థగా వన్‌ప్లస్ సరికొత్త రికార్డును సృష్టించవచ్చు. వన్‌ప్లస్ సంస్థ యొక్క కొత్త ఈవెంట్ గురించి మరియు అందులో ఏ ఉత్పత్తులను ప్రారంభించనున్నదో వంటి వివరాలను కంపెనీ వెల్లడించలేదు. కానీ లాంచ్ ఈవెంట్ కి ఎక్కువ సమయం లేదు కాబట్టి ఈవెంట్ సమయంలో ప్రారంభించబడే ఉత్పత్తులకు మరిన్ని లీక్‌లు రావచ్చు.

వన్‌ప్లస్ బ్రాండ్ ఏప్రిల్ 28, 2022న లాంచ్ చేయనున్న సరికొత్త ఈవెంట్ ను 'మోర్ పవర్ టు యు' అనే థీమ్ తో సంస్థ ప్రకటించింది. ఈ ఈవెంట్ "వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీ, డిజైన్ మరియు ఇన్నోవేషన్‌తో కమ్యూనిటీని మరింత శక్తివంతం చేయడంలో బ్రాండ్ యొక్క నిబద్ధతను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది" అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.


Click it and Unblock the Notifications