OnePlus రిపబ్లిక్ డే సేల్ ఆఫర్‌లు: వన్‌ప్లస్ 8T, నార్డ్ & టీవీలను కొనడానికి సరైన సమయం...

|

ఇండియాలో ఉత్తమ వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్‌గా వన్‌ప్లస్ తరచూ పరిగణించబడుతుంది. ఈ బ్రాండ్ యొక్క పోర్ట్‌ఫోలియోలోని విభిన్న ఉత్పత్తులు మరియు ఫ్లాగ్‌షిప్-కిల్లర్ స్మార్ట్‌ఫోన్‌లు మరియు ఆడియో ఉత్పత్తులలో కూడా తమ సంపూర్ణ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. ఈ సంస్థ తన వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఎల్లప్పుడూ అద్భుతమైన గొప్ప మార్గాలను వెతుకుతూ ఉంటుంది. అయితే ఈసారి వన్‌ప్లస్ రిపబ్లిక్ డే ఆఫర్లను ప్రకటించింది.

ప్రముఖ గ్లోబల్ ప్రీమియం టెక్నాలజీ వన్‌ప్లస్ తన భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకమైన రిపబ్లిక్ డే ఆఫర్లను తీసుకువచ్చింది. ఇందులో స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ డివైస్లు, టీవీలు వంటి మరిన్నింటిని అద్భుతమైన డిస్కౌంట్‌ ఆఫర్‌లతో ఈ రోజు నుండి పొందవచ్చు. ఈ ఆఫర్‌లు జనవరి 26 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ ఉత్తేజకరమైన ఆఫర్ల గురించే మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

OnePlus 8T 5G

OnePlus రిపబ్లిక్ డే సేల్:వన్‌ప్లస్8T,టీవీల కొనుగోలుకు సరైన సమయం...

 

వన్‌ప్లస్ సంస్థ యొక్క తాజా సమర్పణలో ఒకటైన వన్‌ప్లస్ 8T 5G మిగిలిన వారికి బిన్నంగా కొన్ని అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీలతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 120Hz ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉండడమే కాకుండా క్వాల్‌కామ్ యొక్క స్నాప్‌డ్రాగన్ 865 SoC ద్వారా రన్ అవుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మరియు అగ్రశ్రేణి కెమెరా సామర్థ్యాలు వంటి గొప్ప ఫీచర్లను కలిగి ఉన్న వన్‌ప్లస్ 8T 5G యొక్క ధర రూ.42,999 నుండి ప్రారంభం అవుతుంది.

ఆక్వామారిన్ గ్రీన్ మరియు లూనార్ సిల్వర్ అనే రెండు కలర్ లలో లభించే వన్‌ప్లస్ 8T 5G ఫోన్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో అద్భుతమైన ఆఫర్లు లభిస్తున్నాయి. ఈ సేల్ సందర్భంగా అమెజాన్.ఇన్లో జనవరి 19 నుండి జనవరి 23 మధ్య కాలంలో రూ.38,999 తగ్గింపు ధర వద్ద పొందవచ్చు. ఈ డిస్కౌంట్‌లలో రూ.2,500 అమెజాన్ కూపన్లు, రూ.1,500 SBI క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని మొత్తంగా రూ.4,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

పైన తెలిపిన డిస్కౌంట్ ఆఫర్లే కాకుండా ఇంకా చాలానే ఉన్నాయి. Oneplus.in మరియు OnePlus Store App లలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డులను ఉపయోగించే వినియోగదారులు 10% వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. వీటితో పాటుగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డుల వినియోగదారులు ఈజీఇఎంఐ లావాదేవీల కొనుగోలుపై రూ.2,000 వరకు అదనపు తగ్గింపును పొందవచ్చు.

OnePlus TVs

OnePlus రిపబ్లిక్ డే సేల్:వన్‌ప్లస్8T,టీవీల కొనుగోలుకు సరైన సమయం...

 

కొత్త కొత్త ఉత్పత్తుల డిజైన్ మరియు 'నెవర్ సెటిల్' కు స్ఫూర్తినిచ్చే ధోరణిని కొనసాగిస్తూ వన్‌ప్లస్ టీవీ Y మరియు వన్‌ప్లస్ టీవీ Q1 లు అపూర్వమైన సినిమా అనుభవాన్ని అందిస్తున్నాయి. ఈ రెండు టీవీ సిరీస్‌లు అద్భుతమైన పనితీరును అందించడానికి ఎటువంటి అతుకులు లేని సాఫ్ట్‌వేర్‌తో జత చేసిన డాల్బీ ఆడియోను అందిస్తున్నాయి. వన్‌ప్లస్ టీవీ Y సిరీస్ టీవీలు రూ.14,999 అత్యంత సరసమైన ధర ట్యాగ్‌లలో లభిస్తుంది.

వన్‌ప్లస్ టీవీ Q1 సిరీస్‌లో డాల్బీ విజన్‌ టెక్నాలజీతో జత చేసిన 55-అంగుళాల 4K క్యూఎల్‌ఇడి డిస్‌ప్లే మరియు డాల్బీ అట్మోస్‌తో 50W 8-స్పీకర్ సెటప్ అమర్చబడి మరియు డైనమిక్ పిక్చర్ నాణ్యతను అధివాస్తవిక సరౌండ్ సౌండ్ అనుభవంతో విలీనం చేస్తుంది.

వన్‌ప్లైస్ టీవీ Q1 సిరీస్ యొక్క ధర రూ.62,900. వన్‌ప్లస్ రిపబ్లిక్ డే అమ్మకంలో ఈ రెండు సిరీస్‌ టీవీల మీద అద్భుతమైన తగ్గింపును పొందవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ యొక్క ఇఎంఐ మరియు లావాదేవీలతో వన్‌ప్లస్ టీవీ Q సిరీస్‌ మీద రూ.4,000 వరకు తక్షణ తగ్గింపు మరియు వన్‌ప్లస్ టీవీ Y సిరీస్‌కు రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. ఇందులో వన్‌ప్లస్ టీవీ Y సిరీస్ యొక్క 43-అంగుళాల మోడల్ మీద రూ.1,000 డిస్కౌంట్ కాగా, వన్‌ప్లస్ Y సిరీస్ యొక్క 32 అంగుళాల మోడల్‌ను రూ.5,000 తగ్గింపుతో పొందవచ్చు.

OnePlus Nord

OnePlus రిపబ్లిక్ డే సేల్:వన్‌ప్లస్8T,టీవీల కొనుగోలుకు సరైన సమయం...

వన్‌ప్లస్ నార్డ్ ప్రారంభంతో స్మార్ట్‌ఫోన్ యొక్క పరిశ్రమలో తుఫాను మొదలైంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫీచర్లను సరసమైన ధర వద్ద ప్యాక్ చేయడం వన్‌ప్లస్ సంస్థకు మాత్రమే సాధ్యం అయింది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 765G 5G ప్రాసెసర్‌తో నడిచే ఈ స్మార్ట్‌ఫోన్‌లో N90 Hz ఫ్లూయిడ్ అమోలేడ్ డిస్‌ప్లే మరియు అద్బుతమైన కెమెరా సెటప్ ను కలిగి ఉన్నాయి. ఈ వన్‌ప్లస్ నార్డ్ బ్లూ మార్బుల్, గ్రే యాష్ మరియు గ్రే ఒనిక్స్ అనే మూడు కలర్ ఎంపికలలో లభిస్తుంది.

వన్‌ప్లస్ నార్డ్ యొక్క 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్, 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడళ్ల ప్రస్తుత ధరలు వరుసగా రూ.27,999 మరియు రూ. 29,999. వన్‌ప్లస్ రిపబ్లిక్ డే అమ్మకంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డు వినియోగదారులు EMI కొనుగోళ్ల ద్వారా రూ.1,000 తగ్గింపు పొందవచ్చు. అలాగే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ కార్డు వినియోగదారులకు 6 నెలల వరకు నో-కాస్ట్ EMI తో పాటుగా రూ.500 వరకు తగ్గింపు లభిస్తుంది.

వన్‌ప్లస్ ఉపకరణాలపై తగ్గింపు ఆఫర్లు

OnePlus రిపబ్లిక్ డే సేల్:వన్‌ప్లస్8T,టీవీల కొనుగోలుకు సరైన సమయం...

రిపబ్లిక్ డే ఆఫర్లలో వన్‌ప్లస్ పవర్‌బ్యాంక్ వంటి డివైస్లు కూడా ఉన్నాయి. వీటిని రూ.999 ధర వద్ద oneplus.in మరియు OnePlus Store App ద్వారా కూడా పొందవచ్చు. అలాగే వన్‌ప్లస్ బుల్లెట్ వైర్‌లెస్ Z-సిరీస్ ను కూడా ఇదే ప్లాట్‌ఫామ్ ద్వారా రూ.1,899 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా వన్‌ప్లస్ బడ్స్‌ను రూ.4,699 ధర వద్ద, వన్‌ప్లస్ బడ్స్ Z ను రూ. 2,799 ధర వద్ద అమ్మకం సమయంలో కొనుగోలు చేయవచ్చు.

అదనంగా వన్‌ప్లస్ బులెట్లు వైర్‌లెస్ Z బాస్ ఎడిషన్, వన్‌ప్లస్ బడ్స్ మరియు వన్‌ప్లస్ బడ్స్ Z యొక్క కొనుగోలు మీద ఇప్పుడు అమెజాన్.ఇన్, ఫ్లిప్‌కార్ట్.కామ్, వన్‌ప్లస్ ఎక్స్‌క్లూజివ్ ఆఫ్‌లైన్ స్టోర్స్ మరియు భాగస్వామి రిటైల్ అవుట్‌లెట్లలో 5% ఆఫ్ వద్ద లభిస్తాయి.

రెడ్ కేబుల్ క్లబ్ ప్రయోజనాలు

OnePlus రిపబ్లిక్ డే సేల్:వన్‌ప్లస్8T,టీవీల కొనుగోలుకు సరైన సమయం...

వన్‌ప్లస్ అభిమానులు వన్‌ప్లస్ స్టోర్ యాప్ లేదా వన్‌ప్లస్.ఇన్‌లో సైన్ అప్ చేయడం ద్వారా వన్‌ప్లస్ రెడ్ కేబుల్ క్లబ్ సభ్యత్వానికి రూ.100 వరకు తగ్గింపును పొందవచ్చు. అంతే కాదు రెడ్ కేబుల్ ప్రివ్, రెడ్ కేబుల్ క్లబ్ సభ్యులు వన్‌ప్లస్ 8, 8 ప్రో, మరియు వన్‌ప్లస్ 8T5G మోడళ్ల కొనుగోలు మీద వన్‌ప్లస్ పవర్‌బ్యాంక్ కోసం ఉచిత వోచర్‌ను కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ జనవరి 31 వరకు చెల్లుబాటులో ఉంటుంది.

వన్‌ప్లస్ 3 నుండి వన్‌ప్లస్ 6Tని ఉపయోగించే వినియోగదారులకు బ్యాటరీ రీప్లేస్మెంట్ కోరుకునే వినియోగదారులు 50 శాతం తగ్గింపును అందించే వోచర్‌ను పొందవచ్చు. ఇది డిసెంబర్ 31, 2021 వరకు చెల్లుబాటులో ఉంటుంది. చివరగా రెడ్ కేబుల్ క్లబ్ సభ్యులు ప్రత్యేకమైన వన్‌ప్లస్ అర్బన్ ట్రావెలర్ బ్యాక్‌ప్యాక్‌ను పొందవచ్చు. ఈ రెడ్ కేబుల్ ప్రైవ్ నుండి ఆహ్వాన కోడ్‌ను క్లెయిమ్ చేసి, వన్‌ప్లస్.ఇన్ లేదా వన్‌ప్లస్ స్టోర్ యాప్ నుండి కొనుగోలు చేయవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
OnePlus Brings Republic Day Offers: Best Time To Buy OnePlus 8T, OnePlus Nord & OnePlus TVs
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X