వన్‌ప్లస్ ‘5టీ’ ధర ఎంతంటే..?

|

వన్‌ప్లస్ 5టీ లాంచ్‌కు సమయం సమీపిస్తోంది. నవంబర్ 16న న్యూయార్క్‌లో నిర్వహించే ప్రత్యేక ఈవెంట్‌లో భాగంగా ఈ ఫ్లాగ్‌షిప్ డివైస్‌ను వన్‌ప్లస్ ప్రపంచానికి పరిచయం చేయబోతోంది. ఈ క్రమంలో తన లేటెస్ట్ ఫోన్‌కు సంబంధించిన ఒక్కో హింటును వన్‌ప్లస్ రివీల్ చేస్తూ వస్తోంది.

 
వన్‌ప్లస్ ‘5టీ’ ధర ఎంతంటే..?

తాజాగా వన్‌ప్లస్ 5టీకి సంబంధించిన ప్రైస్ పాయింట్‌ను కంపెనీ సీఈఓ Pete Lau రివీల్ చేసారు. ఓ Weibo యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ ఫోన్ ధర 4,000 Yuan (రూ.39,000)లోపు ఉండొచ్చని ఆయన సమాధానమిచ్చారు. ఈ ధరను బట్టి చూస్తుంటే వన్‌ప్లస్ 5తో పోలిస్తే 5టీ మోడల్ ధర రూ.5,000 ఎక్కువుగా ఉండొచ్చని తెలుస్తోంది.

ప్రముఖ బెంచ్ మార్కింగ్ యాప్ AnTuTu, వన్‌ప్లస్ 5టీకి సంబంధించిన లిస్టింగ్స్‌ను ఇప్పటికే రివీల్ చేయటం జరిగింది. ఈ యాప్ వెల్లడించిన వివరాల ప్రకారం వన్‌ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్ 20 మెగా పిక్సల్ + 20 మెగా పిక్సల్ కెమెరాతో పాటు సరికొత్త 18:9 స్ర్కీన్‌తో రాబోతోంది.

22 ఏళ్ల సామ్రాజ్యం నేలమట్టం, దడ పుట్టిస్తున్న షియోమి, అంతా సెకండ్ల వ్యవధిలోనే...22 ఏళ్ల సామ్రాజ్యం నేలమట్టం, దడ పుట్టిస్తున్న షియోమి, అంతా సెకండ్ల వ్యవధిలోనే...

ఆండ్రాయిడ్ 8.0 Oreo సాఫ్ట్‌వేర్ పై రన్ అయ్యే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8జీబి ర్యామ్‌తో పాటు 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యం ఉంటుందని AnTuTu లిస్టింగ్ పేర్కొంది. ఇదిలా ఉండగా, చైనా చెందిన ప్రముఖ ఈ-కామర్స్ సైట్ oppomart వన్‌ప్లస్ 5టీకి సంబంధించిన ప్రీ-ఆర్డర్స్‌ను ఇప్పటికే స్వీకరిస్తోంది. 64జీబి స్టోరేజ్ వేరియంట్ ధర $549 (ఇండియన్ కరెన్సీలో ఈ విలువ రూ.35,775), 128జీబి స్టోరేజ్ వేరియంట్ ధర $649 (ఇండియన్ కరెన్సీలో ఈ విలువ రూ.42,292)

భారత్‌లో ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రీ-ఆర్డర్ పేజీని SlashLeaks అనే టెక్నాలజీ డిస్కషన్ ప్లాట్‌ఫామ్ కొద్ది రోజుల క్రితం లీక్ చేసింది. ఈ ఇమేజ్‌లో సూచించబడుతోన్న సమాచారం ప్రకారం OnePlus 5T నవంబర్ 16న మార్కెట్లో లాంచ్ కాబోతోంది. Amazon ఇండియాలో మాత్రమే ఈ ఫోన్ ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యంకానుందట. సేల్ కూడా నవంబర్‌లోనే ప్రారంభమవుతుందని ఈ పేజ్ సజెస్ట్ చేస్తోంది.

Best Mobiles in India

English summary
OnePlus 5T will be launched in the coming days at an event in New York City.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X