Home
News

OnePlus కమ్యూనిటీ సేల్ మొదలైంది! ఫోన్లు, టీవీలు, గాడ్జెట్ల పై భారీ ఆఫర్లు

By Maheswara

వన్ ప్లస్ కమ్యూనిటీ సేల్ భారతదేశంలో జూన్ 4 నుంచి మొదలైంది. ఈ సేల్ లో OnePlus 11 5G, Nord CE 3 Lite 5G, Nord Buds 2 మరియు మరిన్ని వన్ ప్లస్ గాడ్జెట్ల పై గొప్ప డీల్‌లు మరియు ఆఫర్‌లతో ఈ సేల్ జరగనుంది. అదనంగా, వన్ ప్లస్ టీవీ లపై లాభదాయకమైన డీల్‌లు కూడా ఈ సేల్ సమయం లో అందుబాటులో ఉంటాయి.

ఈ వన్ ప్లస్ కమ్యూనిటీ సేల్ భారతదేశంలో జూన్ 4 నుంచి జూన్ 11 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ సమయంలో మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న గాడ్జెట్ల పై ఆఫర్లను తెలుసుకోవడానికి ఈ సేల్ లో ని బెస్ట్ ఆఫర్లను మీకోసం ఇక్కడ అందిస్తున్నాము.

OnePlus Community Sale 2023 LIve Now, Huge Discount Offers On OnePlus 11 5G And Other OnePlus Gadgets.

OnePlus Ensemble బండిల్ ఆఫర్
ఈ OnePlus Ensemble బండిల్ మూడు ఉత్పత్తులను కలిగి ఉంటుంది: అవి OnePlus 11 5G (16 GB RAM + 256 GB), OnePlus Pad (12 GB RAM + 256 GB) మరియు OnePlus బడ్స్ ప్రో 2. ఈ బండిల్ ప్యాక్ రూ. 115,997 నుండి ప్రారంభమవుతుంది. దీనిపై మీరు ఖర్చును తగ్గించుకోవడానికి ICICI బ్యాంక్ మరియు OneCard ద్వారా రూ. 4,000 వరకు తక్షణ బ్యాంక్ తగ్గింపు ఆఫర్ ను పొందవచ్చు.

OnePlus 11 5G పై ఆఫర్
కొనుగోలుదారులు OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ ని రూ. 56,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఇంకా, బ్యాంక్ క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, నో కాస్ట్ EMI ఎంపికలు ఈ డీల్‌ను సులభతరం చేయడంలో సహాయపడతాయి. అంతేకాకుండా, మీరు ఇతర OnePlus ఆడియో ఉత్పత్తులను తగిన డీల్‌గా చేయడానికి తగ్గింపు ధరలకు జోడించి బండిల్ చేయవచ్చు.

OnePlus Nord CE 3 Lite 5G ఫోన్ పై ఆఫర్
Nord CE 3 Lite స్మార్ట్ ఫోన్ యొక్క బేస్ మోడల్ రూ.19,999 కి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ కొనుగోలు పై MobiKwik Wallet ద్వారా రూ. 2,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు.

OnePlus 11R 5G ఫోన్ పై ఆఫర్
ఈ OnePlus 11R 5G ఫోన్ ధర రూ. 39,999 వద్ద అందుబాటులో ఉన్నప్పటికీ, మీరు బ్యాంక్ మరియు ఆన్‌లైన్ డిస్కౌంట్ల ద్వారా ధరను తగ్గించుకోవచ్చు. అదనంగా, మీరు నో కాస్ట్ EMIని కూడా పొందవచ్చు.

ఇంకా, ఇతర వన్ ప్లస్ పరికరాలపై ఆఫర్లను గమనిస్తే, మీరు ఎంపిక చేసిన పరికరాలపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా వన్ ప్లస్ 10 ప్రో 5G మరియు వన్ ప్లస్ 10T 5G ఫోన్ల పై రూ. 10,000 వరకు తగ్గింపు ఆఫర్ పొందవచ్చు. వన్ ప్లస్ 10R 5G ఎంపిక చేసిన పరికరాలపై రూ. 3,000 వరకు ఎక్స్ఛేంజ్ తగ్గింపు ఆఫర్ కలిగి ఉంది.

OnePlus TV Y సిరీస్ టీవీ పై ఆఫర్ (41 శాతం వరకు తగ్గింపు)
వన్ ప్లస్ సంస్థ యొక్కY సిరీస్ టెలివిజన్ యొక్క 32-అంగుళాల మోడల్ రూ. 13,999కి అందుబాటులో ఉంది. కొనుగోలుదారు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్, EMIలు మరియు నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ. 1500 వరకు తక్షణ తగ్గింపును పొందవచ్చు.

OnePlus TV Q సిరీస్ పై ఆఫర్ వివరాలు
ICICI బ్యాంక్ ఆఫర్‌లను పొందిన తర్వాత 65-అంగుళాల OnePlus TV Q2 ప్రోని రూ. 94,999 తగ్గింపు ధరతో పొందవచ్చు.

OnePlus నోర్డ్ బడ్స్ 2 ఆఫర్ వివరాలు
తాజాగ విడుదలైన OnePlus నోర్డ్ బడ్స్ 2 ధర ఈ సేల్ లో రూ.2,999 గా ఉంది. ఇది రెండు రంగు ఎంపికలలో వస్తుంది. అవి, థండర్ గ్రే మరియు లైట్నింగ్ వైట్ రంగులలో ఉంటుంది.

Best Mobiles in India

English summary
OnePlus Community Sale 2023 LIve Now, Huge Discount Offers On OnePlus 11 5G And Other OnePlus Gadgets.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X