భారతదేశంలో బారీగా పెరిగిన వన్‌ప్లస్ బ్రాండ్ మార్కెట్!!

|

వన్‌ప్లస్ బ్రాండ్ యొక్క అభివృద్ధి కోసం దోహదపడే అత్యంత ముఖ్యమైన మార్కెట్లలో ఇండియా ఒకటి. ఈ కంపెనీ యూరోప్ మరియు భారతదేశంలో అతి పెద్ద మార్కెట్ ని కలిగి ఉంది. వన్‌ప్లస్ బ్రాండ్ యొక్క సరికొత్త ఆఫర్లతో సౌత్ ఈస్ట్ ఆసియాలో కూడా మరింత వేగంగా విస్తరించాలని చూస్తోంది. కేవలం భారతీయ మార్కెట్‌లోనే వన్‌ప్లస్ బ్రాండ్ షిప్‌మెంట్‌లు 2022 (H1 2022) మొదటి అర్ధభాగంలో 46% పెరిగాయని సూచించింది. ఈ విషయాన్ని వన్‌ప్లస్10T లాంచ్ ఈవెంట్ సందర్భంగా వన్‌ప్లస్ సంస్థ తెలిపింది. వన్‌ప్లస్ కంపెనీ తన యొక్క అనేక రకాల ఉత్పత్తులతో తన పనితీరును మరింత వేగంగా పెంచుకుంటున్నది. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న వన్‌ప్లస్ బ్రాండ్ డివైస్లు

ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న వన్‌ప్లస్ బ్రాండ్ డివైస్లు

వన్‌ప్లస్ సంస్థ యొక్క వన్‌ప్లస్ నార్డ్ CE 2 5G ఫోన్ 2022 సంవత్సరం ప్రథమార్ధంలో అత్యధికంగా అమ్ముడైన 5G స్మార్ట్‌ఫోన్ లలో రెండవ స్థానం కలిగి ఉన్నట్లు సంస్థ తెలిపింది. అలాగే ప్రీమియం & అల్ట్రా-ప్రీమియం విభాగాలలో కూడా వన్‌ప్లస్ బ్రాండ్ యొక్క ఫోన్లు మొదటి మూడు స్థానాలలో ఉంది. అల్ట్రా-ప్రీమియం విభాగంలో వన్‌ప్లస్ 10 ప్రో 5G అధికంగా విక్రయించబడింది. 2022 జనవరి నుండి మే 2022 మధ్యకాలంలో దేశంలో అధికంగా అమ్ముడైన టాప్ 5 స్మార్ట్ టీవీ బ్రాండ్‌లలో వన్‌ప్లస్ కూడా ఉంది. అలాగే వన్‌ప్లస్ వాచ్ కూడా 2022 మొదటి ఐదు నెలల్లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌వాచ్ కావడం మరొక విశేషం. 2022 జనవరి - మే 2022 మధ్య కాలంలో TWS ఇయర్ బడ్స్ మిడ్ మరియు ప్రీమియం విభాగాలలో అధికంగా అమ్ముడయ్యాయి.

వన్‌ప్లస్ 10T 5G

వన్‌ప్లస్ సంస్థ భారతీయ మార్కెట్లో ఇటీవల కొత్తగా వన్‌ప్లస్ 10T 5G ఫ్లాగ్‌షిప్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది వన్‌ప్లస్ 10 ప్రో మోడల్ యొక్క అప్‌గ్రేడ్ వెర్షన్ అని భావిస్తే పొరపాటే. 2022లో కంపెనీ నుండి విడుదలైన అత్యధిక సిరీస్ డివైస్ గా ప్రో మోడల్ మిగిలిపోతుంది. నిన్న జరిగిన వన్‌ప్లస్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా వన్‌ప్లస్ సంస్థ కొత్తగా OxygenOS 13ని కూడా ప్రకటించింది.

వన్‌ప్లస్ నార్డ్ CE 2 5G

వన్‌ప్లస్ నార్డ్ CE 2 5Gని ఇండియాలో విక్రయించే అమలు వ్యూహంతో వన్‌ప్లస్ సంస్థ చాలా సంతోషంగా ఉంది. దాదాపు ప్రతి ధర విభాగంలో వన్‌ప్లస్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించడానికి వినియోగదారుల నుండి కంపెనీ తగినంత నమ్మకాన్ని పొందగలిగింది. వన్‌ప్లస్ సంస్థ సమీప భవిష్యత్తులో కొత్తగా వన్‌ప్లస్ ప్యాడ్‌తో దాని ఉత్పత్తి శ్రేణిని విస్తరించాలని భావిస్తున్నారు.

మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ధ‌ర‌లు, ఫీచ‌ర్లు చూడండి!మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ధ‌ర‌లు, ఫీచ‌ర్లు చూడండి!

వన్‌ప్లస్ నార్డ్ N20 SE లాంచ్

వన్‌ప్లస్ నార్డ్ N20 SE లాంచ్

వన్‌ప్లస్ నార్డ్ N20 SE స్మార్ట్‌ఫోన్‌ ని ఇప్పుడు చైనాలో ప్రారంభించింది. వన్‌ప్లస్ బ్రాండ్ నుండి వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12-ఆధారిత OxygenOS 12.1 పై రన్ అవుతుంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, డ్యూయల్ స్పీకర్లు, 6.56-అంగుళాల డిస్‌ప్లే మరియు 33W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి లభించే హ్యాండ్‌సెట్ $199 (దాదాపు రూ.15,800) ధర వద్ద బ్లూ ఒయాసిస్ మరియు సెలెస్టియల్ బ్లాక్ కలర్ లలో లాంచ్ అయింది. ఆప్టిక్స్ విషయంలో ఇది 50-మెగాపిక్సెల్ AI కెమెరా మరియు 2-మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ స్పీకర్‌లను మరియు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఇది 33W SuperVooc ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 30 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీని ఛార్జ్ చేయగలదని కంపెనీ పేర్కొంది.

వన్‌ప్లస్ 10T 5G ఇండియా ధరలు

వన్‌ప్లస్ 10T 5G ఇండియా ధరలు

వన్‌ప్లస్ 10T 5G స్మార్ట్‌ఫోన్‌ ఇండియాలో మూడు వేరియంట్ లలో లాంచ్ అయింది. ఇందులో 8GB RAM + 128GB స్టోరేజీ వేరియంట్ ధ‌ర రూ.49,999 కాగా 12GB RAM + 256GB స్టోరేజీ వేరియంట్ ధ‌ర రూ.54,999, చివరిగా 16GB RAM + 256GB స్టోరేజీ వేరియంట్ ధ‌ర రూ.55,999. ఈ మొబైల్స్ జేడ్ గ్రీన్‌, మూన్ స్టోన్ బ్లాక్ క‌ల‌ర్ల‌లో అందుబాటులో ఉంది.

వన్‌ప్లస్ 10T 5G స్పెసిఫికేషన్స్

వన్‌ప్లస్ 10T 5G స్పెసిఫికేషన్స్

వన్‌ప్లస్ 10T 5G స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 6.7 అంగుళాల ఫుల్-HD+ AMOLED డిస్‌ప్లే పానెల్‌ను 120Hz రిఫ్రెష్ రేటుతో అందిస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా ప‌నిచేస్తు స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC ప్రాసెస‌ర్‌తో రన్ అవుతూ 8GB, 12GB, 16GB of LPDDR5 RAM |128GB, 256GB of UFS 3.1 ఇంట‌ర్న‌ల్ స్టోరేజీతో జతచేయబడి లభిస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ క్వాలిటీలో Sony IMX766 సెన్సార్‌ ప్రైమ‌రీ విభాగంలో ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉంది. వేగ‌వంత‌మైన‌ ఫొటో క్యాప్చ‌ర్ కోసం వ‌న‌ప్ల‌స్ న్యూ ఇమేజ్ క్లారిటీ ఇంజిన్ (ఐసీఈ) స‌పోర్ట్ తో ఇస్తున్నారు. మెరుగైన HDR పనితీరు కోసం ఈ స్మార్ట్‌ఫోన్ OnePlus యొక్క HDR 5.0 మరియు TurboRAW అల్గారిథమ్‌లను ఉపయోగించింది.

Best Mobiles in India

English summary
OnePlus Company Brand India Shipments Grew 46% in 2022 First Half: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X