వన్‌ప్లస్ యూజర్లకు క్రెడిట్ కార్డు దెబ్బ

Written By:

వన్‌ప్లస్ యూజర్లు వన్‌ప్లస్ వెబ్‌సైట్లో ఆ కంపెనీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారా..అయితే కాసింత జాగ్రత్తగా ఉండాలి.లేకుంటే మీ కార్డులు హ్యాకింగ్ కు గురయ్యే ప్రమాదముందని తెలుస్తోంది. ఇలా ఎందుకు జరిగిందో ఇన్విస్టిగేట్ చేస్తున్నామని కంపెనీ తన బ్లాగ్ పోస్టులో పేర్కోంది. ఈ మధ్య క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా వన్‌‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసిన వినియోగదారులు హ్యాకింగ్‌ బారిన పడ్డారు. గత నాలుగు నెలల కాలంలో ఇలాంటి పలు అక్రమ లావాదేవీలు నమోదు అయ్యాయి. దీంతో వన్‌ప్లస్‌ కస్టమర్లు లబోదిబోమంటున్నారు.

దేశీయ దిగ్గజం తొలి సవాల్, తొలి ఆండ్రాయిడ్ గో మొబైల్ మనదే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

70మందికిపైగా కస‍్టమర్లు..

తమ క్రెడిట్‌ ద్వారా అక్రమ లావాదేవీలు చోటు చేసుకున్నాయంటూ వన్‌ప్లస్‌ వెబ్‌సైట్‌ ద్వారా మొబైల్‌ కొనుగోలు చేసిన క్రెడిట్‌ కార్డు వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. 70మందికిపైగా కస‍్టమర్లు దీనిపై సంస్థకు ఫిర్యాదు చేశారు.

తక్షణమే విచారణ

మరోవైపు ఒకరు తరువాత ఒకరు ఈ మోసం పై ఫిర్యాదు చేయడంతో స్పందించిన సంస్థ తక్షణమే విచారణ చేపట్టినట్టు బ్లాగ్ పోస్ట్ లో తెలిపింది.

oneplus.netద్వారా..

ప్రత్యక్షంగా తమ వెబ్‌సైట్‌ oneplus.netద్వారా (పేపాల్ లాంటి మూడవ పార్టీతో సంబంధం లేకుండా) జరిగిన అక్రమ లావాదేవీల అంశాన్ని సీరియస్‌గా పరిగణించినట్టు పేర్కొంది. తమ సైట్‌ను కస్టమ్‌ కోడ్‌తో పునర్నిర్మాణం చేస్తున్నామని వెల్లడించింది.

 

 

వన్‌ప్లస్ 5టీ లావా రెడ్ ఎడిషన్

చైనాకు చెందిన మొబైల్స్ తయారీ దిగ్గజం వన్‌ప్లస్ తన వన్‌ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్‌కు గాను లావా రెడ్ ఎడిషన్ వేరియెంట్‌ను తాజాగా విడుదల చేసిన సంగతి తెలిసిందే..
వన్‌ప్లస్ 5టీ లావా రెడ్ ఎడిషన్ స్పెషిఫికేషన్స్
6 అంగుళాల అప్టిక్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ప్రొటెక్షన్‌ కోసం గొర్రిల్లా గ్లాస్‌ 5 ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌ 6జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ 8జీబీ ర్యామ్‌, 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆక్సీజెన్‌ఓఎస్‌ ఆధారిత ఆండ్రాయిడ్‌ 7.1.1 నోగట్‌తో రన్నింగ్‌ రెండు ప్రైమరీ కెమెరాలు, ఒకటి 20మెగాపిక్సెల్‌ సెన్సార్‌, రెండోది 16 మెగాపిక్సెల్‌ మోడ్యూల్‌ ముందు వైపు 16 మెగాపిక్సెల్‌ కెమెరా తక్కువ వెలుతురులో కూడా మెరుగైన ఇమేజ్‌లు తీయడం దీని ప్రత్యేకత 3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ‌ ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
OnePlus customers allege fraudulent transactions on credit cards, company says investigating More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot