వన్‌ప్లస్ దీపావళి సేల్.. స్మార్ట్‌ఫోన్లు, ఇయర్‌బడ్స్, ట్యాబ్లెట్స్‌పై బెస్ట్ డిస్కౌంట్లు..!
OnePlus Diwali Festive Sale 2025 : వన్‌ప్లస్ కీలక ప్రకటన చేసింది. వన్‌ప్లస్ దీపావళి ఫెస్టివ్ సేల్ 2025 వివరాలను వెల్లడించింది. సెప్టెంబర్ 22 నుంచి సేల్ అధికారికంగా ప్రారంభం కానుందని తెలిపింది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్‌లు సహా ఇతర ఆడియో ఉత్పత్తులను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేయవచ్చు.
వన్‌ప్లస్ దీపావళి ఫెస్టివ్ సేల్ 2025, సెప్టెంబర్ 22 అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. వన్‌ప్లస్ స్టోర్‌లు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్ వంటి స్టోర్స్‌లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. అయితే ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు సహా ఇతర ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్‌లు పొందవచ్చు.

ఫ్లాగ్‌షిప్ మోడల్స్ :
వన్‌ప్లస్ ప్రత్యేక సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13R, వన్‌ప్లస్ 13s వంటి ఫ్లాగ్‌షిప్ మోడల్స్‌తోపాటు నార్డ్ సిరీస్ మోడల్స్ పైన డిస్కౌంట్‌ను పొందవచ్చు. వన్‌ప్లస్ 13 హ్యాండ్‌సెట్ విడుదల సమయంలో రూ.69,999 గా ఉండేది. ఈ సేల్‌లో రూ.61999 కే కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు కార్డులతో రూ.57,749 కే సొంతం చేసుకోవచ్చు.
అదే విధంగా వన్‌ప్లస్ 13R స్మార్ట్‌ఫోన్ రూ.42,999 ధరకు విడుదల అయింది. ఈ సేల్‌లో రూ.37,999 గా అందుబాటులో ఉంది. బ్యాంకు కార్డులపై రూ.35,749 కే సొంతం చేసుకోవచ్చు. వన్‌ప్లస్ కంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ మోడల్ వన్‌ప్లస్ 13s ను బ్యాంకు కార్డులతో రూ.47,749 కే కొనుగోలు చేయవచ్చు.

నార్డ్ సిరీస్ :
అదే విధంగా ఈ సంవత్సరం సమ్మర్ ఈవెంట్‌లో విడుదల చేసిన వన్‌ప్లస్ నార్డ్ 5 సిరీస్ ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ సిరీస్‌లో భాగంగా వన్‌ప్లస్ నార్డ్ 5, నార్డ్ CE 5 అందుబాటులోకి వచ్చాయి. నార్డ్ 5 స్మార్ట్‌ఫోన్ రూ.31999 కే విడుదల అయింది.
వన్‌ప్లస్ దీపావళి సేల్‌లో భాగంగా రూ.30,499 కే అందుబాటులో ఉంటుంది. బ్యాంకు కార్డులపై రూ.28,499 కే కొనుగోలు చేయవచ్చు. అదే నార్డ్ CE 5 ఫోన్ రూ.24,999 కు విడుదల అయింది. ఈ సేల్‌లో భాగంగా రూ.23,499 కు అందుబాటులోకి వస్తుంది. అయితే బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌తో రూ.21,499 కే కొనుగోలు చేయవచ్చు.
ఇయర్‌బడ్స్ :
వన్‌ప్లస్ దీపావళి సేల్ 2025 లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లతోపాటు ఆడియో ఉత్పత్తులపై డిస్కౌంట్‌లను పొందవచ్చు. వన్‌ప్లస్ బడ్స్ 4 ఇయర్‌బడ్స్ రూ.5,999 కు విడుదల అయింది. ఈ సేల్‌లో రూ.5,299 కే అందుబాటులో ఉంటుంది. బ్యాంకు కార్డులపై రూ.500 డిస్కౌంట్‌ను పొందవచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 3 TWS బడ్స్ రూ.2299 గా ఉండగా.. ఈ సేల్‌లో రూ.1599 కే కొనుగోలు చేయవచ్చు. అదే నార్డ్ బడ్స్ 3r ఇయర్‌బడ్స్‌ను రూ.1499 కే కొనుగోలు చేయవచ్చు. అదే వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 3 ప్రో ఇయర్‌బడ్స్ ధర రూ.2,999 ఉండగా.. ఈ దీపావళి సేల్‌లో రూ.2099 కే కొనుగోలు చేయవచ్చు.
* వన్‌ప్లస్ దీపావళి సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ ప్యాడ్ 3, వన్‌ప్లస్ ప్యాడ్ 2, వన్‌ప్లస్ ప్యాడ్ గో, వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ వంటి ట్యాబ్లెట్స్‌పై డిస్కౌంట్ ధరకు సొంతం చేసుకోవచ్చు.
వన్‌ప్లస్ ప్యాడ్ 3 : ఆఫర్ ధర రూ.42,749 (బ్యాంకు డిస్కౌంట్‌తో సహా)
వన్‌ప్లస్ ప్యాడ్ 2 : ఆఫర్ ధర రూ.29,749 (బ్యాంకు డిస్కౌంట్‌తో సహా)
వన్‌ప్లస్ ప్యాడ్ గో : ఆఫర్ ధర రూ.13,749 (బ్యాంకు డిస్కౌంట్‌తో సహా)
వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ : ఆఫర్ ధర రూ.11,749 (బ్యాంకు డిస్కౌంట్‌తో సహా)


Click it and Unblock the Notifications