మార్కెట్లోకి వన్‌ప్లస్ ఎక్స్‌ప్లోరర్ బ్యాక్‌ప్యాక్, ధర రూ.4,990

గత ఏడాది వన్‌ప్లస్ కంపెనీ OnePlus 5 స్మార్ట్‌ఫోన్‌తో పాటు బ్యాక్ ప్యాక్ ను విడుదల చేసింది. అయితే ఇప్పుడు మరోసారి అదే లాంచ్ ప్యాట్రన్ పునరావృతం చేయనుంది.

|

గత ఏడాది వన్‌ప్లస్ కంపెనీ OnePlus 5 స్మార్ట్‌ఫోన్‌తో పాటు బ్యాక్ ప్యాక్ ను విడుదల చేసింది. అయితే ఇప్పుడు మరోసారి అదే లాంచ్ ప్యాట్రన్ పునరావృతం చేయనుంది .అక్టోబర్లో వన్‌ప్లస్ కంపెనీ OnePlus 6T విడుదల చేసిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు కొత్త ఎక్స్‌ప్లోరర్ బ్యాక్‌ప్యాక్ ను విడుదల చేస్తుంది .ఈ కొత్త వన్‌ప్లస్ ఎక్స్‌ప్లోరర్ బ్యాక్‌ప్యాక్ ఇంతక ముందు విడుదల చేసిన బ్యాక్‌ప్యాక్ కన్నా చూడడానికి చాలా స్టైలిష్ గా ఉంది.

 

భారతదేశంలో వన్‌ప్లస్ ఎక్స్‌ప్లోరర్  బ్యాక్‌ప్యాక్ ధర....

భారతదేశంలో వన్‌ప్లస్ ఎక్స్‌ప్లోరర్ బ్యాక్‌ప్యాక్ ధర....

భారతదేశంలో వన్‌ప్లస్ ఎక్స్‌ప్లోరర్ బ్యాక్‌ప్యాక్ ధర సుమారు రూ.4,990 గా ఉంది. ఈ Explorer బ్యాక్ ప్యాక్ Slate Black మరియు Morandi Green రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఈ బ్యాక్ ప్యాక్ యొక్క సేల్ అమెజాన్ ఇండియా మరియు అధికారిక వన్‌ప్లస్ ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ ఛానళ్లు ద్వారా ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. అయితే, ఇది ఇన్విటేషన్ ఆధారంగా మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి, మీకు ఇన్విటేషన్ ఉంటే దాన్ని కొనుగోలు చేసే అదృష్టం ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్స్ లాగే హై క్వాలిటీ డిజైన్...

స్మార్ట్‌ఫోన్స్ లాగే హై క్వాలిటీ డిజైన్...

హై క్వాలిటీ స్మార్ట్‌ఫోన్స్ ను డిజైన్ చేయడంలో వన్‌ప్లస్ కంపెనీకి పెట్టింది పేరు .అయితే ఈ కొత్త బ్యాక్‌ప్యాక్ తో స్మార్ట్ ఫోన్లనే కాదు బ్యాక్‌ప్యాక్ చేయడంలో కూడా హై క్వాలిటీ మెయిన్టెయిన్ చేస్తునట్టు నిరూపించబడింది.ఈ బ్యాక్‌ప్యాక్ ను డిజైన్ చేయడానికి వన్‌ప్లస్ కంపెనీ సుపీరియర్ మరియు హై క్వాలిటీ మెటీరియల్ ని ఉపయోగించింది.డిజైన్ ఏ కాకుండా సేఫ్టీ విషయంను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ బ్యాక్‌ప్యాక్ ను తయారు చేసింది వన్‌ప్లస్ కంపెనీ

మల్టీపుల్ కంపార్ట్మెంట్స్...
 

మల్టీపుల్ కంపార్ట్మెంట్స్...

వన్‌ప్లస్ ఎక్స్‌ప్లోరర్ బ్యాక్‌ప్యాక్ లో హైలైట్ గా చెప్పుకోవాల్సింది మల్టీపుల్ కంపార్ట్మెంట్స్ గురించి.ఇందులో విలువైన వస్తువులను దాచుకోవడానికి సీక్రెట్ పాకెట్ ఇచ్చారు. అలాగే ల్యాప్ టాప్ పెట్టుకోవడానికి ఒక సెపెరేట్ కంపార్ట్మెంట్ ఇచ్చారు.అలాగే బ్రీతబుల్ వెంట్స్ కోసం ముందు భాగంలో సెపెరేట్ కంపార్ట్మెంట్ ఇచ్చారు. ఈ కంపార్ట్మెంట్లో గొడుగు మరియు తడి బట్టలు వంటి తడి వస్తువులని నిల్వ చేయడానికి ఉద్దేశించబడింది.అలాగే వాటర్ బాటిల్ కోసం తయారు చేసిన పాకెట్ చాలా లోతుగా ఉంటుంది అందువల్ల వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది.

 

 

డ్యూరబిలిటీ...

డ్యూరబిలిటీ...

ఈ కొత్త బ్యాక్‌ప్యాక్ ను చైనా బ్రాండ్ కార్డ్యురా క్లాసిక్ ఫాబ్రిక్ నుంచి తయారు చేయబడింది. ఇక ఈ డివైస్ స్కాఫ్-నిరోధక మరియు అనూహ్యంగా బలంగా చేస్తుంది.ఇక కంపెనీ చెబుతున్న ప్రకారం ఈ మెటీరియల్ ద్వారా ఈ వస్తువు కొన్ని సంవత్సరాలు కూడా వాడుకోవచ్చు. ఒక్కసారి ఈ వస్తువు మీ చేతిలోకి వస్తే మీరు కూడా కొన్ని సంవత్సరాల వరకు వాడుకోవచ్చు.

 

 

 

FIDLOCK తగినంత భద్రతకు హామీ ఇస్తుంది...

FIDLOCK తగినంత భద్రతకు హామీ ఇస్తుంది...

ఈ కొత్త వన్‌ప్లస్ ఎక్స్‌ప్లోరర్ బ్యాక్‌ప్యాక్ సేఫ్టీ విషయంలో అసలు కంప్రమైస్ కాలేదు. ఇక ఈ సంస్థ ఎక్స్‌ప్లోరర్ బ్యాక్‌ప్యాక్ ఒక సింగల్ జిప్పర్ మరియు ఒక ఫోల్డర్-ఓవర్ కవర్ మరియు ఒక స్మార్ట్ FIDLOCK తో తయారు చేసింది .

 

 

Best Mobiles in India

English summary
OnePlus Explorer Backpack goes on sale for Rs. 4,990: Here’s what you’ll get this time.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X