Home
News

ఫోల్డబుల్‌ ఫోన్ మార్కెట్‌లోకి OnePlus ఎంట్రీ..! లాంచ్ తేదీ, ఫీచర్లు..

ఫోల్డబుల్‌ ఫోన్లు మరోసారి ట్రెండ్‌ను సృష్టించే అవకాశం కనిపిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం ఫోల్డింగ్‌, ఫ్లిప్‌ ఫోన్లలో టాప్‌గా శాంసంగ్‌ ఉండేది. మళ్లీ ఇన్నాళ్లకు ప్రముఖ సంస్థలన్నీ మరోసారి ఫోల్డింగ్‌ ఫోన్ల తయారీపై దృష్టిపెట్టి లాంచ్ చేస్తున్నాయి. ఈ జాబితాలో గూగుల్‌, వన్‌ ప్లస్‌, శాంసంగ్‌ సహా మరికొన్ని సంస్థలు ఉన్నాయి.

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ OnePlus తన ఫోల్డ్‌బుల్‌ ఫోన్‌ను ఈ సంవత్సరంలోనే లాంచ్‌ చేసే అవకాశం ఉంది. MWC 2023 కార్యక్రమంలో ఈ ఫోన్‌ను విడుదల చేయనుందని సమాచారం. అయితే వన్‌ప్లస్‌ సంస్థ మాత్రం ఎప్పుడు విడుదల చేస్తుందనే వివరాలు అధికారికంగా వెల్లడించలేదు. వన్‌ప్లస్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌ శాంసంగ్‌, ఒప్పో, మోటరోలా ఫోన్‌లతో పోటీపడాల్సి ఉంటుంది. ఆ సంస్థలు ఫోన్లను ఇప్పటికే విడుదల చేయగా.. వన్‌ప్లస్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌ను లాంచ్‌ కావాల్సి ఉంది.

OnePlus Foldable phone

వన్‌ప్లస్‌ తన మొదటి ఫోల్డబుల్‌ ఫోన్‌ను 2023 ఆగస్టులో లాంచ్‌ చేయనుందని టిప్‌స్టర్‌ MaxJambor ట్వీట్‌ చేశారు. వన్‌ప్లస్‌ కూడా ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఈ సంవత్సరం మూడో త్రైమాసికంలో విడుదల చేస్తామనే సంకేతాలు ఇప్పటికే ఇచ్చింది. దాంతోపాటు ఫోల్డబుల్‌ ఫోన్‌కు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేసింది. అయితే Oneplus Foldable ఫోన్‌కు సంబంధించిన స్పేసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు వెల్లడించలేదు.

వన్‌ప్లస్‌ మొదటి ఫోల్డబుల్‌ ఫోన్‌... శాంసంగ్‌ గెలాక్సీ Z Fold 4 తరహాలోనే 2K డిస్‌ప్లేను కలిగి ఉంటుందంటూ కొన్ని ఉహాగానాలు బయటకు వస్తున్నాయి. ఈ సంవత్సరం మొదటి లోనే వన్‌ప్లస్‌ సంస్థ రెండు ట్రేడ్‌మార్క్‌ ఫోన్లు Oneplus V Fold, Oneplus V Filp మోడల్‌ను లాంచ్‌ చేయనుందని సమాచారం మాత్రం బయటకు వచ్చింది.

రెండు ఫోల్డబుల్‌ ఫోన్లలో కన్వెన్షన్‌ ఫోల్డింగ్‌, clamshell ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్లుగా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వన్‌ప్లస్‌ సంస్థ మాత్రం ఫోల్డబుల్‌ ఫోన్ల గురించి ఎక్కడా సమాచారం ఇవ్వలేదు.

ఈ ఫోల్డబుల్‌ ఫోన్లతోపాటు వన్‌ప్లస్‌ Nord N30 ఫోన్‌ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోందని సమాచారం. గూగుల్‌ ప్లే కన్సోల్‌ లిస్టింగ్‌లో వన్‌ప్లస్‌ నార్డ్‌ N30 స్మార్ట్‌ఫోన్‌ను గుర్తించారు. నార్డ్‌ N30 స్మార్ట్‌ఫోన్.. నార్డ్‌ N20కి కొనసాగింపు వెర్షన్‌గా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో ఈ ఫోన్‌ను... వన్‌ప్లస్‌ నార్డ్‌ CE3 Lite 5Gకి రీబ్రాండెండ్‌ వెర్షన్‌గా రానుందని సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్‌ పుల్‌ HD+ డిస్‌ప్లే మరియు 8GB ర్యామ్‌, స్నాప్‌డ్రాగన్‌ 695 SoCతో విడుదల కానుందని సమాచారం.

ఫోల్డబుల్‌ ఫోన్ల రేస్‌లో ఉన్న గూగుల్‌ తన ఫోల్డబుల్‌ ఫోన్‌ Pixel Fold గురించి చిన్న వీడియోను ట్విట్టర్‌ ద్వారా విడుదల చేసింది. హింజ్‌ మెకానిజమ్‌, ఇన్నర్‌ డిస్‌ప్లేతో గూగుల్‌ పిక్సల్‌ ఫోన్‌ రానుంది.

మే 10న జరగనున్న గూగుల్ I/O ఈవెంట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేస్ అవకాశం ఉంది. అయితే అసలు ఈ ఫోన్‌ భారత్‌లో అందుబాటులో ఉంటుందా లేదా అనేదానిపై ఎటువంటి స్పష్టత లేదు. ఈ పిక్సల్‌ ఫోన్‌ మూడు కెమెరాలతో రానుంది తెలుస్తోంది. గూగుల్‌ టెన్సార్‌ G2 ప్రోసెసర్‌తో లాంచ్‌ కానుందని సమాచారం.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus first Foldable phone launch date and display leaked
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X