వన్ ప్లస్ ఫోల్డబుల్ ఫోన్ యొక్క డిజైన్ వివరాలు లీక్! స్పెసిఫికేషన్లు
వన్‌ప్లస్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ యొక్క వివరాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన వన్ ప్లస్ క్లౌడ్ 11 లాంచ్ ఈవెంట్‌లో టీజ్ చేయబడింది. అప్పటి నుండి ఈ విషయంపై కంపెనీ మౌనంగా ఉన్నప్పటికీ, ఈ హ్యాండ్‌సెట్ యొక్క డిజైన్, ధర, లాంచ్ టైమ్‌లైన్ మరియు ఇతర సంబంధిత స్పెసిఫికేషన్‌ల గురించి నిరంతరం వార్తలు వస్తూనే ఉన్నాయి.
ఇప్పటివరకు, లీకైన రెండర్‌లు గతంలో హ్యాండ్‌సెట్ డిజైన్ మరియు నిర్దిష్ట కెమెరా వివరాలను కూడా సూచించాయి. షెన్‌జెన్‌కు చెందిన ఈ మొబైల్ తయారీదారు ఇప్పటివరకు ఈ మోడల్ యొక్క పేరును కూడా ధృవీకరించలేదు. ఇప్పుడు, ఒక టిప్‌స్టర్ లీక్ చేసిన సమాచారం ప్రకారం మొట్టమొదటి వన్‌ప్లస్ బుక్ స్టైల్ ఫోల్డబుల్ హ్యాండ్‌సెట్ యొక్క అంచనా మోనికర్ డిజైన్ ను లీక్ చేసింది.

టిప్‌స్టర్ Max Jambor (@MaxJmb) ట్విట్టర్‌లో OnePlus తన ఫోల్డబుల్ ఫోన్‌ను వన్‌ప్లస్ ఓపెన్ డిజైన్ తో లాంచ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలియచేసారు. వన్‌ప్లస్ ప్రైమ్, వన్‌ప్లస్ పీక్, వన్‌ప్లస్ ఎడ్జ్ మరియు వన్‌ప్లస్ వింగ్ వంటి అనేక ఇతర మోడల్ పేర్లను కంపెనీ దృష్టిలో ఉన్నాయని, సంస్థ వీటిని పరిగణించిందని అతను తన లీక్ లో పేర్కొన్నాడు.
ముఖ్యంగా, ఈ మోడల్‌ను మొదటిసారి టీజ్ చేసినప్పుడు, ఇది వన్ ప్లస్ V ఫోల్డ్ మరియు వన్ ప్లస్ V ఫ్లిప్ పేర్లను కలిగి ఉండేలా సూచించబడింది. ఇది కొన్ని ప్రాంతాలలో మారుతూ ఉంటుంది. కాలక్రమేణా, ఈ ఫోన్‌ను వన్‌ప్లస్ ఫోల్డ్ లేదా వన్‌ప్లస్ వి ఫోల్డ్ అని పిలుస్తారు.
వన్ ప్లస్ ఫోల్డబుల్ ఫోన్ 7.8 అంగుళాల 2K AMOLED లోపలి స్క్రీన్ మరియు 6.3 అంగుళాల AMOLED బయటి డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.ఈ రెండూ 120Hz రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తాయి. ఈ హ్యాండ్‌సెట్ 16GB RAM మరియు 256GB స్టోరేజీ తో జత చేయబడిన ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 SoC ప్రాసెసర్ తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్ OS 13.1 అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో వచ్చే అవకాశం ఉంది.
రాబోయే ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ బ్లాక్ లీచీ లాంటి లెదర్ ఫినిషింగ్‌ను కలిగి ఉంటుందని లీకైన రెండర్‌లు సూచించాయి. దీని వెనుక ప్యానెల్ శామ్‌సంగ్ గెలాక్సీ S23 అల్ట్రాకు సమానమైన ఇమేజ్ క్వాలిటీని అందజేస్తుందని క్లెయిమ్ చేసిన పెరిస్కోప్ లెన్స్‌తో సహా హాసెల్‌బ్లాడ్ బ్రాండెడ్ కెమెరాలతో వృత్తాకార కెమెరా మాడ్యూల్‌తో కనిపిస్తుంది. ఫోన్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50 మెగాపిక్సెల్ సెన్సార్, అల్ట్రా-వైడ్ లెన్స్‌తో 48 మెగాపిక్సెల్ సెన్సార్, వెనుకవైపు పెరిస్కోప్ లెన్స్‌తో కూడిన 32 మెగాపిక్సెల్ సెన్సార్ మరియు రెండు 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాలు ఉంటాయి.
ఫోన్ బ్లాక్, గోల్డ్ మరియు గ్రీన్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో అందించబడుతుందని గతంలో సూచించబడింది. ఇది మొదట చైనాలో లాంచ్ చేయబడుతుందని భావిస్తున్నారు. తర్వాత ప్రస్తుతం వన్ ప్లస్ మోడల్‌లు అందుబాటులో ఉన్న అన్ని మార్కెట్‌లలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో,భారత మరియు యుఎస్ మార్కెట్‌లు కూడా ఉంటాయని నివేదికలు తెలియచేస్తున్నాయి.


Click it and Unblock the Notifications








