వన్‌ప్లస్ ప్రత్యేక సేల్.. స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్స్, ఇయర్‌బడ్స్‌పై డిస్కౌంట్లు..!
రిపబ్లిక్ డే సందర్భంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే సేల్ తేదీలను ప్రకటన చేశాయి. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 16 వ తేదీ నుంచి, ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 17 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సేల్ లో భాగంగా బ్యాంకు కార్డులపై డిస్కౌంట్లను అందించనున్నాయి. ఈ సేల్ డీల్స్ ను కూడా క్రమంగా ప్రకటిస్తున్నాయి.
అయితే ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ వన్‌ప్లస్ తాజాగా కీలక ప్రకటన చేసింది. వన్‌ప్లస్ ఫ్రీడం సేల్ ను (OnePlus Freedom Sale) జనవరి 16 వ తేదీ నుంచి నిర్వహిస్తామని తెలిపింది. ఈ సేల్ లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్స్, ఆడియో ఉత్పత్తులను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చని తెలిపింది.

స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లు :
ఈ సేల్ లో భాగంగా వన్‌ప్లస్ 15R, వన్‌ప్లస్ 15, వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13R, వన్‌ప్లస్ 13s, వన్‌ప్లస్ నార్డ్ 5, వన్‌ప్లస్ నార్డ్ CE 5 స్మార్ట్‌ఫోన్ లపై డిస్కౌంట్ అందిస్తామని తెలిపింది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై డిస్కౌంట్ లను పొందవచ్చని తెలిపింది.
| స్మార్ట్‌ఫోన్ | విడుదల ధర | బ్యాంకు ఆఫర్ | సేల్ ధర |
| వన్‌ప్లస్ 15 | రూ.72999 | రూ.4000 | రూ.68,999 |
| వన్‌ప్లస్ 13 | రూ.69999 | రూ.12000 | రూ.57999 |
| వన్‌ప్లస్ 13s | రూ.54999 | రూ.5000 | రూ.49999 |
| వన్‌ప్లస్ 13R | రూ.42999 | రూ.7000 | రూ.37999 |
| వన్‌ప్లస్ 15R | రూ.47999 | రూ.3000 | రూ.44999 |
| వన్‌ప్లస్ నార్డ్ 5 | రూ.33999 | రూ.3000 | రూ.30999 |
| వన్‌ప్లస్ నార్డ్ CE 5 | రూ.24999 | రూ.2000 | రూ.22999 |
ట్యాబ్లెట్స్‌పై ఆఫర్లు :
వన్‌ప్లస్ ఫ్రీడం సేల్ లో భాగంగా వన్‌ప్లస్ ప్యాడ్ 3, వన్‌ప్లస్ ప్యాడ్ 2, వన్‌ప్లస్ ప్యాడ్ గో 2, వన్‌ప్లస్ ప్యాడ్ గో, వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ ట్యాబ్లెట్ పై బ్యాంకు డిస్కౌంట్ ను అందిస్తామని తెలిపింది. దీంతోపాటు ఆడియో ఉత్పత్తులను కూడా తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు.
| ట్యాబ్లెట్ | విడుదల ధర | బ్యాంకు ఆఫర్ | సేల్ ధర |
| వన్‌ప్లస్ ప్యాడ్ 3 | రూ.47999 | రూ.3000 | రూ.44999 |
| వన్‌ప్లస్ ప్యాడ్ 2 | రూ.36999 | రూ.2000 | రూ.34999 |
| వన్‌ప్లస్ ప్యాడ్ గో 2 | రూ.26999 | రూ.3000 | రూ.23999 |
| వన్‌ప్లస్ ప్యాడ్ గో | రూ.17999 | రూ.4000 | రూ.13999 |
| వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ | రూ.15999 | రూ.4000 | రూ.11999 |
ఇయర్‌బడ్స్, నెక్‌బ్యాండ్స్‌పై డిస్కౌంట్‌లు :
ఆడియో ఉత్పత్తుల జాబితాలో వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3, వన్‌ప్లస్ బడ్స్ 4, వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 3 ప్రో, వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 3, నార్డ్ బడ్స్ 3r, బుల్లెట్స్ వైర్‌లెస్ Z2 ANC, బుల్లెట్స్ వైర్‌లెస్ Z3 ఉన్నాయి. ఈ ఇయర్‌బడ్స్, నెక్‌బ్యాండ్స్ పై బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.2000 డిస్కౌంట్ ను పొందవచ్చు.
| ఇయర్‌బడ్/నెక్‌బ్యాండ్ | ధర | బ్యాంకు ఆఫర్ | సేల్ ధర |
| వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3 | రూ.11999 | రూ.2000 | రూ.9999 |
| వన్‌ప్లస్ బడ్స్ 4 | రూ.5999 | రూ.1000 | రూ.4999 |
| వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 3 ప్రో | రూ.2999 | రూ.650 | రూ.2349 |
| వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 3 | రూ.2299 | రూ.600 | రూ.1699 |
| బుల్లెట్స్ వైర్‌లెస్ Z2 ANC | రూ.2099 | రూ.450 | రూ.1649 |
| వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 3r | రూ.1799 | రూ.350 | రూ.1449 |
| బుల్లెట్స్ వైర్‌లెస్ Z3 | రూ.1699 | రూ.500 | రూ.1199 |
వన్‌ప్లస్ ఫ్రీడం సేల్ లో భాగంగా స్మార్ట్‌ఫోన్ ఆఫర్లను వన్‌ప్లస్ వెబ్‌సైట్, వన్‌ప్లస్ స్టోర్‌లు, అమెజాన్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్ లోనూ అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు ట్యాబ్లెట్లను ఫ్లిప్‌కార్ట్ లో కొనుగోలు చేయవచ్చు. అయితే ఆడియో ఉత్పత్తులను మాత్రం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, బ్లింకిట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి.


Click it and Unblock the Notifications








