Home
News

వన్‌ప్లస్‌ ఇండియా సంచలన నిర్ణయం.. వాటి ఉత్పత్తి, విక్రయాలు నిలిపివేత.. వెబ్‌సైట్‌ నుంచి తొలగింపు?

వన్‌ప్లస్‌ సంస్థ (OnePlus India) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్‌ మార్కెట్‌లో టీవీలు, మానిటర్ల ఉత్పత్తి, విక్రయాలు నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వన్‌ప్లస్‌ ఇండియా వెబ్‌సైట్‌ నుంచి టీవీలు, డిస్‌ప్లే కేటగిరిని తొలగించింది. వ్యాపార వ్యూహాల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై వన్‌ప్లస్‌ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

వన్‌ప్లస్‌ సంస్థ తక్కువ కాలంలో నాణ్యమైన ఉత్పత్తులతో గుర్తింపు పొందింది. ఈ సంస్థ భారత్‌ మార్కెట్‌లోకి 2019 లో తొలిసారిగా వన్‌ప్లస్‌ TV Q1 ద్వారా ఈ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి వివిధ రకాల ధరల్లో అనేక టీవీలు, స్మార్ట్‌టీవీలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

OnePlus india exit from Tv and monitor segment and has removed from website

వన్‌ప్లస్ మానిటర్ల విభాగంలో రెండు మోడళ్లను మాత్రమే కలిగి ఉంది. అవి వన్‌ప్లస్‌ X27 అంగుళాలు మరియు వన్‌ప్లస్ E 24 అంగుళాలు మోడళ్లను మాత్రమే విడుదల చేసింది. అయితే ప్రస్తుతం వన్‌ప్లస్‌ బ్రాండ్‌ భారత్ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్లకు ప్రసిద్ధి చెందింది. ఈ సంవత్సరంలో ఈ బ్రాండ్‌ నుంచి వన్‌ప్లస్ 12 సిరీస్‌ అందుబాటులోకి వచ్చింది.

ఏప్రిల్‌ 1వ తేదీన వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 హ్యాండ్‌సెట్ లాంచ్‌ కానుంది. ఈ కొత్త హ్యాండ్‌సెట్‌ ఫోటోను విడుదల చేసింది. గత మోడళ్ల కంటే ఈ ఫోన్‌ డిజైన్ ఆకట్టుకుంటుంది. ఈ ఫోటో ఆధారంగా వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది.

మరియు వన్‌ప్లస్‌ లోగోను వెనుకవైపు గుర్తించవచ్చు. ఈ ఫోన్‌ ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఫలితం దీని ద్వారా టీవీ, ఏసీ సహా ఇతర కొన్ని ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను నియంత్రించవచ్చు. వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 స్మార్ట్‌ఫోన్‌ ఆక్టాకోర్‌ క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 7 జెన్ 3 చిప్‌సెట్‌ను పైన పనిచేస్తుందని వన్‌ప్లస్‌ సంస్థ ధ్రువీకరించింది.

ఈ వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 స్మార్ట్‌ఫోన్‌ డార్క్‌ క్రోమ్‌ మరియు సెలాడాన్‌ మార్బుల్‌ రంగుల్లో లభిస్తుందని వన్‌ప్లస్‌ తెలిపింది. మరియు ఈ హ్యాండ్‌సెట్ ఏప్రిల్ 1న విడుదల కానుండగా.. వన్‌ప్లస్‌ వెబ్‌సైట్‌ OnePlus.in మరియు ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చని సంస్థ వెల్లడించింది.

వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4 స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ ఫోన్‌ 50MP ప్రధాన కెమెరా మరియు 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు 16MP సెల్ఫీ కెమెరాతో వస్తుందని సమాచారం. ఈ వివరాలపై సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus key decision to leave Tv and monitor segment in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X