కొత్తగా మూడు OnePlus ఆఫ్‌లైన్ స్టోర్స్
మార్కెట్ విస్తరణలో భాగంగా చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్, మూడు సరికొత్త రిటైల్ స్టోర్‌లను భారత్‌లో అనౌన్స్ చేసింది.
మార్కెట్ విస్తరణలో భాగంగా చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్, మూడు సరికొత్త రిటైల్ స్టోర్‌లను భారత్‌లో అనౌన్స్ చేసింది. బెంగుళూరు, కోల్‌కతా ఇంకా ముంబై నగారాల్లో జూలై 28 నుంచి ఈ స్టోర్‌లు ప్రారంభం
కాబోతున్నాయి.సర్వీస్ సెంటర్లతో పాటు ఆఫ్‌లైన్ స్టోర్స్ సంఖ్యను పెంచటం ద్వారా కస్టమర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింతగా మెరుగుపరచవచ్చని వన్‌ప్లస్ భావిస్తోంది.

భారత్‌ను రెండవ ప్రధాన మార్కెట్‌గా
చైనా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న వన్‌ప్లస్ భారత్‌ను రెండవ ప్రధాన మార్కెట్‌గా భావిస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 10 సరికొత్త ఆఫ్‌లైన్ స్టోర్‌లతో పాటు ఓ రిసెర్చ్ అండ్ డెవలెప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ నిర్ణయం తీసుకుంది.

డిజిటల్ - ఫస్ట్ బ్రాండ్ గానే కొనసాగుతాం..
భారతీయులు ఏదైనా స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే ముందు ఆ ఫోన్‌ను ముందుగా ఎక్స్‌పీరియన్స్ చేయాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో టచ్ అండ్ ఫీల్ స్టోర్‌లకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాము కూడా ఆఫ్‌లైన్ యూజర్లకు చేరువకావాలన్న ఉద్దేశ్యంతో ఆఫ్‌లైన్ స్టోర్‌లను ఏర్పాటు చేస్తున్నాం. ఇన్ని చేస్తున్నప్పటికి తాము డిజిటల్ - ఫస్ట్ బ్రాండ్ గానే కొనసాగుతామని వన్‌ప్లస్ ఇండియా జనరల్ మేనేజర్ వికాస్ అగర్వాల్ తెలిపారు.

మొట్టమొదటి ఆఫ్‌లైన్ స్టోర్ బెంగుళూరులో..
ఇండియన్ మార్కెట్లో వన్‌ప్లస్ తన మొట్టమొదటి ఆఫ్‌లైన్ స్టోర్‌ను వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్ పేరుతో బెంగుళూరులో ఏర్పాట చేసింది. తాజాగా ఇదే నగరంలో ఏర్పాటు చేయబోతోన్న మరో స్టోర్ జయనగర్ 4వ బ్లాకులో ఉంటుంది. కోల్‌కోతా విషయానికి వచ్చేసరికి ప్రిన్స్ అన్వర్ షా రోడ్‌లోని సౌత్ సిటీ మాల్ వద్ద కొత్త స్టోర్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. ఇక ముంబై విషయానికి వచ్చేసరికి సీవుడ్స్ గ్రాండ్స్
సెంట్రల్ మాల్‌లలో వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్ ఏర్పాటు కాబోతోంది.

ఉచిత బహుమతులు..
జూలై 28 మాధ్యహ్నం 11 గంటలకు ఈ స్టోర్స్ ఓపెన్ అవుతాయి. ఈ స్టోర్స్ ఓపెనింగ్ కు హాజరయ్యే వన్ ప్లస్ అభిమానులు ముందుగా వన్‌ప్లస్ సైట్‌లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకన్నట్లయితే పలు బహుమతులను గెలుచుకునే వీలుంటుంది. మొదటి రోజుల ఈ రిటైల్ అవుట్‌లెట్‌లలో కొనుగోల చేసే కస్టమర్స్‌కు వన్‌ప్లస్ 6 మార్వెల్ అవెంజర్స్ ఐరన్ మ్యాన్ కేస్, వన్‌ప్లస్ బ్రాండెడ్ టీషర్ట్స్, బ్యాక్ టు స్కూల్ ప్యాకేజ్ ఇంకా వన్‌ప్లస్ 5/5జీ యాక్సిసరీస్‌ను ఉచితంగా అందించటం జరుగుతుందని కంపెనీ తెలిపింది.

91 శాతానికి పెరిగిన సేల్స్ వాల్యుమ్..
తాము ఆఫ్‌లైన్ స్టోర్‌లను ప్రారంభించిన నాటి నుంచి ఆన్‌లైన్ సేల్స్ వాల్యుమ్ విపరీతంగా పెరుగుతూ వస్తోందని వన్‌ప్లస్ ఒక ప్రకటనలో తెలిపింది. వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్స్ కారణంగా వన్‌ప్లస్ 5తో కంపేర్ చేసి చూసినట్లయితే వన్‌ప్లస్ 6 సేల్స్ వాల్యుమ్ 91 శాతానికి పెరిగిందని కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications








