Home
News

OnePlus 5: ఇది పర్‌ఫెక్ట్ దీపావళి గిఫ్ట్

By Bommu Sivanjaneyulu

భారతీయులు అత్యంత ఇష్టంగా జరుపుకునే దీపావళి పండుగ మరికొద్ది రోజుల్లో రాబోతోంది. దీపావళి మిగిలిన పండుగల్లాంటిది కాదు. మతంతో సంబంధం లేకుండా అందరూ జరుపుకునే ఈ పండుగను పిల్లలు దగ్గర నుంచి పెద్దవారు వరకు కుటుంబ సమేతంగా ఆస్వాదిస్తారు. పండుగ పర్వదినాన స్వీట్లు, కొత్త దుస్తులు, షాపింగ్, అలంకరణలు, బంధువుల హడావుడి ఇలా ఇల్లంతా సందడి సందడిగా మారిపోతుంది.

OnePlus’ latest Diwali video is as appealing as its flagship smartphone

దీపావళి సమయంలో వ్యాపారం కూడా భారీ మొత్తంలోనే జరుగుతుంది. ఈ పండుగను పురస్కరించుకుని దాదాపుగా అన్ని రకాల బ్రాండ్స్ తమ ప్రొడక్ట్స్ పై కొత్త కొత్త స్కీమ్‌లతో పాటు డిస్కౌంట్లను అనౌన్స్ చేయటం జరుగుతుంది. వీటిలో చాలా వరకు స్కీమ్స్ అలానే డిజిటల్ మార్కెటింగ్ ప్రచారాలు మార్కెట్‌ను ఆకట్టుకోలేక చతికిలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారం విషయంలోనూ ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి వచ్చేసింది.

మనసుకు హత్తుకునే విధంగా OnePlus ప్రమోషనల్ వీడియో

మనసుకు హత్తుకునే విధంగా OnePlus ప్రమోషనల్ వీడియో

ప్రస్తుత ట్రెండ్‌కు కనెక్ట్ అయ్యే విధంగా కొత్త ఆలోచనలకు సాన పెడుతూ కంపెనీలు తమ ప్రచార పర్వాన్ని ముందుకు తీసుకువెళుతున్నాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే OnePlus దీపావళి వీడియో. దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రూపొందించిన వీడియో క్రియేటివిటీ అలానే కొత్త ఆలోచనలకు అద్దం పడుతోంది.

గతేడాది నిర్వహించిన దీపావళి ప్రచారానికి భారీ స్పందన లభిచంటంతో, ఈ ఏడాది దీపావళిని OnePlus మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో రూపొందించిన దీపావళి ప్రమోషనల్ వీడియో ఫ్రెష్ ఫీల్‌తో వీక్షకులను ఆకట్టుకుంటోంది.

పండుగ నేపథ్యంతో సాగే ఈ వీడియోలో ఓ ఆసక్తికర ట్విస్ట్ కూడా ఉంది. ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో యంత్రాల్లో పరిగెడుతోన్న మనుషులకు ఈ దీపావళి పండుగ అనేది ఎంతో మానసిక ప్రశాంతతో పాటు సుఖసంతోషాలను ఇస్తుందన్న మెసేజ్‌ను ఈ వీడియో ద్వారా వన్‌ప్లస్ రీవీల్ చేసింది.

129 సెకన్ల నిడివితో సాగే ఈ వీడియోలో భావోద్వేగాలు అర్థవంతంగానూ, ఆకట్టుకునే విధంగానూ ఉన్నాయి. వన్‌ప్లస్ 2017 దీపావళి వీడియోలో చక్కటి సందేశాతో పాటు, తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ అయిన OnePlus 5ను పర్‌ఫెక్ట్ దీపావళి గిఫ్ట్ అంటూ కంపెనీ ప్రమోట్ చేసుకుంది.

 

OnePlus నమ్మకమైన బ్రాండ్‌గా అవతరించటానికి కారణాలు ఇవే

OnePlus నమ్మకమైన బ్రాండ్‌గా అవతరించటానికి కారణాలు ఇవే

మూడు సంవత్సరాల క్రితం చిన్న స్టార్టప్‌గా ప్రారంభమైన OnePlus బ్రాండ్ అంచెలంచెలుగా అభివృద్థి చెంది, ఈ రోజున టాప్ మోస్ట్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో ఒకటిగా నిలిచింది. క్రియేటివ్ థింకింగ్, హార్డ్ వర్క్ వంటి అంశాలు వన్‌ప్లస్ బ్రాండ్ ఎదుగుదలకు తోడ్పడ్డాయని సైబర్‌మీడియా రిసెర్చ్ తన లేటెస్ట్ రిపోర్ట్‌లో పేర్కొంది. ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో విశ్వసనీయమైన బ్రాండ్‌గా అవతరించిన వన్‌ప్లస్, ఇతర స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లతో పోలిస్తే మరింత నమ్మకాన్ని స్కోర్ చేయలిగింది.

CMR MICI సర్వేలో భాగంగా వన్‌ప్లస్ బ్రాండ్ ఫోన్‌లు ఇతర స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే వివిధ పారామీటర్లలో ముందంజలో నిలిచినట్లు రుజువైంది. ఇండియన్ మార్కెట్లో మిగిలిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లతో పోలిస్తే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లకు హై రీసేల్ వాల్యూ ఉన్నట్లు సైబర్ రిసెర్చ్ సర్వే తేల్చిచెప్పింది. 2017 రెండవ త్రైమాసికానికి సంబంధించి IDC రివీల్ చేసిన గణాంకాల ప్రకారం వన్‌ప్లస్ బ్రాండ్, భారత్‌లోని టాప్ 3 ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలో ఒకటిగా నిలిచింది.

 అత్యధిక బెంచ్‌మార్క్ స్కోర్‌ నమోదు చేసిన OnePlus 5

అత్యధిక బెంచ్‌మార్క్ స్కోర్‌ నమోదు చేసిన OnePlus 5

వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ OnePlus 5, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో అత్యధిక బెంచ్‌మార్క్ స్కోర్‌ను నమోదు చేయగలిగింది.

బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లో, టాప్ ఎండ్ స్పెసిఫికేషన్స్‌తో లాంచ్ అయిన ఈ ఫోన్.. అటు డిజైనింగ్ పరంగా ఇటు పెర్ఫామెన్స్ పరంగా మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటోంది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8, ఎస్8+, గెలాక్సీ నోట్ 8, హెచ్‌టీసీ యూ11 వంటి ప్రీమియమ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లలో వినియోగించిన శక్తివంతమైన Qualcomm Snapdragon 835 చిప్‌సెట్ పైనే వన్‌ప్లస్ 5 కూడా రన్ అవుతోంది.

డిజైన్ పరంగా OnePlus 5 బెస్ట్ లుక్‌ను ఆఫర్ చేస్తోంది. వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన అన్ని వన్‌ప్లస్ ఫోన్‌లలో కల్లా OnePlus 5 మరింత స్లిమ్‌గా కనిపిస్తోంది. ఈ ఫోన్ మందం 7.25 మిల్లీ మీటర్లు. బరువు 153 గ్రాములు.

చుట్టుకొలతలు 154.2 x 74.1 x 7.25 మిల్లీ మీటర్లు. ప్రత్యేకమైన అల్యూమినియమ్ యునిబాడి డిజైన్‌తో వన్‌ప్లస్ 5 వస్తోంది. యాంటెనా బ్యాండ్స్ డిజైన్‌ను కూడా పూర్తిగా మార్చివేసినట్లు తెలుస్తోంది. డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్ 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లే (1920 x 1080పిక్సల్స్)తో వస్తోంది. 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ డిస్ ప్లేకు రక్షణ కవచంలా నిలుస్తుంది. ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆధారంగా డిజైన్ చేసిన లేటెస్ట్ వర్షన్ ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్ం పై ఫోన్ బూట్ అవుతుంది.

OnePlus 5 స్మార్ట్‌ఫోన్.. 2.45Ghz క్లాక్ స్పీడును కలిగిన శక్తివంతమైన Qualcomm Snapdragon 835 ప్రాసెసర్‌ పై రన్ అవుతుంది. ర్యామ్ ఇంకా స్టోరేజ్ అంశాలను పరిశీలించినట్లయితే OnePlus 5 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్ లలో అందుబాటులో ఉంటుంది. మొదటి వేరియంట్ వచ్చేసరికి 6జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ కెపాసిటీతో దొరుకుతుంది. రెండవ వేరియంట్ వచ్చేసరికి 8జీబి ర్యామ్ + 128జీబి స్టోరేజ్ కెపాసిటీతో దొరుకుతుంది.

OnePlus 5 స్మార్ట్‌ఫోన్‌కు కెమెరా ప్రధాన హైలైట్. ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన డ్యుయల్ కెమెరా సెటప్.. 16 మెగా పిక్సల్ + 20 మెగా పిక్సల్ కాంభినేషన్‌లో రెండు కెమెరాలను కలిగి ఉంటుంది. 16 మెగా పిక్సల్ కెమెరాను సోనీ IMX398 సెన్సార్ తో తీర్చిదిద్దగా, 20 మెగా పిక్సల్ టెలీఫోటో కెమెరాను సోనీ IMX350 సెన్సార్‌తో తీర్చిదిద్దారు.

ఐఫోన్ 7 ప్లస్ తరహాలో ఈ కెమెరా 'bokeh' ఎఫెక్ట్స్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ కెమెరా వన్‌ప్లస్ 3టీతో పోలిస్తే వేగవంతమైన ఆటో‌ఫోకస్‌ను అందింగలదని కంపెనీ చెబుతోంది. ఈ డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్ మాడ్యుల్ ద్వారా 4కే క్వాలిటీ వీడియోలను రికార్డ్ చేసుకునే వీలుంటుంది. ఫోన్ ముందు భాగంలో అమర్చిన 16 మెగా పిక్సల్ కెమెరా ద్వారా హైక్వాలిటీ సెల్ఫీలతో పాటు వీడియో కాలింగ్‌ను ఆస్వాదించే వీలుంటుంది.

వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్ 3300mAh బ్యాటరీతో వస్తోంది. Dash Chargingను ఈ బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది. ఈ టెక్నాలజీతో ఫోన్‌ను ఒక గంటసేపు ఛార్జ్ చేస్తే చాలు రోజంతా వాడుకోవచ్చు. 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్ వీ5.0, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్‌సీ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఇక సెన్సార్స్ విషయానికొస్తే యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బారో మీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్స్ వంటి సెన్సార్లు ఈ డివైస్‌లో ఉన్నాయి.

పర్‌ఫెక్ట్ దీపావళి గిఫ్ట్...

పర్‌ఫెక్ట్ దీపావళి గిఫ్ట్...

ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో టాప్ పొజీషన్‌లో కొనసాగుతోన్న వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్‌ను మీరు పర్‌ఫెక్ట్ దీపావళి గిఫ్ట్‌గా భావించవచ్చు. ఈ ఫోన్ ఆఫర్ చేసే మెరుగైన యూజర్ ఎక్స్‌పీరియన్స్‌తో మరింత స్మార్ట్ మొబైలింగ్‌ను ఆస్వాదించగలుగుతారు. మార్కెట్లో వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్‌లను Amazon.inతో పాటు Oneplusstore.inలు ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తున్నాయి.

Best Mobiles in India

English summary
This Diwali make your loved ones happy by gifting them the “Killer” flagship OnePlus 5.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X