తక్కువ ధర, హై ఎండ్ మోడల్ ఫీచర్లతో రెండు ఫోన్లు లాంచ్ చేసిన OnePlus.. AI టెక్నాలజీతో ఇయర్‌బడ్స్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ ఇవాళ నిర్వహించిన నార్డ్ సమ్మర్ లాంచ్ కార్యక్రమంలో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. OnePlus Nord 3 పేరిట ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ మీడియాటెక్ 9000 SoCతో 16GB ర్యామ్, 256GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉండనుంది. సాధారణంగా హైఎండ్ మోడళ్లలోనే కనిపించే ట్రై స్టేట్ అలెర్ట్ స్లైడర్‌ను కలిగి ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ 3 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్OS 13 ఆధారంగా పనిచేస్తుంది. మరియు ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 SoCతో Mali G710 MC10GPUను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.74 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు డైనమిక్ రీఫ్రెష్ రేట్ 40-120Hz వరకు ఉంటుంది. మరియు HDR10+ సపోర్టుతో వస్తుందని వన్‌ప్లస్ సంస్థ వెల్లడించింది.

వన్‌ప్లస్ నార్డ్ 3 స్మార్ట్‌ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP సోనీ IMX890 సెన్సార్‌లను కలిగి ఉంటుంది, 8MP ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా సహా సోనీ IMX355 సెన్సార్ మరియు 112 డిగ్రీ ఫీల్డ్ వ్యూను కలిగి ఉంటుంది. మరియు 2MP మ్యాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. ముందువైపు 16MP కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీ సామర్థ్యం మరియు 80W సూపర్‌వాక్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది.
ఈ ఫోన్ ధరలను కూడా సంస్థ విడుదల చేసింది. 8GB ర్యామ్, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.33,999గా ఉంది. అదే 16GB ర్యామ్, 256GB వేరియంట్ రూ.37,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మిస్టీ గ్రీన్, టెంపెస్ట్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌ను జులై 15 నుంచి అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు.

సమ్మర్ లాంచ్ ఈవెంట్‌లో వన్‌ప్లస్ నార్డ్ 3తో పాటు వన్‌ప్లస్ నార్డ్ CE స్మార్ట్‌ఫోన్‌ను కూడా విడుదల చేసింది. వన్‌ప్లస్ నార్డ్ CE 3 8GB ర్యామ్, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.26,999 మరియు 12GB ర్యామ్, 256GB ధర రూ.28,999గా ఉంది. ఈ ఫోన్ ఆగస్టు నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ఆక్వా సర్జ్, గ్రే షిమ్మర్ రెండు రంగులు అందుబాటులో ఉంటుంది.
మరియు వన్‌ప్లస్ నార్డ్ CE 3 ఫోన్ 6.7 అంగుళాల ప్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 782G SoC ఆధారంగా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్OS 13.1 ఆధారంగా పనిచేస్తుంది.

వన్‌ప్లస్ నార్డ్ CE 3 స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. 50MP సోనీ IMX890 సెన్సార్, 8MP ఆల్ట్రావైడ్ లెన్స్‌లు ఉంటాయి. దాంతోపాటు ఎల్‌ఈడీ ప్లాష్ లైట్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. మరియు 80W సూపర్‌వాక్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది.
సమ్మర్ లాంచ్ ఈవెంట్‌లో OnePlus Nord Buds 2R ను విడుదల చేసింది. వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2R ఇయర్‌బడ్స్ ధర రూ.2199గా ఉంది. ఈ ఇయర్‌బడ్స్ రెండు రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. డీప్ గ్రే, ట్రిపుల్ బ్లూ రంగుల్లో లభిస్తాయి. కాల్ మాట్లాతున్న సమయంలో ఏఐ క్లియర్ కాల్ ఆల్గారిథమ్‌తో ఇబ్బందులు లేకుండా చేస్తుందని సంస్థ తెలిపింది. గాలి లేదా ఇతర సౌండ్‌లను తగ్గిస్తుందని తెలిపింది.

ఈ బడ్స్ ఛార్జింగ్ కేస్ 480mAh బ్యాటరీ మరియు ఒక్కో ఇయర్‌బడ్ 36mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఛార్జింగ్ కేస్ 36 గంటల బ్యాటరీ లైఫ్ వస్తుందని సంస్థ తెలిపింది. బ్లూటూత్ 5.3 కనెక్టివిటి మరియు USB టైప్ C పోర్టుతో రానుంది.


Click it and Unblock the Notifications








