వన్‌ప్లస్ ఇండియాకి బ్రాండ్ అంబాసడర్ కావాలనుకుంటున్నారా ?

By Anil
|

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం One plus భారతదేశంలో విద్యార్ధుల పాలిట వరంగా మారుతుంది . OnePlus సంస్థ "స్టూడెంట్ అంబాసిడర్ ప్రోగ్రామ్" అనే సరికొత్త ప్రోగ్రామ్ కి శ్రీకారం చుట్టింది. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా దేశవ్యాప్తంగా క్యాంపస్ నుండి ఎంపిక చేసిన అభ్యర్థులకు 6 నెలల ఇంటర్న్-షిప్ తో పాటు కంపెనీ స్టయిఫండ్ ను ఇస్తుంది.ఈ ప్రోగ్రాం లో OnePlus సంస్థ ఎంపిక అయిన అభ్యర్థులకు లేటెస్ట్ మరియు రిలీజ్ అవ్వని ఫోన్స్ యొక్క యాక్సిస్ను ఇస్తుంది.

 

ఇండియా లో ఉన్న కాలేజీల్లో:

ఇండియా లో ఉన్న కాలేజీల్లో:

ఈ ప్రోగ్రాం ద్వారా ఇండియా లో ఉన్న కాలేజీల్లో విద్యార్థులను ఎంపిక చేసుకొని రిక్రూట్ చేసుకుంటారు.ఎంపిక అయిన విద్యార్థులకు లేటెస్ట్ మరియు రిలీజ్ అవ్వని ఫోన్స్ యొక్క యాక్సిస్ను కంపెనీ ఇస్తుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థులు ప్రొఫెషనల్ ఎక్సపీరియెన్స్ ను పొందవచ్చు.

6నెలల ఇంటర్న్-షిప్ తో పాటు స్టయిఫండ్:

6నెలల ఇంటర్న్-షిప్ తో పాటు స్టయిఫండ్:

ఈ ప్రోగ్రాం లో విద్యార్థులు 6నెలల పాటు ఇంటర్న్-షిప్ చేయాల్సి వస్తుంది. ఈ 6నెలలకు గాను OnePlus సంస్థ స్టయిఫండ్ ను ఇస్తుంది.ఇలా ఇంటర్న్-షిప్ చేయడం విద్యార్థులు కంపెనీ యొక్క విలువలు మరియు వర్క్ కల్చర్ ను తెలుసుకోగలుతారు.

స్మార్ట్ ఫోన్స్ యొక్క తయారీ తెలుసుకోవచ్చు:
 

స్మార్ట్ ఫోన్స్ యొక్క తయారీ తెలుసుకోవచ్చు:

రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్స్ మార్కెట్ లో లభిస్తూ ఉంటుంది ఇలా ఇంటర్న్-షిప్ చేయడం వలన రాబోయే కొత్త స్మార్ట్ ఫోన్ల యొక్క డిజైనింగ్,ఫ్యాబ్రికేటింగ్,కాన్సెప్టుయులైజింగ్ ను తెలుసుకోవచ్చు. అలాగే మార్కెటింగ్ విలువలను పెంచుకోవచ్చు.

 

 

సెప్టెంబర్ 1,2018 నుంచి ప్రారంభం:

సెప్టెంబర్ 1,2018 నుంచి ప్రారంభం:

సెప్టెంబర్ 1,2018 నుంచి ఈ ప్రోగ్రాం మొదలవబోతుంది అని కంపెనీ తెలిపింది. ఇప్పటి వరకైతే ఎలాంటి రిక్రూట్మెంట్ జరగలేదు . ఒక్క సారి రిక్రూట్మెంట్ మొదలయ్యాక విద్యార్థుల యొక్క సామర్థ్యాలను మరియు నైపుణ్యాలను ఇలాంటి కార్యక్రమం వళ్ళ మెరుగుపడుతుంది.

కంపెనీకి ఎలాంటి విద్యార్థులు అవసరం అంటే:

కంపెనీకి ఎలాంటి విద్యార్థులు అవసరం అంటే:

ఫోన్స్ మరియు టెక్నాలజీ ఫై ఆసక్తి ఉన్నవారిని మరియు కొత్త అవకాశం కోసం ఎదురు చూసే వారిని కంపెనీ రిక్రూట్ చేసుకుంటుంది.
OnePlus స్టూడెంట్ అంబాసిడర్ ప్రోగ్రామ్లో పాల్గొనడానికి, మీరు www.oneplus.in/campus ను విజిట్ చేయవచ్చు లేకపోతే campus@oneplus.com మెయిల్ చేయవచ్చు.

 

 

Best Mobiles in India

English summary
OnePlus lets students become its brand ambassadors in India.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X