Home
News

24GB RAM తో OnePlus కొత్త ఫోన్! రాబోయే వారమే లాంచ్. వివరాలు  

By Maheswara

వన్ ప్లస్ సంస్థ నుంచి OnePlus Ace 2 Pro స్మార్ట్ ఫోన్ ఆగష్టు 16న చైనాలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ లాంచ్ కు ముందు, బ్రాండ్ యొక్క అధికారిక Weibo పోస్ట్ ద్వారా ఫోన్‌ని దాని స్పెసిఫికేషన్‌లను టీజ్ చేస్తూ హైప్ చేస్తోంది. ఇటీవల, సంస్థ OnePlus Ace 2 Pro యొక్క RAM మరియు స్టోరేజీ వివరాలను వెల్లడించింది.

సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం 24GB RAM తో వేగవంతమైన ఆన్‌బోర్డ్ మెమరీతో లాంచ్ అవుతుందని నిర్ధారించబడింది. OnePlus Ace 2 ప్రో లో బయోనిక్ వైబ్రేషన్ సెన్సార్ మోటార్ మరియు ప్రామాణీకరణ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 SoC లో రన్ అవుతుందని ఇప్పటికే నిర్ధారించబడింది.

OnePlus New SmartPhone OnePlus Ace 2 Pro To Feature With 24GB RAM And 1TB Storage. More Details Here.

వన్ ప్లస్ Weibo ద్వారా OnePlus Ace 2 Pro గురించి మరిన్ని వివరాలను వెల్లడించింది. ఇది ఇప్పుడు 24GB LPDDR5x RAM మరియు 1TB UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది. SK Hynix ఉత్పత్తి చేసిన ఈ RAM ఒకే సారి 54 యాప్‌లను యాక్టివ్‌గా ఉంచుతుందని మరియు 41 యాప్‌లను బ్యాక్‌గ్రౌండ్‌లో 72 గంటల వరకు రన్ చేయడానికి అనుమతిస్తుంది.

రాబోయే, ఈ OnePlus Ace 2 Pro స్మార్ట్ ఫోన్ ప్రపంచంలోనే 24GB ఆన్‌బోర్డ్ RAMతో వచ్చిన మొదటి ఫోన్ అని చెప్పబడింది. అయితే రెడ్ మ్యాజిక్ 8S ప్రో+ గత నెలలో 24GB RAM + 1TB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌తో లాంచ్ చేయబడుతుంది.

గేమింగ్ ప్రియుల కోసం, OnePlus Ace 2 Pro ఫోన్ 600mm స్క్వేర్ కంటే ఎక్కువ వాల్యూమ్‌ను కలిగి ఉన్న X-యాక్సిస్ లీనియర్ మోటార్‌ను కలిగి ఉంటుందని టీజర్ చెప్తోంది. ఇందులో బయోనిక్ వైబ్రేటింగ్ మోటార్ కూడా ఉంటుంది. ఇంకా, ఈ హ్యాండ్‌సెట్ అల్ట్రా సన్నని ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. మరియు ఇది మునుపటి వన్ ప్లస్ ఫోన్‌ల కంటే 2cm ఎక్కువగా ఉంచబడుతుంది.

OnePlus Ace 2 Pro స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ చైనాలో ఆగస్టు 16న స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు (12:00pm IST) జరుగుతుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సర్టిఫికేషన్ మరియు 450ppi పిక్సెల్ డెన్సిటీతో 6.74-అంగుళాల OLED 1.5K (1,240x2,772 పిక్సెల్‌లు) రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉన్నట్లు నిర్ధారించబడింది.

కెమెరా వివరాలు గమనిస్తే, సెల్ఫీ షూటర్‌ను ఉంచడానికి డిస్‌ప్లే మధ్యలో హోల్ పంచ్ కటౌట్‌ను పొందుతుంది. ఇది స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 SoC తో పనిచేస్తుంది మరియు ఇందులో 150W సూపర్ ఊక్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీ కలిగి ఉంటుంది.

ఇంకా, వన్ ప్లస్ సంస్థ కొత్త గా ఫోల్డబుల్ ఫోన్ ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ యొక్క ఖచ్చితమైన పేరు మరియు లాంచ్ తేదీ వివరాలు అస్పష్టంగా ఉన్నప్పటికీ, వన్ ప్లస్ ఈ సంవత్సరం తన మొదటి ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ ను చాలా కాలంగా ధృవీకరించింది.

More from GizBot

Best Mobiles in India

English summary
OnePlus New SmartPhone OnePlus Ace 2 Pro To Feature With 24GB RAM And 1TB Storage. More Details Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X