Home
News

వన్ ప్లస్ నుండి కొత్త ఫోన్ లు,అందుబాటు ధర లోనే!

By Maheswara

వన్ ప్లస్ ఫోన్లు అంటే ధర ఎక్కువ ఉంటుంది లే అని కొనడానికి చాలా మంది వెనకడుగు వేస్తుంటారు అలంటి వారిని దృష్టిలో ఉంచుకొని.అందరికి అందుబాటులో ఉండే ధర లలో కూడా ఫోన్లు లాంచ్ చేయాలని వన్ ప్లస్ నిర్ణయం తీసుకుంది.

జులై 2020

2015 లోనే తక్కువ బడ్జెట్ ధర లో Oneplus X ఫోన్ ను లాంచ్ చేసినప్పటికీ అది అంతగా విజయం సాధించలేదు. మళ్ళీ ఆ పొరపాటును చేయకూడదనే ఉద్దేశంతో జులై 2020  లో మరో మూడు కొత్త ఫోన్లు లాంచ్ చేయడానికి సిద్ధమౌతోంది.

ఊహాగానాల ప్రకారం పేర్లు

ఊహాగానాల ప్రకారం పేర్లు

ఇప్పటి వరకు తెలిసిన ఊహాగానాల ప్రకారం వాటి పేర్లు OnePlus 8 Lite, OnePlus Nord మరియు OnePlus Z ఉండవచ్చు అని అంచనా. వివిధ మాధ్యమాల ద్వారా వన్ ప్లస్ సీఈఓ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే పై వివరాలు తెలుస్తాయి.

జులై లాంచ్

జులై లాంచ్

బడ్జెట్ ధరలో వచ్చే వన్ ప్లస్ ఫోన్లు జులై లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.తొలుత ఇండియా మరియు యూరోప్ లో ఆ తర్వాత ఉత్తర అమెరికాలో లో విడుదల చేయాలని చూస్తున్నట్లు వన్ ప్లస్ ఫోరమ్ లో తెలియచేసారు.

OnePlus Z ఫీచర్లు

OnePlus Z ఫీచర్లు

వన్ ప్లస్ z పేరు తో రావొచ్చని భావిస్తున్న కొత్త ఫోన్ ఫీచర్ లు ఇలా ఉండవచ్చు అని అంచనా.
6.55 ఇంచులు OLED స్క్రీన్ ,ఈ స్క్రీన్ పంచ్ హోల్ కెమెరా సెన్సార్ మరియు 90HZ రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది.అలాగే స్నాప్ డ్రాగన్ 765 soc ప్రాసెసర్ మరియు 5G సపోర్ట్ తో ఉంటుంది.ఇక మెమరీ మరియు కెమెరా వివరాలకు వస్తే  6GB ర్యామ్,128GB స్టోరేజ్ ,3 కెమెరా ల తో ఉండే అవకాశాలు ఉన్నాయి.వెనక వైపు 48MP ప్రైమరీ కెమెరా ,16MP వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2MP మాక్రో లెన్స్ కెమెరా ఉండవచ్చు.30W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉండే అవకాశం ఉంది.

ధర వివరాలు

ధర వివరాలు

అధికారికంగా ధరలు ప్రకటించనప్పటికీ విడుదల అయినా ఊహాగానాలు మరియు అంచనాల ప్రకారం OnePlus z ధర రూ.24,990 లు ఉండవచ్చు అన్ని అంచనా.ఈ ధర సాధారణ వన్ ప్లస్ 8 ఫోన్ ధరతో పోలిస్తే రూ.17,000 లు తక్కువ.
రూ.24,990 ల వద్ద మిడ్ రేంజ్ ఫోన్ల క్యాటగిరీ లో OnePlus z ఫోన్ ఇతర బెస్ట్ సెల్లింగ్ ఫోన్లకు మంచి పోటీ గా నిలిచే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Oneplus new smartphones at affordable prices,here are full details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X