Home
News

OnePlus Nord 2 స్మార్ట్ ఫోన్ మళ్ళీ పేలింది ! మూడు నెలల్లో రెండో సారి.

By Maheswara

OnePlus యొక్క OnePlus Nord 2 5G స్మార్ట్‌ఫోన్ మళ్ళీ పేలిన సంఘటన భారత దేశంలో చోటుచేసుకుంది. OnePlus Nord 2 5G బ్లాస్ట్ యొక్క తాజా సంఘటన ట్విట్టర్‌లో కలకలం రేపింది. ట్విట్టర్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన లో వినియోగదారుకు తీవ్రమైన గాయాలు కలిగించే కొన్ని చిత్రాలను కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేయబడింది. ఈ OnePlus Nord 2 5G పరికరం పేలిపోవడానికి కారణం ఏమిటి? దీనిపై కంపెనీ ఏం స్పందించిందో వివరాలు తెలుసుకుందాం.

OnePlus Nord 2 5G స్మార్ట్‌ఫోన్ పేలింది

OnePlus Nord 2 5G స్మార్ట్‌ఫోన్ పేలింది

OnePlus Nord 2 5G పేలుడుపై OnePlus ఇంకా వ్యాఖ్యానించలేదు. అయితే, ఈ విషయాన్ని అర్థం చేసుకునేందుకు కంపెనీ తమను సంప్రదించిందని బాధిత వినియోగదారు ఇప్పుడు పేర్కొనడం గమనార్హం. OnePlus Nord 2 5G పేలడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి.

స్మార్ట్‌ఫోన్ పేలడం తో వినియోగ దారునికి తొడ ప్రాంతంలో తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. మహారాష్ట్రకు చెందిన ఒక వినియోగదారు తన ప్యాంటు జేబులో స్మార్ట్ఫోన్ పెట్టుకుని ఉండగానే  OnePlus Nord 2 5G స్మార్ట్‌ఫోన్ యూనిట్‌ పేలుడు సంభవించింది, అని ట్విట్టర్ లో తెలిపారు. అతడి ప్యాంట్‌లోపల స్మార్ట్‌ఫోన్ పేలడంతో తొడలపై తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా కాలిన గాయాల చిత్రాలను కూడా తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశాడు.

OnePlus Nord 2 5G పేలడంతో వినియోగదారుకు తీవ్ర గాయాలైనట్లు ఫోటోలు చూపిస్తున్నాయి. ఈ సమస్యను తొలిసారిగా నవంబర్ 3వ తేదీ బుధవారం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రారంభ ట్వీట్ ప్రచురించబడిన కొద్దిసేపటికే, సమస్య గురించి అదనపు సమాచారాన్ని అందించడానికి ట్విట్టర్‌లో ప్రత్యక్ష సందేశాలను జోడించమని OnePlus మద్దతు బృందం వినియోగదారులను కోరింది.

ఈ ప్రమాదం గురించి OnePlus ఏం చెబుతోంది?

ఈ ప్రమాదం గురించి OnePlus ఏం చెబుతోంది?

అయితే, కంపెనీ తన వైపు నుండి ఇంకా ఎలాంటి వివరాలను అందించలేదు. అయితే ఈ విషయం సోమవారం పత్రికల్లో ప్రచురితమై ప్రజల దృష్టికి వచ్చింది. వినియోగదారు తన అసలు ట్వీట్ నుండి కంపెనీకి ప్రతిస్పందించారు. OnePlus Nord 2 5G పేలినప్పటి నుండి కంపెనీ తనతో "నిరంతర సంప్రదింపులు" కలిగి ఉందని అతను పేర్కొన్నాడు.ఈ విషయంపై OnePlus నుండి వ్యాఖ్య కోసం చేసిన అభ్యర్థనకు కంపెనీ స్పందించలేదు. 91మొబైల్స్ ప్రకారం, OnePlus "విచారణ వివరాలను సేకరించే ప్రక్రియలో ఉంది." అని కంపెనీ నిర్వాహకులు చెప్పారు. OnePlus Nord 2 5G గత జూలైలో ప్రారంభించబడిన ప్రముఖ మిడ్-రేంజ్ మోడల్ అయిన OnePlus Nord యొక్క అప్‌గ్రేడ్ మోడల్‌గా పరిచయం చేయబడింది.

మూడు నెలల్లో రెండు సార్లు ఈ స్మార్ట్‌ఫోన్ పేలింది

మూడు నెలల్లో రెండు సార్లు ఈ స్మార్ట్‌ఫోన్ పేలింది

లాంచ్ చేసిన మూడు నెలల్లో,ఈ కొత్త OnePlus ఫోన్ కనీసం రెండుసార్లు పేలింది. ఇదే సందర్భంలో, OnePlus తన OnePlus Nord 2 5G ఫోన్ పేలిపోయిందని ఆరోపించిన వినియోగదారుకు లీగల్ నోటీసును కూడా పంపింది. అదేవిధంగా ఫోన్‌తో పాటు, OnePlus Nord 2 5G ఛార్జర్ కూడా ఇటీవల పేలింది. అయితే ఈ విషయంలో బయటి కారణాలను ఆపాదించి కంపెనీ తప్పించుకోవడం గమనార్హం.

OnePlus Nord 2 Pack-Mac ఎడిషన్

OnePlus Nord 2 Pack-Mac ఎడిషన్

ఇది ఇలా ఉండగా,కంపెనీ OnePlus Nord 2 యొక్క Pack-Mac ఎడిషన్ ను లాంచ్ చేయడానికి సిద్దమవుతుంది. OnePlus Nord 2 Pack-Mac ఎడిషన్‌ను ప్రారంభించటానికి కొద్ది రోజుల ముందు ఈ పేలిన తాజా OnePlus Nord 2 స్మార్ట్‌ఫోన్ పేలుడు OnePlus అభిమానులలో తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం ఈ కొత్త ఫోన్‌ను అమెజాన్‌లో టీజ్ చేయడం గమనార్హం. OnePlus Nord 2 Pac-Mac Edition స్మార్ట్‌ఫోన్ ధర రూ. 37,999 ధరలో లభిస్తుంది.

Best Mobiles in India

English summary
OnePlus Nord 2 5G Smartphone Explodes Again In India. Causing Severe Burns To Users.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X