OnePlus Nord 2 ఓపెన్ సేల్ లో ఊహించని డిస్కౌంట్ ఆఫర్లు...

|

ఇండియాలో గత వారం లాంచ్ అయిన వన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అమెజాన్ మరియు వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయడానికి వినియోగదారులకు అందుబాటులో ఉంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డులను కలిగిన కొనుగోలుదారులు అదనంగా తమ లావాదేవీలపై 1,000 రూపాయల వరకు తగ్గింపును పొందుతారు. అమెజాన్‌లో ఇటీవల నిర్వహించిన ప్రైమ్ డే అమ్మకం సందర్భంగా అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు ఇది ఓపెన్ సేల్ కోసం అందుబాటులో ఉంది.

OnePlus Nord 2 ధరలు

OnePlus Nord 2 ధరలు

వన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుత అమ్మకంలో రెండు మోడళ్లలో లభిస్తుంది. ఇందులో బేస్ మోడల్ 6/8 GB ర్యామ్, 128GB స్టోరేజ్ యొక్క ధరలు వరుసగా రూ. 27,999 మరియు రూ. 29,999 కాగా, టాప్-ఎండ్ మోడల్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్‌ మోడల్ యొక్క ధర రూ.34,999. వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డు కొనుగోలు మీద యూజర్లు రూ.1000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

OnePlus Nord 2 స్పెసిఫికేషన్స్

OnePlus Nord 2 స్పెసిఫికేషన్స్

OnePlus Nord 2 ఫోన్ ఆక్సిజన్ OS 11.3 పై రన్ అవుతుంది. ఇది ఈ OS కొత్త డార్క్ మోడ్ మరియు వన్‌ప్లస్ గేమ్స్ యాప్ తో వస్తుంది. ఇది గేమ్ ఫిల్టర్‌లను కూడా అందిస్తుంది మరియు డిస్కార్డ్‌కు మద్దతును ఇస్తుంది. అలాగే ఇది ప్రీమియం వన్‌ప్లస్ పరికరాల యొక్క అదే ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ యూజర్ అనుభవాన్ని అందిస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే ఇది 6.43 "Fluid AMOLED డిస్ప్లే 90 Hz కలిగి ఉంది.

ఆప్టిక్స్

అలాగే ఆప్టిక్స్ విషయానికి వస్తే 50 MP సోనీ IMX766 సెన్సార్ మెయిన్ కెమెరాను ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మరియు డిజిటల్ ఓవర్లాప్ HDR (DOL-HDR) మద్దతుతో అందిస్తుంది. ఇది నైట్ స్కేప్ అల్ట్రా, నైట్ పోర్ట్రెయిట్, OIS, AI వీడియో వృద్ధి, AI ఫోటో వృద్ధి మరియు డ్యూయల్ వ్యూ వీడియో వంటి ఫీచర్లతో వస్తుంది. ఇంకా ఈ ఫోన్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2 MP డెప్త్ సెన్సార్ కెమెరాలను కలిగి ఉంటుంది. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందుభాగంలో 32 MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 6/8/12GB RAM మరియు 128/256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో లాంచ్ అయింది.

4500 mAh బ్యాటరీ

4500 mAh బ్యాటరీ

వన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్‌ఫోన్‌ 65W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 4500 mAh భారీ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది నార్డ్ వలె, నార్డ్ 2 లో వైర్‌లెస్ ఛార్జింగ్ లేదా ఐపి రేటింగ్ మద్దతు లేదు. ఈ పరికరంలో స్టీరియో స్పీకర్ సెటప్, వై-ఫై 6, బ్లూటూత్ 5.0 మరియు మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.ఈ కొత్త వార్ప్ ఛార్జ్ 65 ఛార్జింగ్ తో 15 నిమిషాల్లో రోజు మొత్తానికి కావలసిన బ్యాటరీ ని ఛార్జ్ చేయగలరు.

Best Mobiles in India

English summary
OnePlus Nord 2 5G Smartphone Open Sale Live on Amazon and OnePlus Website

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X