Home
News

OnePlus నార్డ్‌ 3 5G స్మార్ట్‌ఫోన్‌ వివరాలు లీక్‌.. ధర, ఫీచర్లు, విడుదల తేదీ..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ OnePlus నుంచి కొత్త ఫోన్‌ Nord 3 5G త్వరలో విడుదల కానుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ గురించి వన్‌ప్లస్‌ ఎటువంటి వివరాలు బహిర్గతం చేయలేదు. కానీ నార్డ్‌ 3 ఫోన్‌ గురించి కొంత సమాచారం లీక్‌ అయింది. ఫోన్‌ డిజైన్‌, స్టోరేజీ, ధర వంటి వివరాలు లీక్‌ అయ్యాయి.

వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 5G స్మార్ట్‌ఫోన్‌ వివరాలను టిప్‌స్టర్‌ Roland Quandt ద్వారా లీక్‌ అయ్యాయి. నార్డ్‌ 3 5G స్మార్ట్‌ఫోన్‌ 6.74 అంగుళాల 1.5 అమోలెడ్‌ స్క్రీన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు డిస్‌ప్లే రీఫ్రెష్‌ రేట్ 120Hzగా ఉంటుందని తెలుస్తోంది. మరియు ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 9000 చిప్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది.

OnePlus Nord 3 5G

నార్డ్‌ 3 5G ఫోన్‌ 50MP ప్రైమరీ కెమెరా, 8MP ఆల్ట్రావైడ్‌ మరియు 2MP కెమెరాలు కలిగి ఉంటుందని సమాచారం. మరియు డిస్‌ప్లే కిందనే 16MP సెల్ఫీ కెమెరా ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌ 5000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుందని మరియు 80W ఛార్జర్‌ను సపోర్ట్‌ చేస్తుందని తెలుస్తోంది.

విన్‌ప్యూచర్‌ ద్వారా లీక్‌ అయిన సమాచారం ప్రకారం.. నార్డ్‌ 3 5G స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్‌ LED ప్లాష్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఫోన్‌ కింది భాగంలో స్పీకర్‌ యూనిట్‌ ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 13 OS ఆధారిత ఆక్సిజన్‌ OS 13ను వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 5G స్మార్ట్‌ఫోన్‌ కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు డిస్‌ప్లే పైనే ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌ కలిగి ఉండనుందని తెలుస్తోంది.

8GB ర్యామ్‌ మరియు 128GB అంతర్గత స్టోరేజీ ఫోన్‌ ధర 449 యూరో (భారత కరెన్సీలో రూ.39,900 సుమారుగా), అదే 16GB ర్యామ్‌ మరియు 256GB వేరియంట్‌ ధర 549 యూరో (భారత్ కరెన్సీలో రూ.48,000), అయితే భారత్‌లో విడుదల సమయంలో నార్డ్‌ 3 5G స్మార్ట్‌ఫోన్‌ మరింత తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

OnePlus Nord 3 5G

ప్రస్తుత ధర భారత్‌లో ఉన్న వన్‌ప్లస్‌ 11Rకు పోటీ ఇచ్చే అవకాశం ఉంది. భారత్‌లో ఈ ఫోన్ 8GB వేరియంట్‌ సుమారుగా 35000 రూపాయల కంటే తక్కువ మరియు 16GB వేరియంట్‌ ధర సుమారుగా 40000 రూపాయల కంటే తక్కువకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

చైనాలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వన్‌ప్లస్‌ ఏస్‌ 2Vకి... నార్డ్‌ 3 5G రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా ఉంటుందని సమాచారం. మరియు ఈ ఫోన్‌ బ్లాక్‌, గ్రీన్‌ రంగుల్లో భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు లీక్‌ అయిన సమాచారం ప్రకారం వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 5G స్మార్ట్‌ఫోన్‌ జూన్‌ 16న లేదా ఆ తర్వాత భారత్‌లో విడుదల అయ్యే అవకాశం ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
OnePlus Nord 3 5G smartphone details leak may get launched on or after June 16 in India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X